RSS

           "ఆకాశమంతా"  సినిమా చూసివచ్చామండి. పిల్లా పాపలతొ  కలసి చూడచ్చు. ఎప్పుడొ గీతాంజలి చూసాను ఆ తరువాత  ఇదే (ఆంధ్రా లో)

 ' నాతొ కాకుండా నీతొ చెప్పిందా ' అని ప్రకాష్ రాజ్ అడిగితే కొన్ని విషయాలు తల్లి  తోనె చెబుతారు. అని భార్య జవాబు. నా కనిపించింది. ఇది లోక సహజము. మా ఇంట్లో మాత్రం  ఉల్టా. మా పిల్లలిద్దరూ  కూడా ముందు వాళ్ల  డాడీ  కే చెప్పారు. ఆ తరువాతే నాకు. అలాగే వాళ్లు కోరుకున్నట్లు గానే చేసాము. మన పెద్దవాళ్లకు మన పిల్లల మీద  నమ్మకము వుండాలి. చిన్నతనంనించి  వాళ్లకి మనమీద ఓ నమ్మకము , చనువు ,దగ్గరతనము,చక్కని  స్నేహ బంధము  ఏర్పరచుకుంటే , వాళ్ళకున్న చిన్న చిన్న అనుమాలనుండి పెద్ద పెద్ద వ్యవహారాలు  కూడా మనతొ మాట్లాడి చర్చించి పరిష్కారాలు చూసుకుంటారు. కానీ  ఈ మమతల వారధి ఒక్క రోజు లొ తయారవదు. పుట్టినప్పటి నుండి ఉగ్గుపాలతొ ప్రేమ మమకారం, ఆత్మనిబ్బరం ,ఆత్మస్థయిర్యం స్నేహం, వీటితొ ఆ వారధి నిర్మించుకొవాలి. అలాటి వారధికి నాలాటి  లేడి హిట్లర్   పిల్లరు గా వుండాలి. ఆయన  చాలా మంచి డాడి. ఆమ్మే  కొంచం---(ఇద్దరి లొ ఒకరు స్ట్రిక్టు గా వుండాలి. క్రమశిక్షణ,పట్టుదల నేర్పాలి తప్పదు)

        భగవంతుని దయవలన  పిల్లలిద్దరూ  ట్యూషన్సు,లేకుండా ఇంజనీరింగు డిస్టింక్షన్ లో వచ్చారు.   వాళ్ళ గమ్యం వాళ్ళు ముందరే నిర్ణయించుకొని   మంచి ఉద్యోగాల్లో చేరి,జీవిత భాగస్వాములని  వాళ్ళు కొరుకున్నట్లుగా , మా  ఇరుపక్షాల వారి ఆమోదంతొ వివాహము చేసుకున్నారు.  మాకు మనవడు, మనవరాలు(అమ్మాయి పిల్లలు) అల్లుడంటే   మా పిల్లలకంటే ఎక్కువ మాకు. మా అబ్బాయి కి ఓ పాప. (  రెండు సం'లు)   అందరూ తెలుగు లోనే నొరార  తాతయ్యా  అమ్మమ్మా అని , మా చిన్న మనవరాలు నాన్నమ్మా  అని పిలుస్త్తారు. ఇంతకీ ఈ సోది ఎందుకంటే ఒకళ్ళు  ముద్దు చేసినా రెండొ వాళ్ళు నాలా హిట్లర్ లా వుండాలి మరి. ఇదండి సంగతి.

పతే పరమేశ్వర్ ఇల్లే వైకుంఠం

    ఇల్లు చూస్తే వైకుంఠమే అన్ని అమర్చిపెట్టాడు."బాబా.ఇప్పుడు ఇంటికి లక్ష్మి ని తెచ్చాడు.  ఏం పేరు అమ్మా? అని అడిగినావిడ వైపు చూస్తూవుండిపోయాను. ఏమీ అర్దమ్ కాక, ఆవిడ అడిగినది మరాఠి భాషలొ. ఇంతలొ ఈయన వచ్చి నీ పేరు చెప్పు. అని ఈవిడ ,పాలు తెస్తారు. పేరు గంగమ్మ. అంటే పాలు కూడా అలాగేవుంటాయి.  నవ్వుతూ  ఇంత పెద్ద బొట్టు తొ  తొమ్మిది గజాల చీరతొ  కలకలాడుతూ   వున్నారావిడ. నా పేరు లక్ష్మి అని.  ఆవిడ పేరు విని ఇల్లు వైకుంఠము ,పేరు  లక్ష్మి. అచ్ఛా హై" అంటూ వెళ్లిపొయింది.ఆ తరువాత తెలిసింది ఆవిడ ఒక చిన్న భూస్వామిని బాగా చెరకు తోటలు అవి వున్నాయనీను,పాలు మాత్రం నీళ్ళలా పొస్తుందనీను   కాని చాలా అప్యాయంగా పొద్దునే వచ్చి  నిద్ర లేపి బాబా అని పాలు పోసి వెడుతుందనీను ఆవిడకు  గంగమ్మపేరు ఈయన పెట్టారనీను.  పూనాలొ మేము వున్నచొట ఓ పది తెలుగు కుటుంబాలు వుండేవి. మా పెళ్లి నాటికి  ఆరు సంవత్సరాలు ముందరే అన్ని  అధునాతన వస్తువులు కొనిపెట్టేసారట. గ్యాసు సిలిండరు డిపాజిట్టు 70 రూ" హకిన్సు కుక్కరు75రూ" రికో మిక్సి 100రూ" లోపులొనట.అవి అప్పుడే మార్కెట్ లో కి వచ్చాయట. ఇవే కాక రికార్డు ప్లేయరు,యు ఫొమ్ పరుపు , టేబుల్ ఫాను,రెండు గదుల యిల్లు తన పేరు మీదే అద్దెకి. ఇల్లు దొరకడమంటే చాలా కష్టమట.అప్పట్లొ. ఏవొ పగిడిలు అవి వుండేవట. అంతే కాకుండ విడిగా ఇంట్లొ నీళ్ల పంపు.తెలుగు పుస్తకాలు, కారమ్స్ బోర్డు, ఇన్స్టంటు కాఫీ పౌడరు ( నెస్కాఫే) ఇవి  అన్ని వుంటే ఆ యిల్లు స్వర్గమా వైకుంఠమా  చెప్పండి మరి.

        (అప్పటి జీతము ఎంతనుకున్నారు? కేవలమ్ 400రూ"  కొత్త ఐటమ్స్ కొనాలన్న కోరిక, అభిరుచి అంతే)

    మిగిలిన తెలుగు  వారు అప్పటికే పెళ్ళి అయి ఓ పిల్ల పాపలతొ వున్నవారేను, కాని ఇంకా వాళ్ల యిళ్లలొ యివి ప్రవేశించలేదు. భార్యలు పురిటికి వెళ్లిన బర్తలకు ,ఇంటికి ఎవరయిన చుట్టాలు వచ్చినా  ఈయనగారి ఇల్లు ఓ రిక్రియేషను హాలు. కారమ్స్ ఆడుకొందుకు,పసి పిల్లలు ఇంట్లొ వుంటె యడపిల్లలకి అడుకునే గ్రౌండు,సాహితి ప్రియులకు పుస్తకాలు,సంగీత ప్రియులకు బోలెడన్ని రికార్డులు,అవీ మాములువా చక్కటి కర్నాటక సంగీతము ( ఎమ్.ఎస్ సుబ్బలక్ష్మి, చిట్టిబాబు, లాల్గుడి జయరామన్ ఇంకా యిలాంటి మహనీయుల వారివి) చక్కని కాఫీ కి గంగమ్మగారి పాలు.ఒక్క మనిషి కి లీటరున్నరపాలు రోజూను. ఇంక ఎవరి ఇంట్లొ ఏ సరుకు నిండుకున్నాసరే ఈయన గారి ఇంట్లొంచి నడచి వెళ్లిపోయేవట. ఇలా అందరికి అన్ని యిచ్చెవారు. కాని వెనక్కి మాత్రం వచ్చెవి కావట.అలా అందరికి మంచి మిత్రుడి గా వుండేవారట. ఇదీ  అందరికి తెలిసిన సత్యం.నేను పెళ్లయి వచ్చిన తరువాత ఓ పది  పదిహేను  రోజులయినా సామాను తెచ్చియివ్వలేదు. నేను వచ్చేముందు మా అమ్మమ్మగారు(మా అత్తగారు)ఒక లిస్టు రాసి యిచ్చి ఓ పది రోజులు చూసి అడిగి తెచ్చుకో, వాడితొ పెట్తుకోకు, పిల్లాడు తింటాడుకదా అని ఊరగాయలు ,పొడిలు, పచ్చళ్ళు యిస్తే అన్ని ఊళ్ళోవాళ్లకి సారె పంచేస్తాడు అని ఛెప్పనే చెప్పారు. నేను వెళ్లి అడిగినందుకు కొన్ని యిచ్చారు,కొన్ని యివ్వలేదు కొన్ని ఎక్కడ వున్నాయొ కూడా తెలియలేదు. ఎప్పుడయిన సినిమా కి వెడితె నువ్వు తెచ్చేవయ్బా టిక్కెట్లు అనెవారు. కాని ఎప్పుడు డబ్బులు యివ్వగా చూడలేదు.నా కనిపించేది ఈయన మంచితనాన్ని చేతకానితనంగా చూస్తున్నారా? నా సందేహాన్ని అయనకు చెబితే అలాంటిది ఏమీ కాదు  అంతా నీ భ్రమ. కొన్ని రోజుల తరువాత మెల్లిగా శక్తికి మించి ఏ సహాయము చేయకూడదు. అపాత్రదానము చేయకూడదు  అంతే కాదు  మీరంటే నేనె, నేనంటె మీరేకదా ఏమి లేకపోతే ఎందుకు  చెబుతాను అసలు మనం ఎలా వుండాలి ,మీకు దెబ్బ తగిలితే నీళ్ళు నా కంట రావాలి.నాకు  ముల్లు గుచ్చుకుంటే  నొప్పి మీకు కలగాలి. ఆ తరువాత కొన్ని రోజులకు నిజంగా మా వారు పరమేశ్వర్ అయిపోయారు. ఇదండి సంగతి. ఇంత కధ వుంది పతే పరమేశ్వర్ ఇల్లె వైకుంఠంలొ.

Friday, April 24, 2009

ఆంధ్ర దేశంలో నా మొదటి ఓటింగ్

            ఆబ్బా' ఇన్ని రోజులకు మొదటిసారిగా మన ఆంధ్రా లొ ఓటు వేసానండి అసలు ముందర వెయ్యకూడదు అని అనుకున్నాను. తప్పుల తడికల ఓటరు కార్డు చూసి, కాని అందరివి  ఇంచుమించుగా ఏదో తప్పులతోనే వున్నాయని తెలిసి , నా అస్థిత్వము నిలబెట్టుకుందుకు వెళ్లెందుకు తయారయ్యాను. ఇంక అప్పుడు మొదలయింది అసలు  ఎవరికి వెయ్యాలి?అని. ఇదివరకు పూనాలో  వేసినప్పుడు రెండు సార్లు నేను వేసిన అభ్యర్ధి గెలిచారు. రెండు సార్లు ఓడిపోయారు. సో ఇప్పుడు?

           అభయహస్తముందంట, అభయమూర్తి నీవంటా లేక ముత్యమంతా పసుపూ----ఎందుకంటే  నా ఉద్దేశ్యంలొ పదవిలో కి వచ్చిన తరువాత అందరూ ఒకటే.

ధరవరలంటారా పచ్చిమిరప కాయకు, పట్టు చీరకు ఏం ఖరీదో తెలియదు. సరే వెళ్లామండి, లిస్టులొ పేర్లు లేవన్నారు. ఇంతలొ ఫ్రెండు ఒకరు కనిపించి వెళ్ళిపోతున్నారేమిటి అని ,తెలిసికొని మీ పేర్లు వున్నాయని చెప్పి తీసుకువెళ్లారు. సరే అయనకు థాంక్సు చెప్పి  క్యూ లొ నిలబడ్డానండి. జీవితంలొ మొదటిసారిగా యిలాంటి సంభాషణ విన్నానండి.నా ముందు నిలబడిన ఇద్దరిది.

       మొదటి ఆమె : రాత్రి 2గంటలకు వచ్చి మనిషి కి మూడు వందలు యిచ్చారుట. అందుకని రాత్రి తలుపులు తీసిపెట్టి పడుకున్నాము.

        రెండొ ఆమె :అవునా, నయ్యం కాదు, దొంగలు వచ్చివుంటే , అయినా మా ఇంటి దగ్గర రెండు వందలే యిచ్చారు. మీ కిచ్చింది ఎవరు?

         మొదటి ఆమె: పలానా----

          రెండొ ఆమె : అవునా, -------తక్కువ యిచ్చారు,  నాకు ఏక్ దమ్ షాక్.  ఇంతవరకు చదవడము వినడమే కాని నా ఛెవులతొ వినడం మొదటిసారి,

       ఇంతలొఈంకో ఆవిడ డబ్బులు తొ వేస్త్తారా, వీళ్ల  పిచ్చి కాని సుభ్రంగా తీసికొని వాళ్లకు కావలసిన వాళ్లకే వేస్తారు. తెలివిగా, ఎవరికి ఓటు వెయ్యాలొ చక్కగాతెలుసు యిప్పటి జనాలకు. అయ్యబాబోయ్ ,ఏం తెలివి తేటలండి, నా సమస్య తీరిపొయింది. నేను నా ఓటు -----వేసి వచ్చాను. 

           నేను ఎవరికి వేసానంటారా? అమ్మో నాకు తెలివి వచ్చెసిందండి. ఏ పార్టీ నెగ్గితే ఆదే నా పార్టి.

             ఇదండి సంగతి.  

నా మొదటి బ్లాగ్

           బ్లాగ్ మిత్రులకు నేను కూడా మీతో కలవాలని వచ్చెస్తున్నానండోయ్. అసలు ఏమయిందంటే సొమవారము సప్తగిరి లొ ఈ-తెలుగు చూసినతరువాత నాకు ఏదొ రాయాలని ,బాగా అనిపించేస్తోంది మరి. ఎందుకంటె  ఇంతమంచి  వేదిక వుండగా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు దూరముగా వున్నవారు ఒక్క  తండ్రితో తప్పితే తెలుగు మాత్రమే వచ్చిన తల్లితొ  కమ్యూనికేషను పెట్టుకొవడము లేదు ఎందుకంటారు?  ఎందుకంటే నా స్నేహితులుపిల్లలు విదేశాలలొవున్నారు.వాళ్లు తండ్రితొ చాట్ చేస్తారు మెయుల్ పంపుతారు. తల్లిని అడుగుతారు,ఈ తల్లి ఎదో చెపుతుంది రాయమని ఆ తండ్రి ఇంగ్లీష్ లొ రాస్తాడు. అందవలసిన విషయము అందుతుంది కాని ఆవిడకు అనుమానమేను. ఈయన సరిగ్గా రాసారొ లేదో లేక పిల్లలు రాసినది ఈయన చెప్పారొ లేదో అని.

         మళ్ళి ఇందులొ కూడా ఒక తంటా వుందండి.ఆంధ్రాలొ చదివినవారికి కొంత తెలుగు వస్తుంది కాని పరాయి రాష్ట్రములొ వున్నపిల్లలకు తెలుగు రాదండి,మాట్లాడుతారు,కాని చదవడము రాయడము రాదు.వారికి ఇది బాగా ఉపయొగిస్తుందికదండి . ఇంటిలొ కంప్యూటరు  వుండి దాన్ని శుబ్రము మాత్రమే చేసే తల్లి కూడాఈ -తెలుగు  వేదిక ద్వారా తన పిల్లలతొ చక్కగా మనసారా సంబాషించుకొవచ్చుకదండీ, ఇలాగే నా మనస్సులొ ఏవో ఆలొచనలు మీతొ పంచుకోవాలని నా ఆశ. ఏమంటారు?

           

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes