RSS

వర లక్ష్మి వ్రతం---మూడవ టపా

    ఇదివరకు ఓ ఆవిడ రోజు ఉదయమె లేచి పొయ్యి వెలిగించి నిప్పు రాజేసెదట. దాన్నించి పక్కావిడ, ఆ పక్కావిడా, అలా అలా ఊరంతా నిప్పు తీసుకొని పొయ్యిలు వెలిగించెవారట.( ఆప్పట్లొ పొయ్యి వెలిగించడం ఓ పెద్దపని.)ఓ రోజు నేనె ఎందుకు వెలిగించాలీ? అని మానేసిందట.ఏమవుతుంది, ఆవిడ కాకపొతే ఇంకొకరు,పని ఆగదుకదా? అలాగా నాకు ఎందుకు చెప్పండి?నేను మా పిల్లల దగ్గర లేను కదా,వాళ్లు ఎలాగొ పూజ చేసుకుంటారు, అయినా నాకు బెంగ, టెన్షన్.ఎలా చేసుకుంటారొ అని, అందుకని ఏదో ఒకటి చెప్పాలనిపిస్తుంది.చెప్పేసాననుకోండి, నాకు నిద్ర పడుతుంది.అందుకని-----

    మా పిల్లలకేకాకుండా అత్తలు, అమ్మలు, దగ్గరలేకుండా, ఉద్యోగరీత్యా దూరంగా వుండే అమ్మాయిలందరికీను----

పూజ విధానంతెలిసినవారయితే తెలియనివారికి చెప్పండి.నా కయితే ( 18 సంవత్సరాలవయసు) అప్పట్లొ ఎమి తెలియదు. మా అమ్మగారు, మా అమ్మమ్మగారు(అత్తగారు) చెరొ ఉత్తరం రాసేసి మంగళగౌరి , వరలక్ష్మి పూజా చేసేసుకొమ్మన్నారు.ఉత్తరాల్లొ రాసారనుకొండి,ఎలా చేసుకొవాలోను,ఇంక ఆఉత్తరాలు, దేవుడి పుస్తకాలతొ నా కుస్తీ.ఇప్పట్లొలాగా, కెసట్లు, సి.డిలు, ఎమీ లేవుకదా మరి. అయ్యొ రామా, ఏదో వ్రాయ బోయి ఏదో వ్రాస్తున్నాను. ట్రాక్ తప్పుతున్నాను. సారీ--

    మీరు ఏ ప్రసాదాలు చేయాలని అనుకున్నారొ ఆలోచించుకొని ముందు రోజే రాత్రి ఒక్కొక్క పళ్లెంలొ కొలతలతొ సైతంగా అన్ని తీసి పెట్టెసుకోండి.పులిహారకయితే బియ్యం , మిరపకాయలు, అల్లం ,కరివేపాకు ,పొపు సామాన్లు అన్ని, నిమ్మకాయలు మొదలయినవి అన్నమాట.(నీళ్ళు ఉదయమే మడి గా తీసుకొవాలి.)అలా తీసే

సుకుంటే బియ్యం డబ్బా తీయడం, ఫ్రిజ్ తీయడం ఇలాంటి శ్రమ వుండదు.అన్ని రడీ గా పెట్టుకుంటే ఒకదాని తరువాత ఒకటి అలా చేసేసుకోవచ్చును. మరి ముఖ్యమయినది ముందురోజే దేవుడిపీట కడుక్కొవాలి. ఆ తరువాత పూజ సామాగ్రి అంతా ఒకచోట పెట్టుకోవాలి.మర్చిపోకుండా, ఇంట్లొ ఎవరయినవుంటె పరవాలేదు లేకపోతే పూజకి కూర్చున్నతరువాత మద్య లొ లేవవలసివస్తుంది.అగ్గిపెట్టె దగ్గరనుండి కొబ్బరికాయ కొట్టే రాయివరకూ--

పూజకి కావలసినవి కూడా ఓ సారి గుర్తు చేసేస్తాను

    పసుపు,కుంకుమ, పూవులు, పండ్లు, తమలపాకులు, అగరవత్తులు,వక్కలు, కర్పూరం, అక్షింతలు,,కొబ్బరికాయలు,ఓ రెండు పళ్లెలు,

కలశచెంబు, రవికల గుడ్డ,(కొంతమంది కొబ్బరికాయకి కళ్ళు, ముక్కు అవీ పెట్టి అలంకరిస్తారు,ఆ ఆచారం వుందా లేదా ఆన్నది మీ పెద్దలని అడిగితెలుసుకొవాలి), పంచపాత్ర, ఉద్దరిణ,కొత్తబట్టలు (చీర, రవికలగుడ్డ) , ఏదయినా ఆభరణం, (లక్ష్మి దేవికి పెట్టి ఆ తరువాత మీరు ధరించవచ్చు)

బియ్యం, కుందులు, వత్తులు, తైలం లేక ఆవునెయ్యి,అగ్గిపెట్టె.

తోరాలకి దారం, తోరాలు మడిగా తొమ్మిది పొరలతో తొమ్మిది ముడులతొ కట్టుకొవాలి. ఒక్కొక్క ముడికి ఒక పువ్వొ, ఆకొ వేసి కట్టుకొవాలి.

పంచామృతానికి, పాలు, ఆవునెయ్యి,పెరుగు,తేనె,పంచదార సిద్దంచేసుకొవాలి.

కలశకి మామిడిఆకులు దొరకకపోతే తమలపాకులు వాడవచ్చునట.


ఇక్కడ నాకు తెలిసిన రెండు లింకులు ఇస్తున్నాను.ఒకటి ఆడియో, రెండోది చూసి చదువుకోవచ్చు. అందరూ భక్తి శ్రధ్ధలతో పూజ చేసుకొండి.

http://www.religiousinfo.org/Music/varalakshmivratham/index.php?autoplay=1http://www.telugubhakti.com/TELUGUPAGES/Vratas/Varalakshmi/varalakshmi1.htmమరి ఉంటాను.

మా ఇంట్లో-వరలక్ష్మి పూజ ప్రసాదాలు--రెండో టపా.

   5. కేరట్ హల్వా;

కేరట్లు అరకిలొ ( తురిమినది)

11/2 కప్పు(ఒకటిన్నర కప్పు) పాలు

1/2 కప్పు పంచదార పొడి

100 గ్రామ్స్ కోయా( తురిమినది)

1 టెబిల్ స్పూన్ నెయ్యి

కొద్దిగా బాదామ్ పలుకులు, కిస్మిస్.

ఇది కూడా మైక్రొవేవ్ లోనె చేస్తాను.ఒక లోతుగావున్న గ్లాస్ గిన్నెలో తురిమిన కేరట్లు పాలు కలిపి హై లో మూతలేకుండా 15 నిమిషాలు వుంచి మధ్యలో కలుపుతూ వుండాలి.

తరువాత పంచదార పొడి, కొయా కలిపి హై లొనె మూత లేకుండా మరొ పది నిమిషాలువుంచి నెయ్యికలిపి, మరొ పదినిమిషాలు వుంచిబాదాము, కిస్మిస్ కలపాలి.అవసరమయితే ఓ రెండు నిమిషాలు మైక్రోవెవ్ టైము అడ్జస్ట్ చేసికోవాలి.
6 మైసూరు పాక్;

పంచదార 2 కప్పులు

శనగపిండి 1 కప్పు

నెయ్యి 2 కప్పులు

నీరు 1/2 కప్పు

ఒక చంచా నెయ్యి వేసి కమ్మని వాసన వచ్చేవరకూ శనగపిండి వేయించాలి. కడాయిలొ పంచదార నీరు పోసి కరిగాక శనగపిండిని కొద్దికొద్దిగా పోస్తూ కలియబెట్టాలికొద్దికొద్దిగా నెయ్యి మొత్తంపోయ్యాలి.కలుపుతూనే వుండాలి దగ్గరపడ్డాక (పిండి దగ్గరపడి నెయ్యి తేలిన తరువాత) నెయ్యి రాసిన పళ్ళెంలొ వేసి ఓ నిమిషాగి డైమండు ఆకారంలో చాకు తొ కోసుకోవాలి.7 బేసిన్ లడ్డు:

శనగపిండి 2 కప్పులు

పంచదార 1 1/2 కప్పుపొడి( ఒకటిన్నర కప్పు )

నెయ్యి 1 కప్పు

యాలకులపొడి

కడాయి లో నేతి లో శనగపిండి కమ్మని వాసన వచ్చేవరకూ వేయించి కొద్దిగా చల్లరిన తరువాత పంచదార పొడి యాలకులుపొడి వేసి కావలసిన సైజు లో ఉండలుగా చేసుకోవాలి.

8 రవ్వ లడ్దు:

గోధుమ రవ్వ 1 కప్పు

పంచదార 1/3 కప్పు( ముప్పావు కప్పు)

నెయ్యి 2 టేబిల్ స్పూన్స్

పాలు 1 కప్పు

కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా యాలకుల పొడి.

కడాయి లో నెయ్యి వేసి రవ్వ వేయించుకొవాలి. రవ్వ స్టౌవ్ మీద వుండాగానె పంచదార వేసి ఓ మూడు నిమిషాలు వేయించాలి( మాడాకుండా చూసుకోవాలి) రవ్వ పంచదార మిశ్రమం చల్లారిన తరువాత జీడిపప్పు , యాలకులపొడి కలిపి లడ్డూలాగా చేసుకొవాలి.

9 గులాబ్ జామున్;

గిట్సు వారి రడిమేడ్ పేకెట్ తెచ్చి చేసేస్తాను. దాని విధానం దాని మీదే వ్రాసి వుంటుంది.

ఇవండీ ,మా యింట్లొ వరలక్ష్మి పూజకి చేసె ప్రసాదాలు. ఈ బ్లాగు ముఖ్యంగా మా అమ్మాయి, మా కోడలు కోసమని వ్రాసాను.పూజా విధానం ఒకరికి పుస్తకం, ఒకరికి కేసెట్ ఇచ్చెవచ్చాను. వీలునిబట్టి కలిసి చేసుకొవచ్చును, లేక విడిగా చేసుకోవచ్చును.ఉద్యోగస్తులుకదండి, వాళ్ళ ఆఫీసు కాల్స్ ని , పిల్లల స్కూల్ టైమింగ్సు ని చూసుకొని చేసుకుంటారు.నేను ఇక్కడ. వచ్చే సంవత్సరం ముగ్గురం కలసి చేసుకుంటామని ఆశిస్తున్నాను.

మా ఇంట్లో వరలక్ష్మి పూజ--ప్రసాదాలు మొదటి టపా

    అందరు అతి భక్తి శ్రధ్దలతో చేసుకునె వరలక్ష్మి వ్రతమ్ వచ్చేస్తోంది.మరి పూజా విధానం పుస్తకంలొనో, కేసట్ లొనో వుంటుంది.చూసేసుకుని చేసేసుకుంటాము.కాని పూజా వస్తువులు, ప్రసాదాలకు కావలసినవి ,ఈ శనివారం లేక ఆదివారం తెచ్చెసుకోవాలి.ప్లాన్ చేసుకోవాలి. పంజాబి డ్రెస్సులకె పరిమితమయి, చీర కట్టుకోవాలంటెనె ముందుగా ప్లాన్ చేసుకునే రోజులివి.మరి ప్రసాదాలకై అలోచించాలికదా, కొంతమంది 5 రకాలు,మరికొంతమంది 9 రకాలప్రసాదాలతో చేస్తారు.మేము 9రకాలతొ చేస్తాము.ముఖ్యంగా ఉద్యోగాలు చేసె వారికోసమె నేను వ్రాస్తున్నది.ఇంటి మొక్క వైద్యానికి పనికిరాదనట్లుగా , ఇంట్లొవారికంటె బయటవారు చెప్పినది వినసొంపుగా వుంటుంది కొందరికి, అందరికి కాదు.నేను చేసె నైవెద్యాలు వ్రాస్తాను.వీటికి మా ( అమ్మమ్మ)అత్తగారి ఆమోదంకూడా వుంది. (రెండు సంవత్సరాలక్రితం 94సంవత్సరాలవయసులొ స్వర్గస్తులయినారు). అంతవరకూ కూడా 9రకాల ప్రసాదలతొ ఆవిడ చేసుకున్నారు, మా( తాతగారు) మామ గారువున్నంతవరకూ,ఆ తరువాత మా చేత చేయించెవారు, మరీ పాతవి కాకుండా ఈ రోజులనుబట్టి కొత్త మార్పులతొ....... ఈ టపా లో నాలుగు. మిగిలినవి తరువాత టపాలో.....1. పులగం:

బియ్యం 1 కప్పు

మొలకలెత్తిన పెసలు 1 కప్పు

ఇంగువ 2చంచాలు

పసుపు కొద్దిగా

నెయ్యి 2 చంచాలు

ధనియాపొడి+

జీలగర్ర పొడి 2చంచాలు

పంచదార 2 చంచాలు

కారం 1 చంచా

తురిమిన కొబ్బరి 2 చంచాలు

తరిగిన కొత్తిమీర 2 చంచాలు

తగినంత ఉప్పు.

( చంచా అంటె టెబుల్ స్పూన్)

కడాయి లొ నెయ్యివేసి కొద్దిగా వేడి చేసి ఇంగువపొడి వేసి కడిగిన బియ్యం, పెసలు, పైన చెప్పినవన్ని వేసి రెండున్నర కప్పుల నీళ్ళు పోసి ఓ గిన్నెలొ పొసి కుక్కరు లొ పెట్టి 3 కూతలొచ్చిన తరువాత స్టవ్ కట్టేయండి.2.పులిహార:

బియ్యం 4కప్పులు

నీళ్ళు 5కప్పులు

పసుపు1 టి స్పూన్

నూనె అరకప్పు

ఆవాలు 1టిస్పూన్

మినపప్పు 1 టేబుల్ స్పూన్

శనగపప్పు 1 టేబుల్ స్పూన్

గుప్పెడు కరివెపాకు

16 పచ్చిమిరపకాయలు( తక్కువయినా పరవాలేదు, కావలసిన కారాన్ని బట్టి)

ఉప్పు 4 టీ స్పూన్లు(కొద్దిగాపైన ఓ చిటికెడు కావాలనుకుంటె)

నిమ్మరసం 1/3+1 టేబుల్ స్పూన్.(కప్పు లో)

కుక్కరు లొ నీళ్లు పోసి మరిగిన తరువాత కడిగిన బియ్యం వేసి పసుపు వేసి సరిగ్గా మూడు కూతలతొ కుక్కరు కట్టి చల్లారనిచ్చి ఓ పళ్ళెంలోకి తీసి పొడి గా చేసుకోవాలి. కడాయి పెట్టి పోపు వేయించి మిరపకాయలు, కరివేపాకు వేసి ఓ రెండు నిమిషాలాగిపళ్ళెంలొని అన్నం మీద వేసి ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి.

(మామూలుగా చేసుకునే పులిహారకి దీనికి కొద్దిగా తేడావుంది కదా|)3.పాయసం(పరమాన్నం)

బియ్యం1/2 కప్పు

పాలు 6 కప్పులు

1/2 టిన్ను మిల్కు మెయిడ్

10 లేక15 బాదం(నీళ్ళలొ నానబెట్టి తీసినవి)

కొద్దిగా ఏలకులపొడి, కావలంటె కొద్దిగా కేసర్.

మైక్రొవెవ్ హై లొ మూత పెట్టకుండా పాలు బియ్యం కలిపి పది నిమిషాలు పెట్టి మధ్యలొ కలపాలి. తరువాత మిల్క్ మెయిడ్ కేసర్ కలిపిమరొ పది నిమిషాలు మధ్యలొ కలుపుతూ వుండాలి. వుడకకపొతె మరొ 3నుంచి 5 నిమిషాలు పెట్టాలి. తరువాత బాదాం, కిస్మిస్ కలపాలి.

( మామూలుగా కూడా చేసుకొవచ్చు. నేను మైక్రొ లొ చేస్త్తాను, తొందరగా అవాలికదా, వున్నవన్నింటి తొ అస్టావధానం మే, మరి)

4. ఆవడలు:

మినపప్పు 1పావుకిలొ

పెరుగు 3 పావులు

నూనె వేయించెందుకు

పచ్చిమిరపకాయలు

చిన్న అల్లం ముక్క

పోపులొకి;

మినపప్పు

జీలగర్ర

ఆవాలు

కొద్దిగా ఇంగువ

మెంతి గింజలు

కరివెపాకు

కొద్దిగా ఉప్పు.

కమ్మని పెరుగులొ పైన చెప్పినవి కొద్ది నేతిలొ వేయించి చల్లారిన తరువాత కలపాలి. కొద్దిగా పసుపు కూడా వేయాలి( చిటికెడు)

నానబెట్టిన మినపప్పు నీళ్ళు తీసేసి పచ్చిమిరపకాయలు( ఓ పది చాలును. కారాన్ని బట్టి వేసికోవాలి) అల్లం వేసి మిక్సిలొ మెత్తగా చేసుకొవాలి నీరు తగినంత కొద్దిగా,పోసి చేసుకోవాలిపిండి పల్చనయితే వడ రాదు. మరీ గట్టిగా అయితె మిక్సి తిరగదు. జాగర్తగా చేసుకోవాలి.

కడాయి లొ నూనె కాగిన తరువాత కొద్దిగా ఉప్పు చేర్చి న పిండి వడలుగా వేసుకొని ముందు ఓ పాత్రలొ నీరు తీసుకొని అందులొ వడ వేసి రెండు చేతులతొ నొక్కితె నీరు వచ్చెస్తుంది. అప్పుడు వాటిని పెరుగులొ వెయ్యాలి.

ఆషాఢీ ( ఆషాడ ఏకాదశి )

   పూణె దగ్గర అళంది అనె గ్రామంనుండి శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ గారి పాల్కి, పాదుకలు పల్లకిలొ పెట్టి కాలినడకన కావి రంగు జండాలు చేతబట్టి అతి భక్తిశ్రద్దలతొ ఆషాడ ఏకాదశి కి పండరిపూర్ తీసుకువళ్ళడమనేది మహారాష్ట్రీయుల భక్తి సాంప్రదాయనికి ప్రతీక. ఇలా వెళ్ళె భక్తులను "వార్కరీ" లని అంటారు. శ్రీజ్ఞానేశ్వర్ విఠోబా,రుక్మిబాయిల పుత్రుడు. ఈయన సోదరులు నివృత్తినాధుడు, సొపాన దేవుడు, సొదరి ముక్తాబాయి. ఈ సొదరులను త్రిమూర్తిస్వరూపులుగాను, ముక్తాబాయిని ఆదిశక్తి రూపముగాను భావిస్తారు.

    వైరాగ్యం చెందిన విథొబా భార్య నిద్రావస్తలొ వుండగా సన్యాసిగా మారేందుకు సమ్మతి తీసుకొని కాశీ వెళ్ళి సన్న్యాసదీక్ష తీసికొన్నారు. జరిగినది తెలుసుకున్న రుక్మా అశ్వత్ఠనారయణస్వామి అనుష్ఠానము ప్రారంభిచగా దీక్క్షనిచ్చిన శ్రీ పాదస్వామి సన్య్యాసము విడచి గృహస్తాశ్రమము స్వీకరించమని అదిశక్తి అంశగా కుమార్తె, త్రిమూర్తుల అంశగా ముగ్గురు కుమారులు కలిగెదరని ఆశేర్వదించగా అల్లగె కలిగిరి.

    సన్యాసి సంతానమని ఊరివారందరు హేళనగా గేలిచేసెవారు. ఇది చూసి తల్లితండ్రులు బాధపడి ప్రాయశ్చిత్తాం చేసుకొందుకు ప్రయత్నించి విఫలమయి ప్రయాగలొ బిడ్డలను అనాధలుగాచేసి దేహత్యాగం చేసుకన్నారు. ఉపనయన సంస్కారములకై ప్రాయశ్చిత్తం కొరకు పిల్లలు ప్రయత్నించగా అక్కడి బ్రాహ్మణులు పైఠాన్ పురమ్ వెళ్ళి ధర్మాధికారుల వద్దనుండి అంగేకారపత్రం తెచ్చుకొమ్మనిచెప్పగా వారక్కడికి పోయి వారి నామములు తెలిపి వారిని ప్రార్ధింపగా వారు "సర్వభూతములు ఈశ్వర రూపమే"మీరు ఇలాగే బ్రహ్మచర్యం లొ వుండవచ్చునని పలికిరి. ముక్తాబాయి మనమనసులొమాటనే వారు చెప్పినది అని సొదరులతో అనగానే ఒకతను ఎగతాళిగా వారి నామార్ధములను తెలుసుకొని అటుగా పొతున్న ఓ దున్నపొతుని చూపి " ఆ దున్నపొతుకు జ్ఞానేస్వర్ పెరు పెట్టాననగానె" ఆత్మ సర్వభూతములందు వుండునని నాకు ఆదున్నపొతుకు తేడాలేదని చెప్పగా అతను తేడా లేదా, సరే అయితేదానితొ వేదాలు పలికించమనగా, జ్ఞానేశ్వర్ ఆదున్నపొతు తలమీద చెయ్యివేసి " ఓ మహిషేశ్వరా,వీరు నీ నోటినుండి వేదాలను వినాలని కొరుతున్నారు వినిపించమనగా "రాగయుక్తంగాచతుర్వేదాలు చదివెసరికి," అక్కడివారు వీరి అలౌకిక సామర్ధ్యానికి అచ్చెరువు పొంది ఇంతటి మహానుభావులకు ఆజ్ఞాపత్రాన్నియిచ్చెందుకు వారికి అర్హత లేదని యధేచ్చగా వుండమని ఆశీర్వదించి తమ తప్పు తెలుసుకొని భగవంతుని వేడుకున్నారు.

    ఓసారి వారి యింట పితృకార్యమునకు బ్రాహ్మలు ఎవరు ముందుకురాకపొతే, మంత్రాక్షతలు జల్లి పితృదేవతలను ఆహ్వానించగా వారు స్వయంగా వచ్చి ఆతిధ్యంస్వీకరించి వెళ్ళారు.అంతటి శక్తిమంతుడు. సొదరుడు నివృత్తినాధుడు మరాటి భాషలొ భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాయమని ఆజ్ఞాపించగా జ్ఞానేశ్వరి గ్రంధమును రచించారు."అమృతానుభవ" మని స్వీయరచనను చేసారు.అరువది అయిదు ఓవిలతో నిగూఢ వేదాంతసారాన్ని సామాన్య భాషలొ వ్రాసారు. శ్రీజ్ఞానేశ్వర్ మహాజ్ఞాని,యోగి,కవి,సహృదయుడు,వేదాంతవ్యాఖ్యానాలలొ దిట్ట. హరినామసంకీర్తనలు చేస్తూ ఆషాడఏకాదశికి పండరినాధుని దర్శించుకునెవారు.

    కార్తీకమాసములొ ఆలంది గ్రామంలొ ఏకాదశినాడు ధార్మికొపన్యాసముచేసి,ద్వాదశినాడు పారాయణచేసి, త్రయోదశినాడు సమాధి పొందారు. అప్పటినుండి అతి భక్తిశ్రధ్దలతొ ఆయన పాల్కిని కాలినడకతొ ఆళందినుండి వార్కి అనే గ్రామంవరకూ వీరు వెళ్ళగా అక్కడినుండి స్వయంగా పండరినాధుడే వచ్చి వీరిని పండరిపూర్ తీసుకువెడతారు. ఈ వార్కరిలకు దారి పొడవున అన్ని సదుపాయాలతొ గౌరవిస్తారు ప్రభుత్వసంస్థలు, ప్రవేటు సంస్థలు మంచినీరు ఆహార సదుపాయాలుకలిగించడం వారి పూర్వజన్మసుకృతమని భావిస్తారు. (వార్కరి చిత్ర కళకూడా వుంది.పైఠాని చీరలకు ఈ పైఠానీపురమే ప్రసిద్ధి.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes