RSS

నాగులచవితి పాట

    నాగులచవితికి నా దగ్గరవున్న పాట ఒకటి పోస్టు చేద్దామనుకుంటూ మరచిపొయాను.ఆ పాట ఎవరు రాసారో ఎవరు పాడేరో కూడా తెలీదు.అంతా రామమయం పాట రాసానుకదా. అదే కాగితం లో ఇదికూడా వుంది. ఇది చాలా పాత పాట.

    నీ పుట్ట దరికి నా పాపలోచ్చేరు-- పాప పుణ్యముల వాసనే లేని --
బ్రహ్మస్వరూపులో పసికూనలోయీ--కోపించి బుస్సలు కొట్టబోకోయీ--
నాగుల్లచవితికి నాగేంద్రనీకూ --పొట్టనిండా పాలు పోసేము తండ్రీ--

    చీకటిలోన నీ శిరము త్రోక్కెమూ--కసిదీరా మమ్మల్ని కాటెయ్యబోకూ
కోవా పుట్టలోని కోడెనాగన్న--పగలు సాధించి మా ప్రాణాలు తీకూ--
నాగుల్లచవితికి నాగేంద్రనీకూ-- పొట్టనిండా పాలు పోసేము తండ్రీ--

    అర్ధరాత్రి వేళ అపరాత్రి వేళా--పాపమెరుగనీ పసులు తిరిగేనీ--
ధరణి జీవనాధరములుసుమా--వాటీ నీ రోషానా కాటేయ్యబోకూ--
నాగుల్లచవితికి నాగేంద్రనీకూ--పొట్టనిండా పాలు పోసేము తండ్రీ--

    అటుకొండ యిటుకొండ ఆరెంటి నడుమా--నాగుల్ల కొండలొ నాట్యమాడేటి--
దివ్యసుందరనాగా దేహియన్నాము --కనిపెట్టి మమ్మెపుడూ కాపాడవోయీ--
నాగుల్లచవితికి నాగేంద్రనీకూ -- పొట్టనిండా పాలు పోసేము తండ్రీ--

    పగలనక రేయనక పనిపాటలందూ--మునిగి తేలేటి నా మోహాలబరిణె--
కంచెలు కంపలూ నడిచేటి వేళా--కంప చాటునుండి కొంప తీయకోయీ
నాగుల్లచవితికి నాగేంద్ర నీకూ -- పొట్ట నిండా పాలు పోసేము తండ్రీ--

    నాకు పాటలు పాడటం రాకపోయినా పాట పాడే వారికి నా దగ్గరవున్న పాటలు యిస్తే నాకు చాలా సంతోషం.

శీర్షిక కబ్జా

   అమ్మొ ! కొద్దిరొజులు కూడలి కి దూరంగా వుంటే నా ' ఇదీ సంగతి" శీర్షిక మరొకరు పెట్టేసుకున్నారు. ఇలా గయితే ఎలాగండీ?, పొన్లే పెట్టుకున్నవారికి తెలియకపోవచ్చుననుకోండి, చదివినవారి దృష్టి లొకి వచ్చివుండాలే, పొన్లే వారికి వాళ్ల టపాలు రాసుకుందుకు పోస్టు చేసుకొందుకు , వాళ్ళ కామెంట్లు చూసుకొందుకు సమయం సరిపోయిందనుకోండి, శ్రీవారి సంగతి ఏమిటి? కనీసం తనకయినా గుర్తుండవద్దా?చెప్పండీ?, ఇదండీ లోకతీరు. అంతేకదా ఈ రొజుల్లో, ఎదురుగా వున్నంతవరకే,లేకుంటే ఎవరికి వారే యమునాతీరే!

    పొద్దుగడి వచ్చేసింది. కాని ఇంకా స్లిప్పుల గడి రాలేదు. ఈ సారి తేలిగ్గా వుందనుకుంటాను.స్లిప్పుల అవసరం లేకుండానె వచ్చేసిందనుకుంటాను. ఎందుకంటే నాకే వచ్చేసినట్లుగా అనిపిస్తోంది.గడి వచ్చినతరువాత నాకు బోలెడు కాలక్షేపం. అది చదవడం నింపడం, రానివి ఓ కాయితం మీద రాసుకొని అవే ఆలోచించడం, హఠాత్తుగా ఆ పదం తట్టేసరికి ఎక్కడవున్నా, ఎంతమందిలోవున్నా, సరే వావ్! అనుకొని గబగబా ఆ పదం నింపడమ్. అదొక అలవాటు, నషా. కాని ఎప్పుడూ ఒకటొ రెండొ పదాలలో బండి ఆగిపోతుంది. అయినా మానను. అలా ఆలొచిస్తూనే వుంటాను. ఈనాడు ఆదివారం అనుబంఢం. సాక్షి ఆదివారం, రచనలొ , ఆంధ్రభూమిలో, దొరికిన అన్ని పుస్తకాలలొ, ముందర వీటి కొసమే చూస్తాను. ఎప్పటికో అప్పటికి సాధిస్తాను. అదృష్టం బాగుండి అన్ని నింపకలిగితే దాన్ని పంపేసమయం దాటిపోతుంది, ఒకవేళ సమయానికి నింపి మాశ్రీవారికిచ్చి పంపడి అని చెప్పి యిస్తే తనకి గుర్తువుండదు, అది అలాగే వుండిపోతుంది. ఆ తరువాత మాటామాటా, చిన్న తగాదా, ఆ తరువాత మళ్ళీ మామూలేను. ఇదండి సంగతి..

    పెద్దలకు వందనాలు. చిన్నలకు ఆశిర్వచనములు. చాలా రోజల తరువాత మీ అందరిని కలుస్తున్నందుకు సంతోషంగావుంది. మీ అందరిని కంటి తో చూడకపోయినా మీ మనొభావలతొ బ్లాగులొ పంచుకున్న మీకు దూరంగా వున్నందుకు చాలా బెంగ అనిపించింది.

    మధ్యలొ ఒకటి రెందు సార్లు కూడలి కి వచ్చినా మనసు తీరలేదు. చూసేందుకు కుదరలేదు. ఇంక యిప్పుడు రోజూ కలవచ్చును.
ముందర అందరి బ్లాగులు పాతవి చదవాలి.సంగతులు తెలుసుకొవాలి.

    అందరూ పొద్దు గడి నింపి పంపేవుండివుంటారు. నాది కొద్దిగా గడబిడ అయిపోయింది. పొరబాటున అసంపూర్తిగా పంపేసాను. రాజమండ్రి నుండి వచ్చి రెండు నెలలయింది. మళ్ళి పూనా , పూనా స్నేహితులు
పాత పరిసరాలలో పాత స్నేహితులలొ కొత్త జీవితప్రయాణం. ముందర షిరిడి వెళ్ళి సాయిబాబ దర్శనం చేసుకొని వచ్చాము. ఒక్కప్పుడు బాబాకి మా స్వహస్తలతొ దండవేసి ,పాదాలమీద మోకరిల్లీ ప్రార్దించుకున్నాము.మరి యిప్పుడొ దర్శనానికే రెండు గంటలు పట్టింది.
.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes