RSS

ఇద్దరు పద్మావతులు-రెండో భాగం..

ఇక రెండో పద్మావతి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి "సీతాపతి" కధ లోని సీతాపతి గారి భార్య.


జీవితం వడ్డించిన విస్తరిగా వుంటే సరిపోతుందా? అందులో ఇష్టమైన పదార్ధాలుండొద్దూ? చవి సారంలేని చప్పిడి తిండి తినమంటీ ఎలా? ఉక్రోషం పొంగి తిరుగుబాటుతనంతో ఉన్నదాన్ని వదులుకుని లేనిదానికోసంపరుగులెత్తిన సీతాపతిని వెనక్కి తెచ్చుకున్న పద్మావతి
.

   "పెళ్ళాన్ని చంపేయాలీ, బొచ్చుకుక్కని చంపేయాలి, పోస్టుమాన్ ని చంపేయాలి,డాక్టర్ని చంపేయాలీ, పక్కింటి వాళ్ళబ్బాయిని చంపేయాలీ,
" కాఫీ తాగారా?'
" అయితే స్నానానికి లేవండి, వేణ్ణీళ్ళు తొలిపి పెట్టాను,"

   " బద్దకంగా వుందా, పోనీ టానిక్కు యివ్వానా? " ఇదుగో తాగండీ, పద్మావతి మందుగ్లాసు నోటి దగ్గర పెట్టింది.లాలనగా తియ్యగా కళ్లలోకి చూసింది. పువ్వులతో వున్న పున్నాగచెట్టూ, నగీషల దంతపు గిన్నెలో వున్న అగరువత్తుల గుత్తి, న్క్షత్రాలతో మెరుస్తున్న శరదాకాశములా అందంగా వుంటుంది, తియ్యగా మాట్లాడుతుంది.అందరికి పడ్మంటే యిష్టమేనూ, ఈ లోగా లైఫ్ పత్రిక చదువుకోండి," టొమాటో పెరుగుపచ్చడి, ములక్కాడ సాంబారు చేయిస్తున్నాను, ఇష్టమేకదూ, టమేటా వద్దని గోంగూర అడిగితే " గోంగూర పైత్యం
' గోంగూర పచ్చడి పైత్యం మీ వంటికి అసలు పడదు.'
తను తినే తిండి , చదివే పుస్తకం దగ్గరనుండి క్లబ్బులొ మెంబరుషిప్పు కట్టి పదో,పరకో చేతిలో పెట్టి తక్కువ స్టేక్సు తో ఆడమని సూచిస్తుంది. మందులు తనే కొంటూంది తన ఆరోగ్యాన్ని కంటికిరెప్పలా కాపాడుకొంటూంది.ఒక పాలేరు,ఒక వంటావిడ, ఒక గుమాస్తా ఈ ముగ్గురి సిబ్బంది తో మక్తాలు వసూలు చేసుకొంటుంది,పన్నులు కట్టిస్తుంది,కూరలు ఆమే కొంటూంది,జమా ఖర్చులు చూసుకొంటూంది ఆఖరికి రాత్రి తలుపులు ఆమే చూసుకొంటూంది. ఇలా కాదని ఓసారి ఆలస్యంగా ఇంటికి వచ్చి రెచ్చిపోతూ అన్నం తినేసి కూర్చున్నావా?అన్న భర్తని చూసి కూల్ గా ఈ రోజు శనివారంకదండీ,భోజనంచేయనని తెలుసు కదా, మీ డైజషను అసలే మంచిది కాదూ, జీర్ణశక్తి పాడైపొతే ఇలాగే కోపం వస్తుందని డాక్టరు అన్నారు,పళ్ళరసం ,గ్లూకోజ్ కలిపి ఇవ్వనా సత్తువ చేస్తుంది అనే చక్కని పద్మ పాతిక ఎకరాల ఆస్తి తో పెద్దమేడ , బాంకులో ముప్పై వేలతో వున్న తను నిరుద్యోగ్గాన్ని సాకు తో ఆధికారం చెలాయిస్తుందని దెబ్బలాడి తన అధికారాన్ని చూపిస్తుంమోనని అనుకుంటాడు కాని ఆమె ఎప్పుడూ పల్లెత్తు మాట ఆనదు, పైగా భర్తే సర్వస్వం అంటూంటుంది. అంత ప్రేమగా చూస్తున్న భార్యని అర్ధం చేసుకోగా తనని బొచ్చుకుక్కని ఓకేలా ఇష్టాఇష్టాలు, వ్యక్తిత్వం లేనట్లుగా తనపై పూర్తిగా తన వశం చేసుకున్నట్లుగా భావించి బొచ్చుకుక్కకి, తనకి విముక్తి లేదని తనని బొచ్చుకుక్కతో పోల్చుకొని రెండో హత్యకి కుక్కని లక్ష్యం చేసుకుంటాడు.

   మధ్యాన్నం భోజనం చేసి కునుకు తీసేసరికి పోస్టుమేన్. సీతాపతిని చూసి " మీకేమీ లేవండీ సార్ అన్ని అమ్మగారికే " ఓ దొంతర ఆమె చేతికిచ్చి " ఆయనకేం మహరాజు. హాయిగా తిని పడుకుంటే దొరలా వెళ్ళిపోతుంది. మా దొడ్డ జాతకం లెండి అయ్యగారిది" అంటూ చిరునవ్వుతో వెళ్ళిపోయే అతను మూడొహత్యకి లక్ష్యమయ్యాడు.

   అతను కోరినవి తినలేడు. డాక్టరు నిషేధం వుంది. అతని దినచర్య అంతా డాక్టరు ఏర్పాటు చేస్తాడు, దాన్ని తు.చ. తప్పకుండా పద్మ ఆచరిస్తుంది.దేశంలో, ఖండాంతరాలలో ఎమైనా వ్యాపించే రోగాలన్ని కూడబలుక్కుని అమాయకుడు అందగాడైన తన భర్త దేహంలో ప్రవేశిస్యాయోమోనని కాపలా కాస్తూ వుంటుంది,ఏ డయాబెటిసో గాస్ట్రిక్ ట్రబులోకో దింపుతుందనే డాక్టరు మాటలో అవమానము అవహేళన సూదులతూ గుచ్చినట్లుగా ఫీలవుతూ అతన్ని కూడా తన లక్ష్యంలోకి తీసుకుంటాడు.

   చిన్న లోతైన కళ్ళతో తీరికగా బద్దకంగా రాజకుమారిడిలా పక్కింటి పిల్లాడు వచ్చి 'హి హి హి' అని నవ్వుతూ " మా అమ్మ నన్ను తిట్టింది, ఏమనో తెలుసా,' పని పాట లేకుండా పద్మమ్మ మొగుడిలా తయారవుతున్నావు వెధవా" అని చెబుతాడు, అతను కూడా ఓ లక్ష్యమైపోయాడు.

   ఈ సమస్యకి పరిష్కారం మార్క్సిజంలో లేదని గాంధీజమే దారి చూపగలదని పద్మనీ పద్మ యిచ్చే సౌఖ్యాన్ని,భోగాన్ని,భధ్రతని కాదని కట్టుబట్టలతో ఇంట్లోంచి వెళ్ళిపోతాడు,వర్షంలో తడిసిన ఆతనికి నిమోనియా వచ్చినతన్ని తనఇంట్లొ పెట్టుకొని వైద్యం చేయించి తనకూతుర్నిచ్చి వివాహం చేయిద్దామనుకుంటాడు.ఆతని తలకిందనున్న పుస్తకాన్ని చూసి ,కలవారి బిడ్డ అని తెలుసుకొని ఏప్రమాదమయినా జరిగితే క్రిమినల్ కేసులో ఇరుక్కోవడం తప్పదనుకుంటూ పద్మావతికి తెలియబరచడం, ఆ వెంటనే గుమాస్తా గోవిందయ్య, ఫ్యామిలిడాక్టరు, రెండు మూడు బుట్టల సామానూ హోల్డాలు తో వచ్చిన పద్మ ఎలా వుందంటూ వచ్చిన పద్మని ముసలాయన పూజారి తన భార్యతో " సీతాపతిగారి భార్య పద్మావతీ దేవి " అంటూ పరిచయంచేస్తాడు.

   పరిచితమైన తొడ మీద తన తల ఆనించి వుండడంచూసి " వచ్చావా పద్మా" అంటాడు సంతోషంగా, ఆసాయంత్రం భర్తతో వెళ్లెముందూ పూజారి కుటుంబానికి తన కృతజ్ఞత తెలియబరచి పూజారి కూతురితో "నీకు మంచి మొగుడు రావలని ఆశీర్వదిస్తూ తన మెడలోని రెండు పేటల గొలుసు తీసి పెళ్ళి కానుకగా మెడలో వేస్తూ "నా భర్తలాంటి వాడిని కట్టుకున్నా సుఖపడేది ఏమీ వుండదంటూ " చరాలున కారులో కార్చుని వెళ్ళిపోతుంది.

ఇద్దరు పద్మావతులు

అనుకోకుండా ఇద్దరు పద్మావతులను కలుసుకున్నాను ఈ రోజు,మొదటి పద్మావతి గురింఛి కొద్దిగా చెబుతాను.

    పద్మావతి ఓసారి చుట్టూ కలయచూసింది. ప్రశాంతంగా వుంది.

    ఇంక రెండో పద్మావతి గురించి ఇంకో టపాలో....'ఇక్కడ నేనో మనిషిని. ఇక్కడ నేను జీవచ్చవాన్ని కాదు. ఇక్కడ నన్నెవరూ 'అది' అనరు. నా కంతకంటే ఏం అక్కర లేదు. మనిషిన్నేను...' లోపలికి నడుస్తున్న పద్మావతి పెదవుల మీద సన్నని నవ్వు వెలిగింది.

    ఎందుకంటారా వినండి, ' మొగుడు కొడితే మాదాకోళం వాడూ కొట్టాడన్నట్లుగా' భర్తే చులకనగా చూసినపుడు ఇంట్లో కొడుకు కోడలు, ఆఖరికి మనవలకి కాడా చులకనే మరి, కొనుక్కున్న ఫ్లాటుకి డబ్బంతా పెట్టేసి చేతిలో డబ్బాడక, కొడుకుని అడగలేక మళ్ళీ ఉద్యోగంలో చేరి తనకొక వ్యాపకం పెట్టుకొని భర్త తప్పుకుంటాడు,పైగా ఓ రోజు ' ముసల్దానికి ఒంట్లో బాగులేదా, లేచినట్లులేదూ." అని కొడుకుని అడుగుతున్న భర్త మాటలు విన్న తనకి ' వయసు తేడా ఎక్కువ వద్దుకాక వద్దు ఈ సంబంధం... ' అన్న తల్లి మాటలు గుర్తుకి వస్తాయి.కూరలు తరిగి చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి,గదులూ తడిబట్ట పెట్టి తుడిచి, బట్టలుతుకి, స్కూలు నుండి వచ్చిన పిల్లలకు బ్రెడ్,వెన్న, జామ్ రాసి సిద్ధం చేసేసరికి ' నానమ్మా, రోజూ ఇదేనా మా కొద్దూ, ఫలానాది కావాలి' అని స్పష్టంగా చెప్పకలరు కాని తనూ...
'అత్తయ్య ఉండబట్టికాని లేకుంటే కుదిరేదా' ' అత్తయ్య ఉన్నారు కనుక కాని పనివాళ్ళ మీద ఎలా వదిలి వెళ్ళగలను? ఉద్యోగానికి' అంటూ స్నేహితులతో గర్వంగా చెబుతూ," చిన్న యిల్లు, చిన్న కుటుంబం, రోజంతా ఎవరూ ఉండనేవుండరు దీనికోసం ఓ లాండ్రి, పనిమనిషి దేనికంటున్న కోడల్ని చూసి కష్టంగా ఉందని ఎవరనగలరు?

   అమ్మతనం, భార్యతనం,అత్తతనం,నానమ్మతనం- అన్ని ఆనందమే, కాని ఎప్పుడు ?తానూ ఒక మనిషినని ఇంట్లో వాళ్ళనుకున్నపుడు, లేకుంటే ఎక్కడినుండి వస్తుంది ఆనందం? చాకిరి చేసే యంత్రంలా వ్యక్తిత్వం లేని ప్రాణిగా నాలుగ్గోడల మధ్య జీవచ్చంగా బతుకుతున్న పద్మావతి ధైర్యం చేసి ఓ జత మారు బట్టలు సంచిలో పెట్టుకొని మెల్లిగా ముందు గదిలో సినిమా చూస్తున్న వారిముందునుండి తలుపు తెరిచి అడుగు బయట పెట్టి రోడ్డు మీదకొచ్చి నడవడం మొదలుపెట్టిన తనముఖానికి తగిలిన చల్లగాలికి, అరే, నేనూ మనిషినే, ఇంకా స్పర్శజ్ఞానం పోలేదూ అనుకుంటూ ' రెక్కల కష్టం మీద బతికే వాళ్ళ వసతి గృహానికి చేరుకొన్న తను ఓ మనిషినని జీవచ్చవాన్ని కాదని - నవ్వుకుంటుంది.
ఈ రోజుల్లొ ఎంతోమంది పద్మలున్నారు?కాని ధైర్యం చేసే వాళ్ళెంతమంది?


బహుముఖ ప్రజ్ఞావంతురాలైన కె.రామలక్ష్మి గారి "అదెక్కడ?" కధలోని పద్మావతి మొదటిది.
ఇంక రెండో పద్మావతి గురించి ఇంకో టపాలో....

మీ అందరికోసం...

ఇదేదో బావుందనిపించింది.మరీ పాకశాస్త్రప్రవీణులారిని అనను కానీ, కొత్తవంటకాలు నేర్చుకోడానికి బాగుంటుంది కదూ !! మొన్నెప్పుడో, మా అమ్మాయి చెప్పింది, ఈ సైటు గురించి.
సరదాగా మీరూ ప్రయత్నించండి.అప్పుడెప్పుడో ఓ టపా వ్రాశాను,'జున్ను కాని జున్ను' అని. సుజాతగారి వలన ' ఈనాడు' లోనూ, ఇప్పుడు జ్యోతిగారి వలన అని ' ఆంధ్రభూమి' లోనూ ప్రచురించారు.

రాశిఫలాలు

    జాతకాలూ, రాశిఫలాలమీద నమ్మకం ఉందా లేదా అన్నది కాదు ప్రశ్న.వాటిని కొంతమంది నమ్ముతారు,కొంతమంది సో కాల్డ్ హేతువాదులు, రేషనలిస్టు అని ఓ పేద్ద ఇంగ్లీషు పేరు పెట్టుకొని కొట్టిపారేస్తారు.ఎవరిష్టం వారిదీ.మేము ప్రతీ రోజూ టి.వీ. ల్లో వచ్చే శుభలగ్నం, కాలచక్రం, రాశిఫలాలు, etc etc... మాత్రం తప్పకుండా చూస్తూంటాము. ఆరోజు/వారం బాగా ఉంటే ఆనందిస్తాం, లేకపోతే వారు చెప్పే జాగ్రత్తలు తీసికోవడం. జాగ్రత్త తీసికోవడం వలన మనకి వచ్చే నష్టం ఏమీ లేదుగా. మరీ, వాటిగురించే ఆలోచిస్తూ,ఏదో మిన్ను విరిగి మీదపడుతుందని టెన్షన్ తెచ్చేసికుంటే కష్టం. జరిగేదేదో జరక్క మానదు అనేదే మా ఇద్దరి ప్రిన్సిపుల్.
ఇప్పుడు చెప్పొచ్చేదేమిటంటే, మే నెల మొదట్లో నా జాతకం ఎలా ఉందో నెట్ లోనూ, పత్రికల్లోనూ, టి.వీ. లోనూ ముందుగా తెలిసేసికున్నాను--

1. ఆకశ్మిక ప్రయాణాలు-- మా అమ్మ పిలిస్తే,గ్రామకుంకం నోము నోచుకోడానికి తణుకు వెళ్ళానా లేదా....

2. వాహనయోగం-- వాళ్ళేదో, బెంజి, బి.ఎం.డబ్ల్యూ అనేమీ చెప్పలేదు, కేసినేని స్లీపర్, వియ్యాలారి కారులోనూ, ఆటోలూ ప్రయాణం చేశానా లేదా...

3.విందులూ,వినోదాలూ... తణుకులో పుట్టింట్లో అమ్మ దగ్గరా, తిరిగి వచ్చిన తరువాత, రిసెప్షన్లూ, గృహప్రవేశమూ, పిల్లల పెళ్ళిరోజులూ....

4. ఖర్చులెక్కువ....... మరి ఈ పైన చెప్పినవన్నీ ఊరికే వచ్చాయా ఏమిటీ?

5. వస్త్రలాభం......... పుట్టింట్లో ప్రతీవారి దగ్గరనుండీ ఓ చీరా, బ్లౌజు పీసూ....

6.దైవ దర్శనాలు .... మండపాక ఎల్లారమ్మ దర్శనం.

7 సోదరీ సహోదరులతో కలయిక.. అబ్బ పదేళ్ళ తరువాత అందరు చెల్లెళ్ళూ, అమ్మ తో కలయిక.

8.వెలితి....... తమ్ముణ్ణి కలుసుకోలేదనే వెలితి.

9.జీవిత భాగస్వామి తో ఎడబాటు.. నా తణుకు ట్రిప్పు 10 రోజులూ, మా శ్రీవారి బాపట్ల ట్రిప్పు ధర్మమా అని పదిహెనురోజులు విడిగా ఉన్నామా లేదా..

10.కొనుగోళ్ళు, కమనీయ దృశ్యాలు.. మా కోడలు తనకి కావలిసినవి కొనుక్కుంటుంటే,సాయం వెళ్ళి విండో షాపింగు....

11. గృహం లో మార్పులూ చేర్పులూ... మా బాత్రూం తలుపు జాం అయిపోతే, వడ్రంగాణ్ణి పిలిచి, రిపేరీ చేయించడం,కిచెన్ డ్రైన్ లోంచి, నీళ్ళు చోక్ అయిపోతే ప్లంబర్ చేత రిపేర్ చేయించడం.

12. కర్తవ్యాలు పూర్తిచేయడం.. ఊరగాయలు పెట్టడం, కొడుక్కీ కూతురికీ సీసాల్లో పెట్టి ఇవ్వడం. మామిడికాయ ఒరుగులు బోనస్సోటీ..

13.అలంకార ప్రాప్తి.... అమ్మాయినుంచీ, కోడలునుంచీ yardly పౌడరూ, ఎలోవేరా జెల్లూ, ఓలే క్రీమ్మూ,క్లిప్పులూ, ఫాన్సీ గాజులూ( ప్రయాణం కోసం),etc etc...

14. స్వల్ప అనారోగ్య సూచనలు... నడుం నొప్పీ, కాలు నొప్పీ.

15.పాత మిత్రుల కలయిక.. రిసెప్షన్ల లో కలసిన పాత స్నేహితులు.

ఆతావేతా తేలిందేమిటంటే, మూడు పువ్వులూ, ఆరుకాయల్లా, మూడు పెళ్ళిళ్ళూ ఆరు రిసెప్షన్లూ, డైటింగు నిల్లూ, బ్యాంక్ ఎకౌంటుకి చిల్లూ, గైనేమిటయ్యా అంటే రెండు కిలోల బరువూనూ..మిశ్రమ ఫలితాలేమిటయ్యా అంటే. మనం ఇచ్చిన ముడుపులూ, తిరిగి తెచ్చిన, రిటర్న్ గిఫ్టులూ, అధిక ప్రయాసా, అందరినీ కలిసిన సంతోషమూనూ....

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes