RSS

చిన్నికృష్ణుడు..   చూడ రండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడూ
రేపల్లె వాడల్ని ఏలువాడూ ---" చూ"

   చూడ రండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడూ
రేపల్లె వాడల్ని ఏలువాడూ--
మన గండాలు దాటించు నల్లవాడూ--- "ఛూ"

   తారంగాలు ఆడేవాడూ
పిల్లన గ్రోవి ఊదేవాడూ
వచ్చాడమ్మా వెన్నెల దొంగోడూ--- " చూ"

   పడగలు తొక్కిన పిల్లోడమ్మా
మడుగున ఆడిన గడుసోడమ్మా
వచ్చాడమ్మా గోవుల గోపన్నా---
పడగలు తొక్కిన పిల్లోడమ్మా
మడుగున ఆడిన గడుసోడమ్మా
వచ్చాడమ్మా గోవుల గోపన్నా
వాడు కొండను ఎత్తిన అల్లరి బుల్లోడూ---"చూ"

   చీరలు దోచిన చిన్నోడమ్మా
గారడి చేతల పిడుగోయమ్మా
వచ్చాడమ్మా కిటుకుల కిట్టయ్యా--
చీరలు దోచిన చిన్నోడమ్మా
గారడి చేతల పిడుగోయమ్మా
వచ్చాడమ్మా కిటుకుల కిట్టయ్యా--- " చూ"

   బాబుకు బుద్దులు చెప్పినవాడూ
భామల పాలిటి ప్రేమలవాడూ
వచ్చాడమ్మా రాధా కృష్ణయ్యా
బాబుకు బుద్దుల చెప్పినవాడూ
భామల పాలిటి ప్రేమలవాడూ
వచ్చాడమ్మా రాధాకృష్ణయ్యా
వాడ్డు వేణువు నూదే వెన్నెల కన్నయ్యా---"చూ"

   మామకు తగ్గ అల్లుడు వాడు
చెల్లెల్ని కాచిన అన్నయ్య వాడూ
వచ్చాడమ్మా అందరి క్రిష్ణయ్యా
మామకు తగ్గ అల్లుడు వాడూ
చెల్లెల్ని కాచిన అన్నయ్య వాడూ
వచ్చాడమ్మా అందరి క్రిష్ణయ్యా--
వాడూ వేణువు నూదే వెన్నెల దొంగోడూ--"చూ"

   చక్రం పట్టి తిప్పేవాడూ
అమ్మకు విశ్వం చూపినవాడూ
వచ్చాడమ్మా ముద్దుల కృష్ణయ్యా--
చక్రం పట్టి తిప్పేవాడూ
అమ్మకు విశ్వం చూపినవాడూ
వచ్చాడమ్మా ముద్దుల కృష్ణయ్యా
వాడూ లోకాలన్ని కాచేవాడూ--" చూ'

   గురువాయూరు క్షేత్రంలోన
గురువైవున్నాడమ్మా-- వాడూ
చందనగంధం సుందరుడోయమ్మా
గురువాయూరు క్షేత్రంలోనా
గురువైవున్నాడమ్మా-- వాడూ
చందనగంధం సుందరుడోయమ్మా--
వాడూ గురవాయూరు దేవుడైనాడూ "ఛూ"

    ఈ పై పాటా, లింకులో పెట్టిన చిన్న పిల్లల నృత్యమూ, మా నవ్య కోసం, శిరీషకి పంపుతూ, మీఅందరితోనూ పంచుకుంటున్నాను.

సువర్ణ గణేష్
   మేము వెళ్ళిన దివేఘర్ ప్రదేశం చాలా బాగుంది. ఆకాశంలో మబ్బులు, మద్య మధ్యలో మమ్మల్ని పలకరించే వాన చినుకులు, మరో నిమిషంలో పెద్దవాన, మరు నిమిషంలో చిన్న యెండ, చుట్టూవున్న కొండలన్ని పచ్చని చెట్లతో ఆకుపచ్చని చీర కట్టుకున్నట్టుగా, తెల్లని వెండి ఆభరణాలా అన్నట్లుగా , చిన్న పెద్ద జలపాతాలతో ,సగం మబ్బుల్లొ దాక్కుని మాతో దోబూచులాడుతూ, మమ్మల్ని కూడా మబ్బుల్లో చుట్టేసి మమ్మల్ని తాకూతూ మాకందకుండా పారిపోతూ , వాహ్! అద్బుతం! ఆనందం! పదాల్లో రాయడం కుదరదనుకోండి, అనుభవించి, ఆనందించి , మన మనసులో దాచుకోవలసినదేనూ! అల్లాంటి దృశ్యాన్ని ఏ కెమేరాలోనూ బంధించలేం.

    దివేఘర్ లో"సువర్ణ గణేశ్" చూడవలసిన ది.ఇది కధ కాదు, ఎప్పటి సంగతో కాదు, చరిత్ర అంతకన్నా కాదు.కొబ్బరిచెట్లు, పోకచెట్ట్లుతో వున్న తోటలో" శ్రీమతి ద్రౌపతి ధర్మ పాటిల్" కి సుమారు రెండు అడుగుల లోతులో 30 కిలోల రాగి పెట్టె దొరికిందట. ఆ రోజు సంకష్ట చతుర్ధి.( నవంబరు నెల 17 తేది,1998 సంవత్సరం) ఆ పెట్టె పైన కాల్చినట్లుగా మెరుపు అంతా పోయి బాగా వెడి చేసి, ( అంటే కాల్చినట్టుగా) వుందట.దాని మీద సంస్కృతంలో ఏవో పదాలున్నాయట.ప్రభుత్వ అధికారుల సమక్షంలొ తెరెచిచూస్తే అందులో స్వచ్చమైన బంగారంతో చెసిన గణపతి , మరో చిన్న రాగి బాక్సులో ఆ దేముని ఆభరణాలు వున్నాయట.పూర్తి 24 కారెట్లు బంగారమైన ప్రతిమ 1కిలో పైన 300 గ్రాములు బరువుతో 24 అంగుళాల ఎత్తు తో వుందట.పరీశిలించగా తేలినదేమిటంటేనట అది ఒక రాతి గణపతి యొక్క తొడుగు . ఇంతకీ అది ఎవరు భూమిలో పాతిపెట్టారో, ఎందుకు పెట్టారో , ఏ గణపతి విగ్రహం తొడుగో, ఏమీ తెలీదు.మిస్టరీ గానే వుంది. ఇక్కడి ప్రజలు మాత్రం ఎంతో భక్తి శ్రద్దలతో, గణపతి మందిరంలో గణపతి విగ్రహం పక్కన పెట్టి ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు చేస్తూన్నారు. మేము కూడా చూసి వచ్చాము. ఆ రాగి పెట్టె, నగలపెట్టె కూడా అక్కడే వుంచారు.ప్రకటిత స్టలం చూసి బయటకి వచ్చేసరికి అక్కడ మొక్కల్లొ గణపతి సోదరుడు కూడా సాక్క్షాత్కరించాడు. కొమ్మ మీద పాము ని చూసి భయపడ్డా ధైర్యంగానే వున్నాను. ప్రకృతికి దగ్గరగా వున్నపుడు ఇలాటివి కూడా తప్పదు కదా మరి.శ్రీ మంగళగౌర్యష్టకమ్

ఈ రోజు శ్రావణ మంగళగౌరి నోము చేసుకునే వారికి మొదటి మంగళ వారం. నోము చేసుకోక పోయినా మంగళగౌరిని అందరం ఆరాధించి ఆమె దయకు పాత్రులమవచ్చును.పరాశక్తి మంగళగౌరి దేవి. ఆమెని సేవించిన వారికి సర్వసౌభాగ్యాలు కలుగుతాయి.అందులోనూ శ్రావణ మంగళవారాలంటే ఆమెకు ఎంతో ప్రీతియట.శ్రావణమాసంలోనే కాకుండా ప్రతి మంగళవారం అఖండ సౌభాగ్యనికి అనుకూల దాంపత్యానికీ ప్రతి మంగళవారం చదువుకునే శ్రీ మంగళగౌర్యష్టకము.   శివోమా పరమాశక్తి రనంతా నిష్కళామలా

   శాంతామాహేశ్వరీ నిత్యా శాశ్వతీ పరమాక్షరా // 1

   అచింత్యాం కేవలా నందా శివాత్మా పరమాత్మికా

   అనాది రవ్యయా శుధ్ధా సర్వాత్మా సర్పగాచలా // 2

   ఏకానేకవిభాగస్థా మాయాతీతా సునిర్మలా

   మహామహేశ్వరీ సత్యా మహాదేవీ నిరంజనా // 3

   కాష్ఠా సర్వాంతరాస్థా చ చిఛ్ఛక్తిరతిలాలసా

   తారా సర్వాత్మికా విద్యా జ్యోతీరూపామృతాక్షరా // 4

   శాంతిః ప్రతిష్ఠా సర్వేషాం నివృత్తి రమృతప్రదా

   వ్యోమమూర్తి ర్వ్యోమలయా వ్యోమాధారాచ్యుతామరా // 5

   అనాదినిధనామోఘా కారణాత్మా నిరాకులా

   ఋతప్రథమ మజా నీతిరమృతాత్మాత్మసంశ్రయా // 6

   ప్రాణేశ్వరీప్రియతమా మహామహిషఘాతినీ

   ప్రాణేశ్వరీ ప్రాణరూపా ప్రధానపురుషేశ్వరీ // 7

   సర్వశక్తి ర్నికారా జ్యోత్స్నా ద్యౌర్మహిమాస్పదా

   సర్వకార్యనియంత్రీ చ సర్వభూత మహేశ్వరీ // 8

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes