కట్టిన చీరని బట్టి వారి విలువ ,వారి వరుస చెప్పవచ్చుట. 'అంచు చీరలు వారు ఆడబడుచులు, తోపు చీరలు వారు తోటి కోడళ్ళలని ఓ సామెత వుందట. ఎన్ని చీరలు వున్నా సరే ఇంకా తీసుకునే ఆశ ,ఆరాటం అతివలకి ఎక్కువగా వుంటుంది .ఒయ్యారంగా ఒంపుసొంపులు చీరలో చూపొచ్చు,కాదంటే కడుపులో పెట్టుకుని కాపాడే కన్నతల్లి లా కట్టుకోవచ్చును.'చీర సింగారించే సరికి ,ఊరు మాటు మణిగింది' అని ఎకసెక్కం చేసేవారు .సరసానికి విరసానికీ కూడా చీర కారణమంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కట్టూతీరూనూ. అందరి చీర కట్టు లోనూ ఓ విలక్షణమైన అందం ఆకర్షణ వుంటాయి .ఈ మహారాష్ట్ర మహిళ చిత్రం చూడండి .(1926 సంవత్సరం లోని దనుకుంటాను)ఎంత బాగుందోను!ఇప్పటికి వీరు పండుగ లకి సాంప్రదాయ కంగా కట్టుకుంటారు,పిల్లలకి నేర్పుతారు.
1 కామెంట్‌లు:
peddamma pedanannagaaru ,pushkaraalaki veltunnaraa.. mee iddari daggarnunchi pushkaraala meeda post kosam choostunnanu
కామెంట్‌ను పోస్ట్ చేయండి