మా
స్నేహితురాళ్ళు అందరం కలిసి ప్రతీనెలా చేసుకునే పార్టీ ఈ నెల మా ఇంట్లో చేసికున్నాము. గత 18 సంవత్సరాలుగా, ప్రతీనెలా, ఓ పదిహేనుమందిమి, ఎవరో ఒకరి ఇంట్లో కలవడం ఆనవాయితీగా వస్తోంది. అందరం కొంత డబ్బు ప్రతీనెలా వేస్తూంటామనుకోండి, ఆ నెల ఎవరికి వస్తే, వాళ్ళింట్లో అన్నమాట పార్టీ. ఈ నెల నాపేరు వచ్చింది. మా వాళ్ళందరికీ, నేను చేసే వడలు తినడం ఇష్టం. మరీ వడా పచ్చడితో సరిపెట్టేస్తే ఏం బావుంటుందీ, అనుకుని, మావారు
ప్రతీ
శనివారం కొట్టే కొబ్బరికాయలు, పాలుతీసి, కోకోనట్ రైసూ, క్యారెట్ హల్వా, వీటికి సాయం
పావ్
భాజీ కూడా ఉంటే బావుంటుందని, ప్రణాళిక తయారుచేసికున్నాను. మిగిలినవాటి
మాటెలా ఉన్నా, పావ్ భాజీ ఇంట్లోకంటే, బయటనుండి తెప్పించుకుంటే బావుంటుందేమో అనుకున్నాను.. నెట్ లో వెదికితే కనిపించింది. ఉజ్జాయింపుగా 1 కిలో
ఎనమండుగురికి సరిపోతుందన్నాడు. 15 మందీ,
మావారూ, పనిమనిషీ (
not necessary in that order)
మొత్తానికి పదింటికల్లా అన్నీ తయారుచేసి పెట్టుకున్నాను, ఇంతలో ఆ భాజీవాడుకూడా వచ్చి, రెండున్నరకిలోల భాజీ ఇచ్చాడు. శుక్రవారప్పూటా, నీళ్ళ కొరత ధర్మమా అని, కాకిస్నానం చేసి దీపం పెట్టుకోవాల్సొచ్చింది. ఆయనైతే, నీళ్ళొచ్చిన
తరువాత చూద్దాం అనుకున్నారు. ఏదో పదార్ధాలన్నీ తయారైపోయాయి
కదా అని టెబుల్ మీద అన్నీ సద్దేశాను. చూడ్డానికి బావున్నాయి కదా అని ఓ రెండుమూడు ఫొటోలు తీసి, మావారికి పంపాను.. పాపం ఆయనకేమో, భార్య పనితనం అందరికీ చెప్పుకోవాలని తపనా.. తనకో
Facebook రంధోటుందిగా, అందులో, పదార్ధాలకి పేర్లు కూడా రాసి, ఆ ఫొటో కాస్తా
FB లో పోస్టు చేశారు..
ఇంకేముందీ.. క్షణాల్లో
లైక్కులూ, వ్యాఖ్యలూ, అక్కడికేదో తనే శ్రమ పడి అంతా చేశారన్నంత బిల్డప్పూ…
మొత్తానికి ఒంటిగంటయేసరికల్లా అందరూ వచ్చేశారు. రాగానే
నీళ్ళు
లేవని చెప్పేయడంతో, పాపం , వచ్చినవాళ్ళందరూ సహకరించడంతో, ఏదో చేసినవన్నీ పూర్తిచేసి, కొంతసేపు
తంబోలా
ఆడుకుని, కాలక్షేపం చేశాము.
చివరకి మిగిలినవేమయ్యా అంటే, మావారు అత్స్యోత్సాహం తో తెచ్చిన
5 ప్యాకెట్ల
పావులు.
మనవైపు
అందరూ ఏవేవో నోములూ అవీ పడుతూంటారు.. ఇక్కడ కొత్తగా, “ పావ్ “ నోము పడుతున్నాను. ఈ రేండురోజులూ, మా ఇంటికెవరొచ్చినా బొట్టుపెట్టి, ఓ “ పావ్
“ ప్యాకెట్టు పెట్టేయడమే…. ఎలా ఉందంటే.. “ ఉండమ్మా బొట్టెడతా.. “ కి బదులు “ ఉండమ్మా పావ్ ఇస్తా..”