అమ్మా శ్రీ లలితా రావమ్మా బంగారు బొమ్మ /అమ్మ/
ఘల్లు ఘల్లున పాద గజ్జెలు మ్రోయంగ అమ్మా శ్రీలలితా రావమ్మా బంగారు బొమ్మ /అమ్మా/
1) రత్నాల పీట వేసి- ఉష్ణోదకములు తెచ్చి
సంపెంగ నునె రాసి- అభ్యంగనము చేయ /అమ్మా/
2) పచ్చల కలశముతో- పన్నీరు తెచ్చినాము
పునుగు జవ్వాది గంధము- నలుగు పెట్టెదమమ్మా /అమ్మా/
3) వట్టివేళ్ళ సుగంధ- పరిమళ జలము తెచ్చి
అంబిక శిరము పైన- అభిషేకమొనరించెదమమ్మా /అమ్మా/
4) చుట్టు చెంగావి చీర- ఒప్పుగ కట్టబెట్టి
జలతారు సరిగంచు- రవిక తొడిగెదమమ్మా /అమ్మా/
5) పచ్చకర్పూరముతో- కస్తూరి బొట్టు పెట్టి
పాపిట సింధూర రేఖ- దిద్దెద నమ్మా రావే /అమ్మా/
6) కళ్ళకు కాటుక పెట్టి- పసుపు పారాణి దిద్ది
దిష్టి చుక్కను నీ- చెక్కిలిపై నుంచెదనమ్మా /అమ్మా/
7) తడియార కురులువిప్పి- సాంబ్రాణి ధూపం వేసి
మల్లె చేమంతులతో- మాలా తురిమెదమమ్మా /అమ్మా/
8) నడుమున ఒడ్డాణము- మెడలో మణిరత్న హారము
శిరమున మణిమయ- కిరీటముంచెదనమ్మా /అమ్మా/
9) చంద్రవంకను దెచ్చి- శిరముపై అలంకరించి
సిరిమోము గల తల్లిని- మరి మరి చూచెదమమ్మా /అమ్మా/
10)పాశాంకుశములు దెచ్చి- పంచబాణములు గ్రుచ్చి
చెఱకు విల్లును దెచ్చి- చేతనుంచెదమమ్మా /అమ్మా/
11) రత్నపాదుకలు దెచ్చి- రమణి పాదాలకు తొడిగి
శ్రీచక్రమందు నిలిపి- సేవా చేశెదమమ్మా /అమ్మా/
12) శివుని హృత్పీఠమందు- రాజరాజేశ్వరివై
పూజలందుకొనగ- జాగు చేయకె తల్లీ /అమ్మా/
13) పంచబ్రహ్మమంచపై- పరమేశుని సతి గూడి
లక్ష్మీసరస్వతులు- వింజామరలు వీయ /అమ్మా/
పైన ఇచ్చిన పాట నా చెల్లెలు ఇచ్చినది. 'రక్తసంబంధం' సినిమాలోని ' బంగారు బొమ్మ రావే...' బాణీ లో పాడితే బాగుంటుందని చెప్పింది.
9 కామెంట్లు:
Janmadina Subhakankshalu andi.
Happy Birthday Lakshmi gaaru :)
లక్ష్మి గారికి జన్మ దిన శుభాకాంక్షలు. ఏమి చేసారీరోజు?
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఇంతకీ ఇవాళ స్పెషల్ ఏమిటి?
సార్ గారు ఏం గిఫ్ట్ ఇచ్చారు?
పుట్టిన రోజు శుభాకాంక్షలండీ
బాగున్నారా?
లక్ష్మి గారికి జన్మ దిన శుభాకాంక్షలు !
Hello Pedda Akka,
Many more happy returns of the Day.
Aruna.
మా శ్రీవారు వ్రాసిన టపా లో చూసి, నా పుట్టినరోజు ( అక్టోబర్ 15) సందర్భంగా శుభాకాంక్షలు అందించిన జాబిల్లి, ఋషి,ఆవకాయ, అజ్ఞాత1( సౌమ్య),రహ్మానుద్దీన్,శ్రావ్య వట్టికూటి,అజ్ఞాత2 ( అరుణ) లకు నా ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి