అనుకోకుండా ఇద్దరు పద్మావతులను కలుసుకున్నాను ఈ రోజు,మొదటి పద్మావతి గురింఛి కొద్దిగా చెబుతాను.
పద్మావతి ఓసారి చుట్టూ కలయచూసింది. ప్రశాంతంగా వుంది. ఇంక రెండో పద్మావతి గురించి ఇంకో టపాలో....'ఇక్కడ నేనో మనిషిని. ఇక్కడ నేను జీవచ్చవాన్ని కాదు. ఇక్కడ నన్నెవరూ 'అది' అనరు. నా కంతకంటే ఏం అక్కర లేదు. మనిషిన్నేను...' లోపలికి నడుస్తున్న పద్మావతి పెదవుల మీద సన్నని నవ్వు వెలిగింది. ఎందుకంటారా వినండి, ' మొగుడు కొడితే మాదాకోళం వాడూ కొట్టాడన్నట్లుగా' భర్తే చులకనగా చూసినపుడు ఇంట్లో కొడుకు కోడలు, ఆఖరికి మనవలకి కాడా చులకనే మరి, కొనుక్కున్న ఫ్లాటుకి డబ్బంతా పెట్టేసి చేతిలో డబ్బాడక, కొడుకుని అడగలేక మళ్ళీ ఉద్యోగంలో చేరి తనకొక వ్యాపకం పెట్టుకొని భర్త తప్పుకుంటాడు,పైగా ఓ రోజు ' ముసల్దానికి ఒంట్లో బాగులేదా, లేచినట్లులేదూ." అని కొడుకుని అడుగుతున్న భర్త మాటలు విన్న తనకి ' వయసు తేడా ఎక్కువ వద్దుకాక వద్దు ఈ సంబంధం... ' అన్న తల్లి మాటలు గుర్తుకి వస్తాయి.కూరలు తరిగి చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి,గదులూ తడిబట్ట పెట్టి తుడిచి, బట్టలుతుకి, స్కూలు నుండి వచ్చిన పిల్లలకు బ్రెడ్,వెన్న, జామ్ రాసి సిద్ధం చేసేసరికి ' నానమ్మా, రోజూ ఇదేనా మా కొద్దూ, ఫలానాది కావాలి' అని స్పష్టంగా చెప్పకలరు కాని తనూ... అమ్మతనం, భార్యతనం,అత్తతనం,నానమ్మతనం- అన్ని ఆనందమే, కాని ఎప్పుడు ?తానూ ఒక మనిషినని ఇంట్లో వాళ్ళనుకున్నపుడు, లేకుంటే ఎక్కడినుండి వస్తుంది ఆనందం? చాకిరి చేసే యంత్రంలా వ్యక్తిత్వం లేని ప్రాణిగా నాలుగ్గోడల మధ్య జీవచ్చంగా బతుకుతున్న పద్మావతి ధైర్యం చేసి ఓ జత మారు బట్టలు సంచిలో పెట్టుకొని మెల్లిగా ముందు గదిలో సినిమా చూస్తున్న వారిముందునుండి తలుపు తెరిచి అడుగు బయట పెట్టి రోడ్డు మీదకొచ్చి నడవడం మొదలుపెట్టిన తనముఖానికి తగిలిన చల్లగాలికి, అరే, నేనూ మనిషినే, ఇంకా స్పర్శజ్ఞానం పోలేదూ అనుకుంటూ ' రెక్కల కష్టం మీద బతికే వాళ్ళ వసతి గృహానికి చేరుకొన్న తను ఓ మనిషినని జీవచ్చవాన్ని కాదని - నవ్వుకుంటుంది.
'అత్తయ్య ఉండబట్టికాని లేకుంటే కుదిరేదా' ' అత్తయ్య ఉన్నారు కనుక కాని పనివాళ్ళ మీద ఎలా వదిలి వెళ్ళగలను? ఉద్యోగానికి' అంటూ స్నేహితులతో గర్వంగా చెబుతూ," చిన్న యిల్లు, చిన్న కుటుంబం, రోజంతా ఎవరూ ఉండనేవుండరు దీనికోసం ఓ లాండ్రి, పనిమనిషి దేనికంటున్న కోడల్ని చూసి కష్టంగా ఉందని ఎవరనగలరు?
ఈ రోజుల్లొ ఎంతోమంది పద్మలున్నారు?కాని ధైర్యం చేసే వాళ్ళెంతమంది?
బహుముఖ ప్రజ్ఞావంతురాలైన కె.రామలక్ష్మి గారి "అదెక్కడ?" కధలోని పద్మావతి మొదటిది.
ఇంక రెండో పద్మావతి గురించి ఇంకో టపాలో....
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి