RSS

జై మాతాది...






   మొత్తానికి  “ అమ్మవైష్ణోదేవి  , మా స్నేహితులు శ్రీ దాసరి అమరెంద్ర గారి ద్వారాపిలుపుఅందించగా, ఇన్నాళ్ళకు, “ అమ్మదర్శనం చేసికుని, , మా 44 పెళ్ళిరోజున,  ( ఫిబ్రవరి 28 )  ఆశీర్వచనాలు అందుకునిక్షేమంగా తిరిగి వచ్చాము.
    కిందటిసారి, శ్రీ అమరేంద్ర పూణె వచ్చినప్పుడు, వారి చెవిలో మాట వేశాము—“ “మాకు వైష్ణోదేవి దర్శనం చేయిస్తారాఅని. ఎంతైనా వారిని మా దైవదూత క్యాటిగరీలో వేసికున్నాముగా మరి ! ఆయనకున్న బిజీ బిజీ కార్యక్రమాలలో, మా  కోరిక గుర్తుపెట్టుకుని సందేశం పంపారు, మూడు వారాల క్రితంపంపడమేమిటి, వెంటనే,  https://www.maavaishnodevi.org.  లో Register  చేసికుని, హెలికాప్టర్ టిక్కెట్టు  ( Rs.  4300 ఇద్దరికి, రాను పోను ), ఒక రాత్రి ఉండడానికి NIHARIKA Guest House  లో ఒక డబుల్ రూమ్ ( Rs 1300 ),    బుక్ చేసికుని, తరువాత ఢిల్లీకి, దురొంతోలో బుకింగు చేసేశాను. వివరాలు, ఆయనకు తెలియచేయగానే, ఆయన  ఢిల్లీ నుండి  Katra   బుకింగు చేసేశారు. ఇంకేముందీ, ఎన్నాళ్ళనుండో ఎదురుచూస్తూన్న , మా కోరిక సఫలీకృతం అవడానికి , కార్యక్రమం సెటిలయిపోయింది.
    ఫిబ్రవరి, 26 బయలుదేరి, 27 కి ఢిల్లీ చేరాము. స్టేషనులో, శ్రీ అమరేంద్ర గారు, మమ్మల్ని రిసీవ్ చేసికుని, ద్వారకా లో వారింటికి తీసికెళ్ళారు. రాత్రి, 8. 50 కి  రైలెక్కి, మర్నాడు ఉదయం  8.00 కి  Katra  చేరాము. అక్కడ  గెస్టు హౌస్ లో కాలకృత్యాలు పూర్తిచేసి, రెడీ అయాము. మా దారిన మమ్మల్ని వదిలేసి, శ్రీ అమరేంద్ర నడిచి కొండ ఎక్కడానికి వెళ్ళారు. మేమిద్దరమూ, ఆటో తీసికుని  ( మనిషికి 100 చొప్పునహెలిపాడ్ చేరాము. అక్కడ మా slot  1.00. కి, కానీ, ఖాళీలుండడం మూలాన, 11.15 ట్రిప్పులో ఎక్కించేశారు. అంతాకలిపి 5 నిమిషాల్లో కొండ పైకి చేరాము. పైన హెలిపాడ్ బయటే, గుర్రాలు, డోలీలు కనిపిస్తాయి. గుర్రం  ( మనిషికి Rs 275/-).  హెలికాప్టరు దిగీ దిగగానే వాళ్ళు చెప్తారుసరీగ్గా 3 గంటల్లో తిరిగి రావాలని. అక్కడ , శీఘ్ర దర్శనానికి ఒక Yellow Parchi  ఇస్తారు, అదిమాత్రం తీసికోవడం మర్చిపోకండి. లేక పోతే, పైకి ఎక్కిన తరువాత   Room No 8 , Kaali Mandir  లో కూడా, మీ రానూపోనూ హెలికాప్టరు టిక్కెట్టు చూపించినా ఇస్తారనుకోండి. సదుపాయం Round Trip  వారికి మాత్రమేడోలీలో వెళ్ళడానికి  Rs 2500 (మనిషికి), మోయడానికి నలుగురుంటారు. రానూ పోనూ 5000 అన్నమాట , హెలిపాడ్ నుండి, దర్శనం వరకూ. అయినా గుర్రాలు దిగి, పది నిముషాలు నడవాలనుకోండి. వివరాలన్నీ, మీకు తెలియవని కాదు, ఇప్పటిదాకా వెళ్ళని వారికి ఉపయోగ పడతాయేమో అని వ్రాశాను.      https://www.youtube.com/watch?v=7Bpigcf9uA4
    మొత్తానికి చెరో గుర్రమూ ఎక్కామండి. మనమేమైనా శివాజీ, రాణా ప్రతాప్ లమా ఏమిటీ, గుర్రం మీద కూర్చున్నంతసేపూ, అంటే 45 నిమిషాలు, గుండెలు అరచేతిలో పెట్టుకునే కూర్చున్నాను, అది గట్టిగా అడుగులేసి పరిగెత్తినప్పుడల్లా, గుండె గుభేల్ మనేది, ఎక్కడ కింద పడిపోతానో అని ! మొత్తానికి ఎక్కడా పడకుండా, Yello Parchi  చూపించగానే,   GATE No  5  వరసలో నుంచో పెట్టారు. తెరిచి ఉంటే, GATE NO 2.   ( పాత గుహ లోంచి కూడా అనుమతిస్తారు. అందులో పాకి వెళ్ళాలి ). మధ్య మధ్యలో   Gate  ని మూసేస్తూంటారు. అలాటప్పుడు,  GATE NO 5   అన్నమాటఏదైనా  PRIORITY DARSHAN  లోకే వస్తుంది. సాధారణ యాత్రికులకి   GATE No 3. దానికైతే చాలా పెద్ద క్యూ ఉంటుంది.. మనం అమ్మ దర్శనం చేసికుని,  3 గంటల్లో helipad  కి తిరిగి వెళ్ళడానికి చేసే సదుపాయం ఇది.
     పది నిముషాలు నడవగానే, “ అమ్మ “  దర్బారులోకి  వెళ్ళగలిగాము.  A LONG CHERISHED WISH WAS FULFILLED….  అక్కడ మనం కోరుకున్నవన్నీ తీరుతాయంటారు. కానీ అక్కడి దృశ్యం చూస్తే, అసలు కోరికలేముంటాయంటారూమనక్కావాల్సినవన్నీ అమ్మే చూసుకుంటుందిలే, అని దండం పెట్టుకుని వచ్చేయడమేఇక్కడ విషయం చెప్పుకోవాలి దేవుళ్ళకి కోపం వచ్చినా సరేమన తిరుపతి వెంకన్న, మహ అయితే, అర క్షణం, లేదా లిప్తపాటు మాత్రమే దర్శనం ఇస్తారు. కానీ ఇక్కడ, చాలా చాలా దగ్గరనుండి, కనీసం ఒకటి రెండు నిముషాలైనా, అమ్మని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది.
బయటకు వచ్చి, 45 నిముషాలు, మళ్ళీ గుర్రాలు ఎక్కి,, హెలికాప్టరులో, కిందికి క్షేమంగా తిరిగి వచ్చాము. హెలిపాడ్ నుండి, మళ్ళీ ఆటో ఎక్కి, తిరిగి గెస్టు హౌసుకి చేరాము.   ఇంకో గంటన్నరకి, శ్రీ అమరేంద్రగారు కూడా తిరిగి వచ్చారు. మర్నాడు ప్రొద్దుటే, 9.00 కి, ట్రైను ఎక్కి, జమ్మూ చేరాము. అక్కడ  శ్రీ అమరేంద్ర గారి స్నేహితుడు, శ్రీ పవన్ కుమార్, మమ్మల్ని  కలిసి, జమ్మూ లో ఉన్న కాళి మాత గుడి, రఘురాం జీ గుడికీ  తీసికెళ్ళి దర్శనం చేయించారు. రాత్రి మళ్ళీ రైలెక్కి, మార్చ్ 1 కి ఢిల్లీ చేరి, 2 బయలుదేరి, 3 తారీకు  ఉదయం 11 కి తిరిగి పూణె చేరాము.
   మా చిరకాలవాంఛ తీర్చుకోగలిగాము.

    వైష్ణోదేవి యాత్రలో  Online Registration  చేసికుంటే తప్పకుండా గుర్తుంచుకోవాల్సినవి

1.     Take a Print Out of Helicopter  Ride.

2.    Take the  Identity Proof (in Original) and also Debit/ Credit Card through which, payment was made.


3.   . Do NOT FORGET to Collect The YELLOW PRIORITY  PARCHI as soon as you land at SANJHI CHAT ( Uphills). Then only one can complete the Darshan successfully and return in time to the Helipad, for return Journey.





6 కామెంట్‌లు:

sarma చెప్పారు...


ఇల్లు కదిలి ఎక్కడికీ వెళ్ళలేకపోతున్నాం, నీతోపాటు మాకూ దర్శనం చేయించావు కదమ్మా! పుణ్యమంతా నీదే!
శుభమస్తు.

అజ్ఞాత చెప్పారు...

Our's also is the same opinion as of Shri Sarma'.s

Thank for your travelogue blog.Jai Matadee

Shastri & Sundari

Radhika Rao చెప్పారు...

Good travelogue. We couldn't visit Vaishnodevi due to the sickness of my homemaker.Your narration skill made us awesome. Just like watching a live video.Thank you for sharing.

Radharao చెప్పారు...

Good travelogue. We couldn't visit Vaishnodevi due to the sickness of my homemaker.Your narration skill made us awesome. Just like watching a live video.Thank you for sharing.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

శర్మగారూ,

ధన్యవాదాలు.

శాస్త్రిగారూ,

ధన్యవాదాలు.

రాధారావు గారూ
" అమ్మ " దయతో, మీ శ్రీమతి గారు త్వరలో కోలుకుని, అమ్మ దర్శణం చేస్తారని ఆశిస్తున్నాను.

Zilebi చెప్పారు...



భమిడి పాటి దంపతులకు శుభాకాంక్షలు !

జై మాతాదీ ! వైష్ణో !
ఓ మారైనాను వెళ్ళ ఓర్మిగ వేడన్
మామాతనుగ్ర హమునన్
ఆమూలాగ్రము దరిసెన మాయెను లక్ష్మీ !

చీర్స్
జిలేబి

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes