మా ఊరు తణుకు సమీపంలో మండపాక అనే గ్రామంలో యల్లారమ్మ గుడి వుంది. అమ్మవారి విగ్రహం చాలా చక్కగా సాలగ్రామ శిలతో అందంగా ఆకర్షణీయంగా వుంటుంది అమ్మవారి ముందరి కుడి చేతిలో ఖడ్గము, వెనుక కుడి చెతిలో ఢమరుకము, ముందరి ఎడమ చేతిలో పాయసపాత్ర, వెనుక ఎడమ చేతిలో త్రిశూలము తో అలరారుతూ వుంటుంది. భక్తులు సహస్రనామార్చన చేయించుకున్న తరువాత మహర్నివేదన జరిగాక, శ్రీ అమ్మవారి కిరీటము పై పుష్పములుంచి దండకము చదువుతారు, ఆ దండకము చదివేటప్పుడు ఆ భక్తుల కోర్కెలు సఫలమయెసూచనగా ఆ కిరీటమునుండి పుష్పములు ప్రసాదించును.ఆ దృశ్యం కనులవిందుగా వుండి శరీరమంతా ఝల్లుమని పులకిస్తుంది. భక్తుల శ్రద్ద యందు కాని మ్రొక్కుబడులలో కాని లోపమున్న యెడల ఒక్క పుష్పం కూడా కిందకి జారక అలాగే వేళ్ళాడుతూ వుంటుంది. కొంతసేపటికి ఆ లోపాన్ని పలికించి, అధర్మ, అనైతిక కోరికల్ని, కాకుండా సరిదిద్దుకునేలా చేసి పుష్పములని ప్రసాదించే చల్లనితల్లి.ఎల్లలు లేని యల్లారమ్మ. మా అమ్మ. మాకు ప్రత్యక్ష దేవత. మేము ఎప్పుడు ఆంధ్రా వెళ్ళినా ఆమె దర్శనం చేసుకొని వస్తాము. ఎలాంటి కష్టం వచ్చినా అమ్మా, అని నోరారా పిలిస్తే అభయమిచ్చే దేవత. అలాగే ఓసారి ఆలయానికి వెళ్ళినపుడు ఈ టి.వి. 2 వారు షూటింగు తీసారు. అక్కడె వున్న మమ్మల్ని కూడా టి.వి. లోకి ఎక్కించేసారు. . అదే కార్యక్రమం ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకి తీర్దయాత్ర లో చూపిస్తారని scroll లో చూశాము. అమ్మవారి దర్శనం తో మమ్మల్ని కూడా చూసేశయండి. ఒ.కె.
ఈ రోజు ETV-2 'తీర్థయాత్ర' లో 4.30 కి మా 'అమ్మ'
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 18, ఫిబ్రవరి 2011, శుక్రవారం
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి