RSS

గొణుక్కోవడం...

   అమ్మయ్య! నా టపాకి ఒక్కరూ కామెంటు పెట్టలేదూ, బతికిపోయాను. లేకపోతే నేను తన శైలి లో రాయడం జనాలు బాగుందనడంతో మా శ్రీవారికి కాస్తంత ... వద్దులెండి. మళ్ళి అవసరమయితే హెల్పు చేయరు.అయినా నా పద్దతిలో రాసుకొక తన పద్దతిలో రాయడం ఏమిటట? ఎరువు సొమ్ము దిగేసుకున్నట్లు? నా పద్దతిలో నేను రాసుకుంటాను. ఎవరు చదివితే ఏమిటట? చదవకపోతే ఏంటట? నా టపా నా యిష్టం అవునంటారా, కాదా?అయినా మొదట బార్యకి వినోదం, తరువాత భర్తకి వినోదం, ఆ తరువాత వీరిద్దరిని చూసి ఊళ్ళో వాళ్ళకి వినోదమట. అలా వుంది మా పరిస్థితి. నా మాట ఆయన వినరు, తన మాట నేను వినను.కాని మా యిద్దరిమాటలు ( తగాదాలే అనుకోండి) మిగిలిన వారికి ఆనందంగా వున్నాయంటే సంతోషంగానే వుంది.ఇంతకీ చెప్పోచ్చేదేమిటంటే మొన్ననే నేను ఆంధ్రా వెళ్ళోచ్చాను కదా ! ఇప్పుడు తను కూడా వెళ్ళాలే, అదే మరి వంతంటే,వంతుల వీరయ్య అనుకోండీ, పైగా నా కోసమని టిక్కెట్టు కి ట్రై చేశారట, దొరకలేదట.పెద్ద గొంతుక తో శ్రీనివాసుకి ఫోనులో చెప్పటం,నేను నమ్మాలన్న మాట.ఇంక మా పిల్లలు వాళ్ళ డాడి కి ప్రయాణపు జాగర్తలు చెప్పటం,ఎండలు కదా మరి, అందుకని,మొన్న నేను వెళ్ళినపుడు ఎండల్లొ కాక మలయమారుతం లో వెళ్లినట్లు, అయినా దేనికయినా పెట్టి పుట్టాలండి బాబూ,తన కెప్పుడూ రాజ యోగమేనూ,....

   ఏవో కొద్దిగా మాగాయకి మామిడికాయలు తెచ్చారు,తరిగి పోశాను. శ్రీవారు ఊరునుండి వచ్చిన తరువాత ఆవకాయకి కాయలు తెస్తారట.కారం, ఆవపిండి తెచ్చుకోవాలి కదా!నాకు కుదరలెదు, తేలేకపోయాను.అయినా మనం తెఛ్ఛేస్తే తనని అనేందుకు( ఆడిపోసుకొందుకు) అవకాశం వుండదు కదా!ఏ మంటారు? కాళ్ళు విరగకొడతారు, నాకు తెలుసు ఆందరూ ఆయన ఆప్తులు, అభిమానులని. అయినా ఎంత పెద్ద కందయినా కత్తి పీటకి.........లోకువేట !

4 కామెంట్‌లు:

రాఘవ చెప్పారు...

:)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

అవునండి ఎంత పెద్ద కంద అయినా కత్తి పీటకి లోకువే కదా. ఆవకాయ కాయ పట్టుకు రాకుండా వెళ్ళారా ? హన్నా, మేము మీ పార్టీ యే, అసలు మీరు తగ్గద్దు.

కొత్తావకాయ చెప్పారు...

బాగుంది కంద, కత్తిపీటల వ్యవహారం. తణుకు బెల్లం మార్కెట్ వెనుక పుట్టిల్లా? మా అత్తవారింటి దగ్గరేనన్నమాట.

ఆవకాయ కాయ వారూ, దినుసులు మనమూ తేవాలా, ఏం? మరీ సత్తెకాలం మనిషల్లే ఉన్నారే! బులుసు వారూ, నేనూ మీ పార్టీయే. "అన్నీ అమర్చి పెడితేనే ఆవకాయ" అని ఓ టపా రాసేయండి ముందు.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

@రాఘవ గారూ,

ధన్యవాదాలు.

@సుబ్రహంఅణ్యంగారూ,

మీలాటి వారి సపోర్టే నాకు శ్రీరామరక్ష !!

@కొత్తావకాయ గారూ,

మీరూ తణుకు వారే నన్నమాట !

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes