ఇక రెండో పద్మావతి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి "సీతాపతి" కధ లోని సీతాపతి గారి భార్య.
జీవితం వడ్డించిన విస్తరిగా వుంటే సరిపోతుందా? అందులో ఇష్టమైన పదార్ధాలుండొద్దూ? చవి సారంలేని చప్పిడి తిండి తినమంటీ ఎలా? ఉక్రోషం పొంగి తిరుగుబాటుతనంతో ఉన్నదాన్ని వదులుకుని లేనిదానికోసంపరుగులెత్తిన సీతాపతిని వెనక్కి తెచ్చుకున్న పద్మావతి .
"పెళ్ళాన్ని చంపేయాలీ, బొచ్చుకుక్కని చంపేయాలి, పోస్టుమాన్ ని చంపేయాలి,డాక్టర్ని చంపేయాలీ, పక్కింటి వాళ్ళబ్బాయిని చంపేయాలీ, " బద్దకంగా వుందా, పోనీ టానిక్కు యివ్వానా? " ఇదుగో తాగండీ, పద్మావతి మందుగ్లాసు నోటి దగ్గర పెట్టింది.లాలనగా తియ్యగా కళ్లలోకి చూసింది. పువ్వులతో వున్న పున్నాగచెట్టూ, నగీషల దంతపు గిన్నెలో వున్న అగరువత్తుల గుత్తి, న్క్షత్రాలతో మెరుస్తున్న శరదాకాశములా అందంగా వుంటుంది, తియ్యగా మాట్లాడుతుంది.అందరికి పడ్మంటే యిష్టమేనూ, ఈ లోగా లైఫ్ పత్రిక చదువుకోండి," టొమాటో పెరుగుపచ్చడి, ములక్కాడ సాంబారు చేయిస్తున్నాను, ఇష్టమేకదూ, టమేటా వద్దని గోంగూర అడిగితే " గోంగూర పైత్యం మధ్యాన్నం భోజనం చేసి కునుకు తీసేసరికి పోస్టుమేన్. సీతాపతిని చూసి " మీకేమీ లేవండీ సార్ అన్ని అమ్మగారికే " ఓ దొంతర ఆమె చేతికిచ్చి " ఆయనకేం మహరాజు. హాయిగా తిని పడుకుంటే దొరలా వెళ్ళిపోతుంది. మా దొడ్డ జాతకం లెండి అయ్యగారిది" అంటూ చిరునవ్వుతో వెళ్ళిపోయే అతను మూడొహత్యకి లక్ష్యమయ్యాడు. అతను కోరినవి తినలేడు. డాక్టరు నిషేధం వుంది. అతని దినచర్య అంతా డాక్టరు ఏర్పాటు చేస్తాడు, దాన్ని తు.చ. తప్పకుండా పద్మ ఆచరిస్తుంది.దేశంలో, ఖండాంతరాలలో ఎమైనా వ్యాపించే రోగాలన్ని కూడబలుక్కుని అమాయకుడు అందగాడైన తన భర్త దేహంలో ప్రవేశిస్యాయోమోనని కాపలా కాస్తూ వుంటుంది,ఏ డయాబెటిసో గాస్ట్రిక్ ట్రబులోకో దింపుతుందనే డాక్టరు మాటలో అవమానము అవహేళన సూదులతూ గుచ్చినట్లుగా ఫీలవుతూ అతన్ని కూడా తన లక్ష్యంలోకి తీసుకుంటాడు. చిన్న లోతైన కళ్ళతో తీరికగా బద్దకంగా రాజకుమారిడిలా పక్కింటి పిల్లాడు వచ్చి 'హి హి హి' అని నవ్వుతూ " మా అమ్మ నన్ను తిట్టింది, ఏమనో తెలుసా,' పని పాట లేకుండా పద్మమ్మ మొగుడిలా తయారవుతున్నావు వెధవా" అని చెబుతాడు, అతను కూడా ఓ లక్ష్యమైపోయాడు. ఈ సమస్యకి పరిష్కారం మార్క్సిజంలో లేదని గాంధీజమే దారి చూపగలదని పద్మనీ పద్మ యిచ్చే సౌఖ్యాన్ని,భోగాన్ని,భధ్రతని కాదని కట్టుబట్టలతో ఇంట్లోంచి వెళ్ళిపోతాడు,వర్షంలో తడిసిన ఆతనికి నిమోనియా వచ్చినతన్ని తనఇంట్లొ పెట్టుకొని వైద్యం చేయించి తనకూతుర్నిచ్చి వివాహం చేయిద్దామనుకుంటాడు.ఆతని తలకిందనున్న పుస్తకాన్ని చూసి ,కలవారి బిడ్డ అని తెలుసుకొని ఏప్రమాదమయినా జరిగితే క్రిమినల్ కేసులో ఇరుక్కోవడం తప్పదనుకుంటూ పద్మావతికి తెలియబరచడం, ఆ వెంటనే గుమాస్తా గోవిందయ్య, ఫ్యామిలిడాక్టరు, రెండు మూడు బుట్టల సామానూ హోల్డాలు తో వచ్చిన పద్మ ఎలా వుందంటూ వచ్చిన పద్మని ముసలాయన పూజారి తన భార్యతో " సీతాపతిగారి భార్య పద్మావతీ దేవి " అంటూ పరిచయంచేస్తాడు. పరిచితమైన తొడ మీద తన తల ఆనించి వుండడంచూసి " వచ్చావా పద్మా" అంటాడు సంతోషంగా, ఆసాయంత్రం భర్తతో వెళ్లెముందూ పూజారి కుటుంబానికి తన కృతజ్ఞత తెలియబరచి పూజారి కూతురితో "నీకు మంచి మొగుడు రావలని ఆశీర్వదిస్తూ తన మెడలోని రెండు పేటల గొలుసు తీసి పెళ్ళి కానుకగా మెడలో వేస్తూ "నా భర్తలాంటి వాడిని కట్టుకున్నా సుఖపడేది ఏమీ వుండదంటూ " చరాలున కారులో కార్చుని వెళ్ళిపోతుంది.
" కాఫీ తాగారా?'
" అయితే స్నానానికి లేవండి, వేణ్ణీళ్ళు తొలిపి పెట్టాను,"
' గోంగూర పచ్చడి పైత్యం మీ వంటికి అసలు పడదు.'
తను తినే తిండి , చదివే పుస్తకం దగ్గరనుండి క్లబ్బులొ మెంబరుషిప్పు కట్టి పదో,పరకో చేతిలో పెట్టి తక్కువ స్టేక్సు తో ఆడమని సూచిస్తుంది. మందులు తనే కొంటూంది తన ఆరోగ్యాన్ని కంటికిరెప్పలా కాపాడుకొంటూంది.ఒక పాలేరు,ఒక వంటావిడ, ఒక గుమాస్తా ఈ ముగ్గురి సిబ్బంది తో మక్తాలు వసూలు చేసుకొంటుంది,పన్నులు కట్టిస్తుంది,కూరలు ఆమే కొంటూంది,జమా ఖర్చులు చూసుకొంటూంది ఆఖరికి రాత్రి తలుపులు ఆమే చూసుకొంటూంది. ఇలా కాదని ఓసారి ఆలస్యంగా ఇంటికి వచ్చి రెచ్చిపోతూ అన్నం తినేసి కూర్చున్నావా?అన్న భర్తని చూసి కూల్ గా ఈ రోజు శనివారంకదండీ,భోజనంచేయనని తెలుసు కదా, మీ డైజషను అసలే మంచిది కాదూ, జీర్ణశక్తి పాడైపొతే ఇలాగే కోపం వస్తుందని డాక్టరు అన్నారు,పళ్ళరసం ,గ్లూకోజ్ కలిపి ఇవ్వనా సత్తువ చేస్తుంది అనే చక్కని పద్మ పాతిక ఎకరాల ఆస్తి తో పెద్దమేడ , బాంకులో ముప్పై వేలతో వున్న తను నిరుద్యోగ్గాన్ని సాకు తో ఆధికారం చెలాయిస్తుందని దెబ్బలాడి తన అధికారాన్ని చూపిస్తుంమోనని అనుకుంటాడు కాని ఆమె ఎప్పుడూ పల్లెత్తు మాట ఆనదు, పైగా భర్తే సర్వస్వం అంటూంటుంది. అంత ప్రేమగా చూస్తున్న భార్యని అర్ధం చేసుకోగా తనని బొచ్చుకుక్కని ఓకేలా ఇష్టాఇష్టాలు, వ్యక్తిత్వం లేనట్లుగా తనపై పూర్తిగా తన వశం చేసుకున్నట్లుగా భావించి బొచ్చుకుక్కకి, తనకి విముక్తి లేదని తనని బొచ్చుకుక్కతో పోల్చుకొని రెండో హత్యకి కుక్కని లక్ష్యం చేసుకుంటాడు.
2 కామెంట్లు:
ఇద్దరు పద్మావతుల్నీ బాగా వివరించారు. ఒకరు అస్తిత్వం లేక బాధపడితే, మరొకరు అస్తిత్వం లేదని బాధ పడుతున్న భర్తతో బాధపడ్డారు. మొత్తానికి ఇద్దరూ పద్మావతులే.. కాని ఎంత తేడా.. బాగారాసారు.
శ్రీలలితగారూ
మీరు వ్రాసిన వ్యాఖ్యతో టపా పూర్తి అయింది. మొదటి పద్మావతి లాంటి వారు ఏ అద్దమూ లేకపోయినా కనిపిస్తున్నారు. రెండో పద్మావతి లాంటి వారు భూతద్దం పెట్టి వెదికినా కనిపించటం లేదు.ఆఛ్
కామెంట్‌ను పోస్ట్ చేయండి