పెద్దలకు వందనాలు. చిన్నలకు ఆశిర్వచనములు. చాలా రోజల తరువాత మీ అందరిని కలుస్తున్నందుకు సంతోషంగావుంది. మీ అందరిని కంటి తో చూడకపోయినా మీ మనొభావలతొ బ్లాగులొ పంచుకున్న మీకు దూరంగా వున్నందుకు చాలా బెంగ అనిపించింది.
మధ్యలొ ఒకటి రెందు సార్లు కూడలి కి వచ్చినా మనసు తీరలేదు. చూసేందుకు కుదరలేదు. ఇంక యిప్పుడు రోజూ కలవచ్చును.
ముందర అందరి బ్లాగులు పాతవి చదవాలి.సంగతులు తెలుసుకొవాలి.
అందరూ పొద్దు గడి నింపి పంపేవుండివుంటారు. నాది కొద్దిగా గడబిడ అయిపోయింది. పొరబాటున అసంపూర్తిగా పంపేసాను. రాజమండ్రి నుండి వచ్చి రెండు నెలలయింది. మళ్ళి పూనా , పూనా స్నేహితులు
పాత పరిసరాలలో పాత స్నేహితులలొ కొత్త జీవితప్రయాణం. ముందర షిరిడి వెళ్ళి సాయిబాబ దర్శనం చేసుకొని వచ్చాము. ఒక్కప్పుడు బాబాకి మా స్వహస్తలతొ దండవేసి ,పాదాలమీద మోకరిల్లీ ప్రార్దించుకున్నాము.మరి యిప్పుడొ దర్శనానికే రెండు గంటలు పట్టింది..
1 కామెంట్‌లు:
హమ్మయ్యా! వచ్చేసారా!! మీకోసమే చూస్తున్నాము.
కామెంట్‌ను పోస్ట్ చేయండి