RSS

" ఉండమ్మా.. " పావ్ " పెడతా...    మా స్నేహితురాళ్ళు అందరం కలిసి ప్రతీనెలా చేసుకునే పార్టీ నెల మా ఇంట్లో చేసికున్నాము. గత  18 సంవత్సరాలుగా, ప్రతీనెలా, పదిహేనుమందిమి, ఎవరో ఒకరి ఇంట్లో కలవడం ఆనవాయితీగా వస్తోంది. అందరం కొంత డబ్బు ప్రతీనెలా వేస్తూంటామనుకోండి, నెల ఎవరికి వస్తే, వాళ్ళింట్లో అన్నమాట పార్టీ. నెల నాపేరు వచ్చింది. మా వాళ్ళందరికీ, నేను చేసే వడలు తినడం ఇష్టం. మరీ వడా పచ్చడితో సరిపెట్టేస్తే ఏం బావుంటుందీ, అనుకుని, మావారు  ప్రతీ శనివారం కొట్టే కొబ్బరికాయలు, పాలుతీసి, కోకోనట్ రైసూ, క్యారెట్ హల్వా, వీటికి సాయం  పావ్ భాజీ కూడా ఉంటే బావుంటుందని, ప్రణాళిక తయారుచేసికున్నాను.  మిగిలినవాటి మాటెలా ఉన్నా, పావ్ భాజీ ఇంట్లోకంటే, బయటనుండి తెప్పించుకుంటే బావుంటుందేమో అనుకున్నాను.. నెట్ లో వెదికితే కనిపించింది. ఉజ్జాయింపుగా  1 కిలో ఎనమండుగురికి సరిపోతుందన్నాడు 15 మందీ, మావారూ, పనిమనిషీ (  not necessary in that order)
కలిపి రెండుకిలోలు  సరిఫొదా అనుకున్నాను. మావారికి ప్రతీదానికీ, నన్ను కోప్పడుతూంటారుప్రతీదీ  overestimate  చేస్తావూ అని, అలాటిది తనకే అనుమానం వచ్చి రెండున్నర కిలోలు పంపించమన్నారు.. మనలోమనమాట  కరెక్టుగానే సరిపోయిందిప్రణాళిక బాగానే ఉంది.. కానీ మిగిలినవన్నీ కూడా సహకరించాలిగా.. పప్పు నానపెట్టుకోడానిక్కూడా నీళ్ళ చుక్క లేకుండా పోయింది. అదేం కర్మమో, సరీగ్గా సాయంత్రం ఏడున్నరకి నీళ్ళు ఆగిపోయాయి. మధ్యన కార్పొరేషన్ వారి నీటి కోత ధర్మమా అని, ప్రతీరోజూ, మా సొసైటీలో, పగలు నాలుగ్గంటలు కట్టేస్తున్నారు. దానితో  నీటివాడకం మీద నియంత్రణ వచ్చిందనుకోండి, కానీ ఇలా అధ్ధంతరంగా రాత్రికూడా నీళ్ళు రాకపోయేసరికి, నిజం చెప్పొద్దూ భయం వేసింది. మావారు మాత్రం, ఊరికే కంగారు పడకూ, అవసరం అయితే, రెండో మూడో పెద్ద బాటిళ్ళు నీళ్ళు తెప్పించుకుందామూ .. అంటారుమినరల్ వాటర్టాయిలెట్లలో ఉపయోగిస్తామా మరీనూ అనుకుని, చూద్దాం తెల్లారనీ  అనుకున్నాము. ఇంతలో ఏమయిందో, పైప్పులలో మిగిలిన నీళ్ళు కాబోసు, పావుగంట , వచ్చేసరికి ఇంట్లో ఉండే వాటర్ బాటిళ్ళూ, బాల్చీలూ నింపేశాము. అయినా ఎంతనీరుంటే సరిపోతుందీ వచ్చేదేమో కనీసం పదిహేనుమంది.. చూద్దాం ఏదో ఒకటి అనుకున్నాము. వచ్చిన నీళ్ళలోనే మినప్పప్పు నానపెట్టాను. క్యారెట్టు తురిమి, హల్వా తయారుచేశాను. ఇంక పావ్ బయటనుండే తెచ్చుకోవాలిగా.. నన్నంటారు కానీ , అసలు మావారిదే అంతా overestimate  అని తేలిపోయింది.ఆయనకి చెప్పిందేమిటీఒక్కోరికీ, రెండు పావులచొప్పున, 30 పావులూ, పైన పదీ తెమ్మన్నాను. ఒక్కో పాకెట్ లోనూ మూడు జోడీల పావ్ మాత్రమే ఉంటుందని, 15 మందికీ , ఒక్కోరికి రెండేసి జోడీలూ, మారడిగితే ఇంకో జోడీ అని లెక్కేసికుని, ఏదో మొత్తానికి 10 ప్యాకెట్లు తెచ్చారు. తీరా చూస్తే, ఒక్కో ప్యాకెట్టుకీ, నాలుగేసి జోడీలు అటోటీ, ఇటోటీ, వెరసి  40 జోడీలయ్యాయి. ఏం లెక్కో ఏమిటో.. చిత్రం కాకపోతే అన్నేసి తెచ్చుకుంటారా మరీనూ? అంతా అయోమయం, అధ్వాన్నమూనూ..
    మొత్తానికి పదింటికల్లా అన్నీ తయారుచేసి పెట్టుకున్నాను, ఇంతలో భాజీవాడుకూడా వచ్చి, రెండున్నరకిలోల భాజీ ఇచ్చాడు. శుక్రవారప్పూటా, నీళ్ళ కొరత ధర్మమా అని, కాకిస్నానం చేసి దీపం పెట్టుకోవాల్సొచ్చింది. ఆయనైతే, నీళ్ళొచ్చిన తరువాత చూద్దాం అనుకున్నారు. ఏదో   పదార్ధాలన్నీ  తయారైపోయాయి కదా అని టెబుల్ మీద అన్నీ సద్దేశాను. చూడ్డానికి బావున్నాయి కదా అని రెండుమూడు ఫొటోలు తీసి, మావారికి పంపాను.. పాపం ఆయనకేమో, భార్య పనితనం అందరికీ చెప్పుకోవాలని తపనా.. తనకో  Facebook  రంధోటుందిగా, అందులో, పదార్ధాలకి పేర్లు కూడా రాసి, ఫొటో కాస్తా  FB  లో  పోస్టు   చేశారు.. ఇంకేముందీ.. క్షణాల్లో  లైక్కులూ, వ్యాఖ్యలూ, అక్కడికేదో తనే శ్రమ పడి అంతా చేశారన్నంత బిల్డప్పూ
    మొత్తానికి ఒంటిగంటయేసరికల్లా అందరూ వచ్చేశారు. రాగానే  నీళ్ళు లేవని చెప్పేయడంతో, పాపం , వచ్చినవాళ్ళందరూ సహకరించడంతో, ఏదో చేసినవన్నీ పూర్తిచేసి, కొంతసేపు  తంబోలా ఆడుకుని, కాలక్షేపం చేశాము.

 చివరకి మిగిలినవేమయ్యా అంటే, మావారు అత్స్యోత్సాహం తో తెచ్చిన  5 ప్యాకెట్ల పావులుమనవైపు అందరూ ఏవేవో నోములూ అవీ పడుతూంటారు.. ఇక్కడ కొత్తగా, “ పావ్నోము పడుతున్నాను. రేండురోజులూ, మా ఇంటికెవరొచ్చినా బొట్టుపెట్టి, పావ్ప్యాకెట్టు పెట్టేయడమే…. ఎలా ఉందంటే..ఉండమ్మా బొట్టెడతా.. “ కి బదులుఉండమ్మా పావ్ ఇస్తా..”


పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes