RSS

పంజాబి డ్రెస్

   మేము తిరిగి పూనా వచ్చామనితెలిసి మా పాత స్నేహితులు ఒక్కొక్కరే వచ్చి చూసివెడుతున్నారు. నిన్న ఒకావిడ వచ్చారు.అవి ఇవి కబుర్లు అయిన తరువాత ఒకామె పేరు చెప్పి ఆమెని కలిసావా అని అడిగింది. మేము తరచూ కలుస్తూనే వుంటాను.మీరు దూరం వెళ్ళిపోయారు కాని మేమంతా చిట్ (కిట్టిపార్టి) పార్టి వాళ్ళమే కదా! ఎందుకు అడుగుతున్నావని ఆడిగితే అప్పట్లొ మనము సల్వార్ ,కుర్తాలు వేసుకుంటే మనకి ఎన్ని పేర్లు పెట్టేదో కదా మరి ఇప్పుడు తను కూడా వేసుకొంటొంది చూసావా?
పోనిలే యిప్పటికయినా అందులో సుఖం తెలిసింది అని చెప్పి పంపించేసాను. కాని ఆ తరువాత నాకు పాత రోజలు గుర్తుకువచ్చాయి.

    నేను చదువుకునే రోజుల్లొ ఎన్.సి.సి. లో వుండేదాన్ని.మాస్కూల్లొ పెరెడ్ అయితే తెల్లరంగు పంజాబి డ్రెస్ పాలిటెక్నిక్ కాలేజ్ వెడితె కాకి డ్రెస్ వేసుకునేవాళ్ళం. మిలటరి మేజర్ అనుకుంటాను ఆయన వచ్చినా కాకి డ్రెస్ వేసుకునేవారము.ఇంక మా యింట్లొ అ బట్టలు ఓ చేతి సంచిలో పెట్టి వరండా లో ఓ మేకుకి తగిల్చిపెట్టవలసినదేను. లోపలకు ప్రవేశం వుండేదికాదు.ఎన్.సి.సి వున్నప్పుడల్లా ఆలస్యంగా యింటికి రావడం చివాట్లు తినడం ఎప్పుడూ ఒకటే డైలాగు ఎన్.సి.సి.యా దిబ్బ సి.సి.యా అంటూ, అయినా అల్లాగే వెళ్ళేదాన్ని. కారణం నాకు అ బట్టల మీదున్న మోజు కొద్దీ, ముఖ్యంగా పంజాబి డ్రెస్ అంటేను--(అప్పట్లొ అలాగే అనేవారు) స్కూల్లో యిచ్చేవారబట్టలుఅవి మూడే సైజుల్లొ వుండేవి.తెల్లరంగు బూట్లు.వాటిని సన్ లైట్ సబ్బు లేకపోతే 501బార్ సబ్బు తొ వుతుక్కొని,భయపడుతూ,భయపడుతూ నాన్నగారిని ఓ పావలా అడిగితీసుకొని చాకలితో ఇస్త్రీ చేయించుకొని స్కూల్లొ పెరెడ్ ముందర స్కూల్ యూనిఫామ్ తీసి యివి వేసుకొని మళ్లి ఎన్.సి.సి. క్లాసు అయిన తరువాత యివి మార్చి మళ్ళి యూనిఫాం వేసుకొని యింటికి రావలసివచ్చేదాన్ని.ఇంత శ్రమ పడినా కేంప్ కి పంపలేదు, సర్టిఫికెట్ రాలేదు.అది వేరె సంగతనుకోండి..

    పెళ్లి అయి వచ్చిన తరువాత మా వారికి ఎలాంటి అభ్యంతరం లేదు కనుక అస్తమాను కాకపోయినా అప్పుడప్పుడు వేసుకునేదాన్ని.మా అమ్మాయి పెళ్ళయి మనవరాలు పుట్టిన తరువాత ఎక్కువగా వేసుకునేదాన్ని.ఎందుకంటే అమ్మాయి ఎప్పుడూ ఫొను చేస్తే అప్పటికప్పుడు మా అబ్బాయి అన్ రిజర్వుడ్ కంపార్టుమెంటులొ కర్కీ స్టేషనులొ కూర్చ్బెడితే కళ్యాణ్ లొ దిగెతే మా అల్లుడు స్కూటర్ మీద డోంబ్విల్లి వాళ్ళ యింటికి తీసుకువెళ్ళెవాడు.ఆ సందర్బంలో ఓ సారి ఓ ప్రయాణీకురాలి చీర ఆ జనంలో వూడిపోయింది.పాపం సిగ్గుతో ఎంతో బాధ పడిపోయింది. అప్పటినుండి నెను ప్రయాణానికి చేతిలో చిన్నసంచి, ఓ హెండ్బాగ్. చక్కగా డ్రెస్ వేసుకోవడమ్ అలవాటు అయిపోయింది.దూర ప్రయాణాల్లొ బెర్తు మీద ఎక్కేందుకు,కొంతమంది అదే పనిగా చూస్తూవుంటారు,వాళ్ల కళ్ళకి గొళ్ళాలు, మన మెడలో వుండే గొలుసుకి (కనీసం సూత్రాల తాడు వుంటూందిగా)సేఫ్టీ.(యిది అప్పట్లొ మాట.)
మార్నింగ్ వాక్ కి ఈవ్నింగు వాక్ కి మా వారితో బయటకు వెళ్ళేటపుడూ చిట్ పార్టీలకు పిక్నిక్ లకూ యిప్పుడూ అంతేను,
అప్పట్లో డ్రెసులు వేసుకున్న మమ్మల్ని ఏదో ఒకటి అంటూండేవారుసరదాగాను, వ్యంగంగాను కూడాను,యిప్పుడు వాళ్ళే కొడుకులతో కోడళ్ళతో,మనవలతో బయటకు వెళ్ళినా పూజలకు పేరంటాలకూ వెళ్ళ్లినా డ్రెస్సులతో వెడుతూవుంటే చిత్రంగావుంది.
అందుకనే నోటినుంచివెలువడిన మాట, జారిన అవకాశం , గడచిపోయిన సమయం మళ్ళీ తిరిగిరావు.అప్పుడు అలా అన్నందుకెగా యిప్పుడుఆవిడ గురించి చెప్పుకునేది,

   సరే ఇంతకీ చెప్పెదేమిటంటే నిన్న మాశ్రీవారు బేర్ ఆడిటింగుకి వెడుతుంటే ముందు నేను బయలదేరాను కాని తరువాత నాకు పని వుందని చెప్పి మానేసాను.దానికి ముందు డ్రెస్ తీసుకోవాలట.ఆ తరువాత మార్చలంట,అప్పడు ఆల్టర్ చేయించాలట, నేను కూడా వెడితే ఆమాత్రం తెలీదా అని అనుకుంటారని,తప్పుకున్నాను, నిజంగానే తను తెచ్చిన తరువాత మార్చవలసివచ్చింది,చుడీదారు తెచ్చారుఅది మార్చి సల్వారు తెప్పించాను, ఆ తరువాత ఈవిడ రావడం దాని తో ఈ ఆలోచనలన్నీను----.

భక్తి సుధ

ఈరోజు మా శ్రీవారు బేర్ ఆడిటింగు కి వెళ్ళారు. అందువల్ల నాకు కంప్యూటరు తొ సమయం గడిపేందుకు అవకాశం దొరికింది. అటు ఇటు చూస్తూ ఓ మంచి మాస పత్రిక పుస్తకం చదివాను. చదివిన పుస్తకాన్ని మిత్రులతో పంచుకుంటే ఇంకా ఆనందంగా వుంటుందికదా మరి.(ఇక్కడ మాకు దొరకని పుస్తకం.) మీరు కూడా చదివి ఆనందించండి

ఇక్కడ చదవండి

గృహహింస

   అందరూ పల్లకి ఎక్కి కూర్చుంటే మోసెవారుకూడా వుండాలి కదా,అల్లాగే అందరూ వ్రాసేవారుంటే ఎలా? చదివెవారు వుండాలికదా అందువల్ల నేను చదవడంఇష్టపడతాను. అయినా కొతమంది అనుకున్నది అనుకున్నట్లుగా వ్రాయగలరు. కొంతమంది మాట్లేడేందుకు మితభాషి అయినా చక్కగావ్రాయగలరు, కొంతమంది మాట్లాడ్డం చక్కగా మాట్లాడి పదినిమిషాలుండి వెడదామనుకున్నవారిని ఓ గంట కూర్చోపెట్టగలరు మాటలతో, వీరికి కాయితం మీద అక్షరంపెడితే కలం ముందుకుసాగదు. మరి కొంతమందికి ఈ రెండు కళలు చక్కగావుంటాయి. ఆదృష్టవంతులు. అలాంటి కోవలోకే మాశ్రీవారు వస్తారు. బాగుందయ్య. తనదారిన తను వ్రాసుకుంటున్నారు. ఆనందంగావుంది. నన్ను వ్రాయమంటారే అదే కొంచం యిబ్బందిగావుంది ఇది యిప్పటిమాట కాదు,1972నుండి యిదే పాట. ఎందుకంటే అప్పుడు నేను వ్రాసిన కధ, కాదు వ్యధ, కాగితాలు నా కంట పడ్డాయి.మీరూ నాకధ చదివీ అమ్మయ్య బతికిపోయామనుకుంటారు,చూడండిమరి. (లేకుంటే ఎంతమంది నా హింసకి బలి అయివుండె వారో)

    నేను ఒక సామాన్యకుటుంబములో పుట్టి పెరిగాను, మరో సామాన్యకుటుంబములొ కోడలిగా వెళ్ళాను.అన్నికధలు, నవలలూ, కనిపించిన అన్ని పుస్తకాలు చదువుతాను.దాని మీద అభిప్రాయాలు లోటుపాట్లు నాలో నేనే చర్చించుకుంటాను. రచయిత, రచయిత్రులను మెచ్చుకుంటాను. కాని నేనే ఓకధ వ్రాయవలసివస్తుందని కలలో కూడా అనుకోలేదు. మాశ్రీవారికి నేను కధలు వ్రాయాలని ఓ రచయిత్రినవాలని ఓ పెద్దకోరికగా పరిణమించింది. ముందర లాలనగా ఆ తరువాత అభ్యర్దనగా ఆపై ఆజ్ఞాపించడం మొదలుపెట్టారు. క్రొత్తగా వివాహమయిన మా దాంపత్యంలో ఇదొక ప్రళయంగా మారింది
ఓరోజు ఆఫీసు నుంచివస్తూ కాయితాలు,పెన్ను యిచ్చి కధ వ్రాయమని ఇంట్లో పని తను చూసుకుంటానని,కావాలంటే ఎక్కడకయినా తీసుకువెడతానని, ఓమంచి కధా వస్తువు దొరుకుతుందని అన్నారు.(ఇదేమయినా బయట దొరికే వస్తువా) అప్పటికి తప్పించుకొవచ్చనని నిజమేనండీ, వెడదాము ఏదయినా దొరకొచ్చు అన్నాను సాలోచనగా,అంతే ఆ మర్నాడు నుండి వరుసగా ఓ మూడు రోజులుశలవు పెట్టి పూనా అంతా ఓపిగ్గా బండ్ గార్డెన్,మండేబజార్,సారస్ బాగ్, ఆగాఖాన్ ప్యాలెస్,మ్యూజియమ్,మొదలయినవి మధ్యలో హొటెల్సు,చూపించి ఇంక కధ వ్రాయమన్నారు,భలే సరదగా చూసానేకానినాకు ఏమీ తట్టలేదు."బజారులో వంకాయలు కొన్నట్లా కధ వ్రాయడమంటే" అని రచించడంలోని సాధకభాధలన్ని నాకు తెలుసున్నంతవరకూ విడమర్చి చెప్పాను.,

    మూడు రోజులు 90రూపాయలు తగలేసి శలవు పెట్టి మరీ తిప్పానుకదా, నీకు ఏమీ తట్టలేదా,మళ్ళి యిన్ని పుస్తకాలు చదువుతావు?అంటూ నిలదీశారు. ఇంక తప్పదనుకొని వ్రాయడానికి నిర్ణయం చేసేసుకున్నాను.చాలా సీరియస్ గా ఆలోచనలోపడ్డాను. ప్రఖ్యాత రచయిత, రచయిత్రులు ఎలా వ్రాశారో, అనుకుంటూ క్షుణ్ణంగా చదవడం మొదలుపెట్టాను. కధలో పాత్రల పేర్లు ఏమి పెట్టాలి? కధకి ఏం పేరు పెట్టాలి?ప్చ్! సరికొత్తపేర్లు పెట్టాలి, కధ ఏమిటీ? ఓ నవలే వ్రాసేయాలి దెబ్బతో పెద్ద రచయిత్రినయిపోవాలి, అంతేకాదూ ఓ పుణ్యాత్ముడు దాన్ని ఓసినిమగా నిర్మించాలి. పాఠకలోకానికి అత్యంత పాత్రురాలినయిపోవాలి,అనుకుంటూ పెన్ను కాయితాలు తీసుకుకూర్చున్నాను, కానిఏం వ్రాయాలొ తోచలేదు. కిటికిలోంచి అరుగు మీద అమ్మలక్కలు కబుర్లు చెప్పుకుంటున్నట్లు కనిపించీంది అక్కడాకు వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకొంటున్నారొ రాసేస్తేపోదూ, అనుకొని అక్కడకి వెళ్ళాను, నన్ను చూసి రండి, కూర్చోడి అమ్టూ బాతాఖానిలో పడిపోయారు, ఆ కబుర్లుతో మూడు గంటలు గడచిపోయాయి,స్కూలు పిల్లలు రావడంతో ఎవరికివాళ్ళు వాళ్ళ ఇళ్ళకి తప్పుకున్నారు. నేను ఇంటికి వచ్చెసాను. పనిమనిషి "సోనాబాయి" వచ్చింది. గిన్నెలు కడగడానికివేసి మూడు గటల ముచ్చట్లలో ఒక్కవిషయం సరిగాలేదు, ఓ ప్రత్యేకతలేదు,అని ఆలోచిస్తూ తలనొప్పితో అలాగే చేతిలో పెన్నుతో టేబిల్ మీదకి ఒరిగాను.
ఏమయిందీ, సుమతీ! అంటూ అప్పుడే ఆఫీసునుండి వచ్చిన శ్రీవారి పిలుపుతో కళ్ళు తెరిచి కారణంచెప్పాను. అంతేనా, కధ వ్రాసి అలసటతో పడుకున్నావనుకున్నాను అన్నారు నిరుత్సాహంగా,
అమాయకంగా ఆయనకేసి చూస్తూ" అయినా అందరూ రచయిత్రులే అయిపోతే చదివెవాళ్ళు ఎవరుంటారు?
ఎంత చదివెవాళ్ళు లేకపోతే యిన్ని పుస్తకాలు ప్రింటు అవుతున్నాయి? అయినా ఒకే ఒక కధ వ్రాయమన్నాను అంతేకదా!కట్నాలా, కానుకలా , అన్నారు ఎంతోభాదగా,చాలా జాలి వేసింది."ఆలోచించి త్వరలొ రాస్తాలెండి"అన్నాను. ఆమాత్రానికే ఎంతో ఆనందంగా ఇన్నాళ్లకి ఆలోచించడం మొదలుపెట్టావా,ఇంక వ్రాసేయ్, ఒక్క కధ వ్రాసేవంటే ఆటోమేటిగ్గా ఆతరువాత అనేకం రాయగలవు అంటూ తన చేతుల్లోకి తీసుకున్నారు.
ఆమరునాడు ' సోనాబాయి" వచ్చినపుడు తనతో నీ జివితవిశేషాలు చెబుదూ? అన్నాను.
ఏముందమ్మా, అయ్య చూసినతన్ని పెళ్ళిచేసుకున్నాను, పిల్లల్ని కన్నాను, పొట్టకూటి కొసం పనులు చేస్తూన్నాను, ఇద్దరి సంపాదనతో ఇల్లు బాగానే గడచిపోతోంది--
ప్చ్త్! అదికాదే, మీఆయన కొట్టడం, తిట్టడం, తాగడం ఏమన్నా చేస్తాడా?
అది ఏమిటమ్మా? అల్సిన శరీరానికి హాయికోసం ఓచుక్క వేసుకుంటాడు కోపమొస్తే అరుస్తాడు,ప్రేమ వస్తేలాలిస్తాడు, అయినా ఏమిటమ్మా ఈ ప్రశ్నలు? జీవితమే యిదీ'--
నేను ఓ కధ వ్రాసుకోవాలి అందుకని అడిగానులే,
సరేలే అమ్మా, నేను ఇంకా పని చేసుకొవాలి అని చెప్పి వెళ్ళిపొయింది. నా ఆలోచనల్తో ఓఆరు వారాలు గడచిపోయాయి. ఏమీ ఇంప్రూవ్ మెంటు లేదు. ఓ రోజు" సుమతీబాభీ" నా కొడుకు వ్రాసిన కధ ఈ పుస్తకంలో పడిందట,చదవమంటూ " మరాఠి" పుస్తకం చేతిలో పెట్టింది, ఏమిటీ నీ కొడుకు కధలు రాస్తాడా అన్నాను ఆశ్చర్యంగా,
ఇదే మొదటి కధమ్మా! ఆరోజు నువ్వు అలా అడిగావని చెప్పాను, అప్పుడె వ్రాసి పంపాడట,--
అలాగే తరువాత చదువుతానులే ముందరతొందరగా పని చేసెయ్, మేము బయటకువెళ్ళాలి, నీ కొడుక్కి నా తరఫున కంగాచ్యులేషన్సు చెప్పు.
అసలు సంగతి ఏమిటంటే నాకు మరాఠి మాట్లాడ్డమేకాని, చదవడంరాదు,అంతేకాక నాలొ ఏదో తెలియని చిన్న అసూయ, అసహాయత అవతరించాయి.

    మాశ్రీవారికి సంగతి తెలిసినతరువాత నాతొ మాట్లాడ్దం మానేశారు.అయినా అంతగా నన్ను వ్రాయమని అనకపోతే తనే వ్రాయకూడదూ, ఓకధ వ్రాస్తే వచ్చే సంతోషమేమిటి?-- మా యిద్దరిమధ్యదూరం మరింత ఎక్కువయింది, సినిమాలు లేవు, షికార్లులేవు, పరాచికాలులేవు, పరుపులు వేరయ్యాయి,యాంత్రికంగా రోజులు గడుస్తున్నాయి ఎక్కువభాగం ఆఫీసులోనే గడుపుతున్నారు, శ్రీవారి లాలిత్యంలో గుర్తురాని అమ్మ నాన్నగార్ల మీద మనసు పోయింది"ఒకేఒక్కకధ" మాయిద్దరిమద్య అడ్డుగానిలచింది, పోని వాసేద్దామంటే ఏం వ్రాయాలో,ఒకవేళా నేను వ్రాసినా పబ్లిష్ చేసుకునేదెవరూ? పబ్లిష్ మాట దేముడెరుగు ముందర రాసేద్దాం, -- వివాహమయిన అరు నెలల్లొ ఆవిర్బవించిన ఈ అంతఃకలహం ప్రళయంగా మారురుతుందో, ప్రణయంగా మారుతుందో చెప్పలేను కాని కాయితాలు, పెన్ను తీసుకొని చాలా చాలా సీరియస్ గా వ్రాయడానికి ఉపక్రమించాను.

   ( మనలో మాట- ఇది గృహహింస చట్టంలోకి వస్తుందా చెప్పండి, ప్రోసీడ్ అయిపోతాను.కాలం ముందుకు జరిగినా పరిస్థితిలో ఏమీ మర్పు లేదు).., ,.

ఇలాంటివి తెలుసుకుంటే !!

మేము రాజమండ్రి నుండి వచ్చేటప్పుడు కొన్ని పుస్తకాలు తెచ్చుకొని మా గ్రంధాలయానికి మరింత అందాన్ని చేకూర్చాము. అందులో నాకు నచ్చినవి, తెలుసుకోదగినవి ,తమాషాగా వున్నవి,అప్పుడప్పుడు మీతో పంచుకుంటాను.

స్రీలతో ఏదయినా పని వుంటే ఆ పని స్త్రీ లే చేయగలరు.
స్త్రీ చెయ్యకూడని పనులు చెయ్యటం ప్రారంభిస్తే ఆపటం ఎవ్వరి తరము కాదు.
రక్షించుకోలేని వాడికి భార్య అనవసరం. దున్నటం చేతకాని వానికి పొలం అనవసరం.
స్త్రీకి లొంగిపోయిన పురుషుడు నదీ ప్రవాహంలో పడిన చెట్టు లా సుఖంగా జీవనం సాగిస్తాడు.
ఆడవారితో అవసరమైనపని వున్నా ఇంటికెళ్ళి కలవకూడదు.
కాముకునికి తన భార్య సుందరి అయినా, వేపచెట్టులా కనిపిస్తుంది. పక్కింటి వాడి భార్య అనాకారి అయినా రంభలా కనిపిస్తుంది.
స్త్రీ మగవాడి చూపుని బట్టే తనలొ అతనేం ఆశిస్తూన్నాడో తెలుసుకోగలదు
భర్త గొప్పదనమంతా భార్య వంటి మీద నగలూ, చీరలే చెబుతాయి.
పది లక్షలు పెట్టి భార్యకి బంగారం కొని పెట్టినా , ఆటో కిచ్చిన తన పది రూపాయలు భర్తనడిగి మరీ తీసుకొంటుంది.
స్త్రీ తప్పు చేసిదంటే రెండే కారణాలు. ఒకటి భర్త చేతకానితనం,రెండు అవసరం. ఏ స్త్రీ కూడా ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేయదు.
ప్రేమతో స్త్రీ శృంగారాన్ని అందిస్తే పురుషుడు ఆ స్త్రీ చుట్టూ తిరుగుతాడు.
తండ్రి భర్త కన్న ధనవంతుడయితే ఆ స్త్రీకి భర్త మీద ఒకింత పెత్తనం వుంటుంది
గృహం అంటే భార్యతో కూడుకున్నదికాని గోడలూ, భోజనశాల, శయనమందిరం కాదు.
భార్య తో ఏకాంత సమయములో ఏ వాగ్దానం చేసినా అది ఆపై చెయ్యకపోవటం దోషం కాదు.
స్త్రీకి పురుషుడే జీవితం. పురుషునికి జీవితంలో స్త్రీ ఓ భాగం మాత్రమే.
తల్లి గొప్పదా, భార్యగొప్పదా, అంటే ఇద్దరూ గొప్పవారే. కాకపోతే భార్యే ఒకింత గొప్పది.
స్త్రీ శృంగారానికి పనికిరాకపోతే ఒక్క స్త్రీ కూడా ఈ భూమ్మిద బ్రతికుండదు
స్త్రీ ఇంట్లో కొట్టినా భరిస్తుంది. నలుగురిలో తిడితే ఆడపులిలా విరుచుకుపడుతుంది.
భర్త భార్యని భద్రంగా, రక్షణగా మాత్రమే చూసుకుంటాడు. కాని భార్య భర్త గౌరవాన్నీ,సంతానాన్నీ, ధనాన్నీ, కాపాడుతుంది. సేవకురాలిగా, తల్లిగా, స్నేహితురాలిగా, మంత్రిగా, వీటన్నిటినిమించి ప్రేమగా, భక్తిగా చూసుకొటుంది
.

ఈ పుస్తకంలోనివి పాతవే అవ్వచ్చునుకాని , ప్రస్తుత కాలమాన పరిస్తితులలో అన్ని కాకపోయినా కొన్ని నిజమేకదా!

మంగళహారతి

మా బంగారు తల్లి నవ్య(మనవరాలు), వాళ్ళ అమ్మతో కలిసి పాడే మంగళహారతి. మా వారి బ్లాగ్గులో, ఎవరో కోరగా,ఈ పాట ఇక్కడ పెట్టాను.


మంగళహారతి-----రచయిత బ్రహ్ర్మశ్రీ బేతవోలు రామబ్రహ్మం.

శీతాద్రి శిఖారాన పగడాలు తాపించు
మా తల్లి లత్తుకకు నీరాజనం- కెంపైన నీరాజనం - భక్తి పెంపైన నీరాజనం.
యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి
బాగైన అందెలకు నీరాజనం- బంగారు నీరాజనం- భక్తి పొంగారు నీరాజనం.
నెలతాల్పుడెందాన వలపు వీణలు మీటు
మా తల్లి గాజులకు నీరాజనం- రాగాల నీరాజనం- భక్తి తాళాల నీరాజనం.
మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు
మా తల్లి నవ్వులకు నీరాజనం- ముత్యాల నీరాజనం- భక్తి నృత్యాల నీరాజనం.
చెక్కిళ్ళ కాంతితో క్రిక్కిరిసి అలరారు
మా తల్లి ముంగరకు నీరాజనం- రతనాల నీరాజనం- భక్తి జతనాల నీరాజనం.
పసిబిడ్డలను జేసి ప్రజనెల్ల పాలించు
మా తల్లి చూపులకు నీరాజనం- అనురాగ నీరాజనం- భక్తి కనరాగ నీరాజనం.
దహరాన కనిపించు ఇనబింబ మనిపించు
మా తల్లి కుంకుమకు నీరాజనం- నిండైన నీరాజనం- -భక్తి మెండైన నీరాజనం.
తేటిపిల్లల వొలె గాలి కల్లలనాడు
మా తల్లి కురులకు నీరాజనం - నీలాల నీరాజనం- భక్తి భావాల నీరాజనం.
జగదేకమోహిని, సర్వేశగేహిని
మా తల్లి రూపునకు నీరాజనం- నిలవెత్తు నీరాజనం- భక్తి నిలువెత్తి నీరాజనం.

నమశ్శివాయ కీర్తన--2

కీర్తన రెండవ టపా:

8.ఆది శక్తియే హరుని చెంతలో కొలువుదీరి ఇట నిలచే శివఓం నమశ్శివాయ
జ్ఞానప్రసూనాంబిక గాయీ క్షేత్రము నందే వెలిసే హరఓం నమశ్శివాయ
శిఖరం నమశ్శివాయ,శీఘ్రం నమశ్శివాయ
సంద్రం నమశ్శివాయ,కెరటం నమశ్శివాయ
కొలుచువారలకు దివ్యజ్ఞానమును ప్రసాదించు ఈ మాత శివఓం నమశ్శివాయ
కొంగుపసిడిగా ఆర్త జనులకు అభయమిచ్చు ఈ తల్లి హరఓం నమశ్శివాయ
ఉగ్రం నమశ్శివాయ, శాంతం నమశ్శివాయ
సులభం నమశ్శివాయ,మోక్షం నమశ్శివాయ-----------"న"
9. పుణ్యతీర్ధముల దివ్యధామమే శ్రీకాళహస్తి క్షేత్రం శివఓం నమశ్శివాయ
ఘోరపాపముల పరిహరించునీ వాయులింగేశ్వర నిలయం హరఓం నమశ్శివాయ
ఆత్మం నమశ్శివాయ, దీపం నమశ్శివాయ
మృదులం నమశ్శివాయ, మధురం నమశ్శివాయ---------"న"
దివ్యలింగముల పావన స్థలమీ దక్ష్క్షిణకైలాసనిలయం శివఓంనమశ్శివాయ
ప్రణవ మంత్రమే సర్వదిక్కుల ప్రతిధ్వనించే సదనం హరఓంనమశ్శివాయ
ఆది నమశ్శివాయ, అంతం నమశ్శివాయ
ఆణువు నమశ్శివాయ, సర్వం నమశ్శివాయ------------"న"
10.రాహుకేతువుల దివ్యనిలయమే దక్ష్క్షిణ కైలాసనిలయం శివఓంనమశ్శివాయ
రాహకేతువుల శాంతి పూజలే ఈస్థలమున సిద్ధించు హరఓంనమశ్శివాయ
నటనం నమశ్శివాయ, నాట్యం నమశ్శివాయ
లాస్యం నమశ్శివాయ, చలనం నమశ్శివాయ
సర్పదోషమును పరిహరించు నీ సాంబశివుడు శుభక్షేత్రం శివఓంనమశ్శివాయ
విశ్వవిఖ్యాతిపొందిన నిలయం వాయులింగేశ్వర నిలయం హరఓంనమశ్శివాయ
శిల్పం నమశ్శివాయ, ఉదకం నమశ్శివాయ
జ్వలనం నమశ్శివాయ,భస్మం నమశ్శివాయ-----------"న"
11.దక్ష్క్షిణకాశిగా ఆదిశక్తియే కొలువై ఇచట నిలచే శివఓంనమశ్శివాయ
పంచముఖేశ్వర దివ్యలింగము కొలువు వున్న శివసదనం హరఓంనమశ్శివాయ
గమనం నమశ్శివాయ, గమకం నమశ్శివాయ
వసుదం నమశ్శివాయ, మేఘం నమశ్శివాయ
కాలభైరవుడు కొలువుదీరిన దివ్యదామమీ క్షేత్రం శివఓం నమశ్శివాయ
బట్టలభైరవమూర్తిగా తానే ఇచట కొలువై వెలసే హరఓంనమశ్శివాయ
యజ్ఞం నమశ్శివాయ, హోమం నమశ్శివాయ
సోహం నమశ్శివాయ, ధామం నమశ్శివాయ
12. దక్ష్క్షిణామూర్తి కొలువుతీరిన పావనమయ శివక్షేత్రం శివఓం నమశ్శివాయ
భరద్వాజ ఋషి ప్రతిష్టించిన ఈశ్వరలింగ నిలయం హరఓం నమశ్శివాయ
సిద్ధం నమశ్శివాయ, జ్ఞానం నమశ్శివాయ
కమలం నమశ్శివాయ, విమలం నమశ్శివాయ
వేయిలింగముల రూపము తానే పరమశివుడు ఇట నిలచే శివఓం నమశ్శివాయ
ఏ దిశగాంచిన శివుని తేజమే గోచరించు ఈ స్థలిలోహరఓం నమశ్శివాయ
భక్తి నమశ్శివాయ, శక్తి నమశ్శివాయ
యుక్తి నమశ్శివాయ, మర్మం నమశ్శివాయ-------------"న"
13.ధూర్జటికవితా సుమములు కొలచిన వాయులింగేశ్వరనిలయం శివఓం నమశ్శివాయ
వాయులింగేశ్వర పదములు కొలచిన కైవల్యము సిద్ధించు హరఓం నమశ్శివాయ
సిద్ధిం నమశ్శివాయ, బుద్దిం నమశ్శివాయ
దేవం నమశ్శివాయ, దేహం నమశ్శివాయ
శివశివ శంభొ చంద్ర కళాధర సాంబ దిగంబర ఈశా శివఓం నమశ్శివాయ
హరహరశంభొ జంగమ దేవర వాయులింగేశ్వర ఈశా హరఓం నమశ్శివాయ
యోగం నమశ్శివాయ, బ్రహ్మం నమశ్శివాయ
రూపం నమశ్శివాయ,వర్ణం నమశ్శివాయ-------------"న"

నమశ్శివాయ కీర్తన

    వనభోజనంలో భోజనాలు అయిన తరువాత ఆట పాట తప్పకుండా వుండాల్సిందే కదా మరి, ఆటలు మీ యిష్టం. కాని పాటల్లో యిది ఒకసారి గుర్తు చేసుకుందాము. ఈ రోజు కార్తికపౌర్ణమి, సోమవారం, (గురునానక్ జయంతి) పంచాక్షరిమంత్రము ఒకసారి పలికితెనే ఎంతో పుణ్యమంటారు.మరి ఈ కీర్తన తరువాత చూసుకోండి మరి---

పంచాక్షరి మహామంత్రము: నమశ్శివాయ

నమశ్శివాయ నమశ్శివాయ ఓం నమశ్శివాయ
నమశ్శివాయ నమశ్శివాయ ఓం నమశ్శివాయ
1. శివశంకరుడే కొలువై నిలచిన పుణ్యస్థలమీ క్షేత్రం శివ ఓం నమశ్శివాయ
జగదీశ్వరుడే వాయులింగమై వెలసిన ఈశ్వరక్షేత్రం హర ఓం నమశ్శివాయ
శివవోం నమశ్శివాయ హరఓం నమశ్శివాయ
హరవోం నమశ్శివాయ శివవోం నమశ్శివాయ-----------"న"
2. క్షేత్ర పాలకుడు గణపతి నిలచే పాతాళ విఘ్నేశ్వరుడై శివవోం నమశ్శివాయ
గౌరి శంకరుల సేవచేయుచు పాతాళ గృహమున నిలచె హరఓం నమశ్శివాయ
నాదం నమశ్శివాయ, రాగం నమశ్శివాయ
తాళం నమశ్శివాయ, గానం నమశ్శివాయ------------"న"
వశిష్ట మహర్షి తపము చేయగా సాంబశివుడు అరుదెంచె శివఓం నమశ్శివాయ
బ్రహ్మ విద్యనే బోధన చేసి వాయులింగమై నిలచే హరఓం నమశ్శివాయ
పఠనం నమశ్శివాయ,స్మరణం నమశ్శివాయ
ధ్యానం నమశ్శివాయ,మంత్రం నమశ్శివాయ-----------"న"
3. అగస్యమహర్షి తపసు చేయుచు పరమశివుని మెప్పించే శివఓం నమశ్శివాయ
శివుని కరుణతో ఆకాశగంగ సువర్ణముఖిగా నిలచే హరఓం నమశ్శివాయ
అఖిలం నమశ్శివాయ, నిఖిలం నమశ్శివాయ
భువనం నమశ్శివాయ, సకలం నమశ్శివాయ---------"న"
బంగారు వన్నెతో గంగాదేవి శివుని చెంతనే నిలచే శివఓం నమశ్శివాయ
పరమపావనం పుణ్యదాయకం సువర్ణముఖి నదిస్నానం హరఓం నమశ్శివాయ
క్షేత్రం నమశ్శివాయ, తీర్ధం నమశ్శివాయ
శబ్దం నమశ్శివాయ, శ్రావ్యం నమశ్శివాయ-----------"న"
4. సృష్టికర్తయే వాణితో గూడి ఇచట శివుని పూజించే శివఓం నమశ్శివాయ
శివుని కరుణతో బ్రహ్మదంపతులు సంతాన భాగ్యం పొందే హరఓం నమశ్శివాయ
అర్ధం నమశ్శివాయ, దానం నమశ్శివాయ
మూలం నమశ్సివాయ, మధురం నమశ్శివాయ
పంచభూతముల రూపము తానై పరమశివుడు ఇల వెలిసే శివఓం నమశ్శివాయ
వాయులింగమై సర్వేశ్వరుడై శ్రీకాళహస్తిలో వెలిసే హరఓం నమశ్శివాయ
ప్రణవం నమశ్శివాయ,ప్రమదం నమశ్శివాయ
ప్రళయం నమశ్శివాయ,నిలయం నమశ్శివాయ---------"న"
5. మూగజీవులే పరమభక్తి తో సాంబశివుని పూజించే శివఓం నమశ్శివాయ
సంతసించగా గౌరినాధుడె ముక్తినిచ్చే ఈ స్ఠలిలో హరఓం నమశ్శివాయ
స్తోత్రం నమశ్శివాయ, శాస్త్రం నమశ్శివాయ
గీతం నమశ్శివాయ, కావ్యం నమశ్శివాయా
నాటినుంచి ఈ శైవ క్షేత్రము శ్రీకాళహస్తిగ మారే శివఓం నమశ్శివాయ
శివుని కరుణతో అల్పజీవులే శివుని సన్నిధిని పొందె హరఓం నమశ్శివాయ
సుఫలం నమశ్శివాయ, సుగంధం నమశ్శివాయ
సుజలం నమశ్శివాయా, తానం నమశ్శివాయ--------"న"
6. ద్వాపరందున నాటి పార్ధుడే తిన్నడుగా జన్మించే శివఓం నమశ్శివాయ
అమిత భక్తితో అంబికేశుని ఆశమీర సేవించే హరఓం నమశ్శివాయ
పవనం నమశ్శివాయ,పృధ్వీనమశ్శివాయ
కిరణం నమశ్సివాయ,తేజం నమశ్శివాయ
శివుని లీలలో మూఢభక్తుడై తన నేత్రములే అర్పించే శివఓం నమశ్సివాయ
మూఢభక్తికి సంతసించగా శివుడు కరుణ కురిపించే హరఓం నమశ్శివాయ
ధర్మం నమశ్శివయా, సత్యం నమశ్శివాయ
సకలం నమశ్శివాయ,నిత్యం నమశ్శివాయ
7. నాటినుంచి ఆ శైవ భక్తుడే కన్నప్ప పేరుతో నిలచే శివఓం నమశ్శివాయ
హరుని కరుణతో ఈ స్థలమందే ముక్తిపొంది తరియించే హరఓం నమశ్శివాయ
పరమం నమశ్శివాయ, పురుషం నమశ్శివాయ
గమకం నమశ్శివాయ,చమకం నమశ్శివాయ
ప్రమధ గణములు సకల సురులకుఇచట కొలువై నిలచే శివఓం నమశ్శివాయ
శివతేజముతో నిబిడికృతమై పులకించే శివక్షేత్రం హరఓం నమశ్సివాయ
దీపం నమశ్శివాయ,ధూపం నమశ్శివాయ
ఆర్ఘ్యం నమశ్శివాయ, పాద్యం నమశ్శివాయ--------"న"

(మిగిలినది తరువాతి టపా లో )

బ్లాగ్వనంలో వన భోజనాలు--జున్ను కాని జున్ను




    ఈ ఫొటొ చూసి ఐసుక్రీమ్ అనుకొంటున్నారా? కాదండీ, జున్ను అంటారా, ఉహూ! జున్ను కాని జున్ను.రుచి చూడండి, చెప్పండి, మరి, ఆలస్యమెందుకు? చలో,

పెరుగు : 1 కప్పు
పాలు : 1 కప్పు
కండెన్సుడు పాలు : 1 టిన్ను( 400 గ్రా)
బాదాం : 8(వేడి నీళ్ళలో ఓ 4నిమిషాలు నానబెట్టి తొక్కతీసి సన్నగా పొడవుగా ముక్కలుగా చేసుకోవాలి)
పిస్తా : 8 గింజలు
కిస్మిస్ :8
కావాలంటె జీడిపప్పు: 6

1. పెరుగు, పాలు, కండెన్సుడుపాలు, బాగా( బ్లెండరుతొ) కలిపి జీడిపప్పు, బాదాం ముక్కలు, పిస్తా, కిస్మిస్ వీసి కలపాలి.
2.ఒక లీటరు పాలు పట్టెగిన్నెలొ వేసి పైన మూత పెట్టాలి.
3. కుక్కరులో నీళ్ళుపోసి ఈ గిన్నె అందులో పెట్టాలి.
4. స్టౌ మీద పెట్టి 3కూతలు రానిచ్చి మంట తగ్గించి ఓ 4నిమిషాలు వుంచి స్టౌ కట్టేసి కుక్కరుని చల్లారనివ్వాలి.
5: వేడి చల్లారిన తరువాత ఫ్రిజ్ లో పెట్టుకొని ముక్కలుగా చేసుకోవాలి.
వనభోజనాల ఘనభోజనంలో తియ్యగా బావుంది కదూ!
పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes