మేము రాజమండ్రి నుండి వచ్చేటప్పుడు కొన్ని పుస్తకాలు తెచ్చుకొని మా గ్రంధాలయానికి మరింత అందాన్ని చేకూర్చాము. అందులో నాకు నచ్చినవి, తెలుసుకోదగినవి ,తమాషాగా వున్నవి,అప్పుడప్పుడు మీతో పంచుకుంటాను.
స్రీలతో ఏదయినా పని వుంటే ఆ పని స్త్రీ లే చేయగలరు.
స్త్రీ చెయ్యకూడని పనులు చెయ్యటం ప్రారంభిస్తే ఆపటం ఎవ్వరి తరము కాదు.
రక్షించుకోలేని వాడికి భార్య అనవసరం. దున్నటం చేతకాని వానికి పొలం అనవసరం.
స్త్రీకి లొంగిపోయిన పురుషుడు నదీ ప్రవాహంలో పడిన చెట్టు లా సుఖంగా జీవనం సాగిస్తాడు.
ఆడవారితో అవసరమైనపని వున్నా ఇంటికెళ్ళి కలవకూడదు.
కాముకునికి తన భార్య సుందరి అయినా, వేపచెట్టులా కనిపిస్తుంది. పక్కింటి వాడి భార్య అనాకారి అయినా రంభలా కనిపిస్తుంది.
స్త్రీ మగవాడి చూపుని బట్టే తనలొ అతనేం ఆశిస్తూన్నాడో తెలుసుకోగలదు
భర్త గొప్పదనమంతా భార్య వంటి మీద నగలూ, చీరలే చెబుతాయి.
పది లక్షలు పెట్టి భార్యకి బంగారం కొని పెట్టినా , ఆటో కిచ్చిన తన పది రూపాయలు భర్తనడిగి మరీ తీసుకొంటుంది.
స్త్రీ తప్పు చేసిదంటే రెండే కారణాలు. ఒకటి భర్త చేతకానితనం,రెండు అవసరం. ఏ స్త్రీ కూడా ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేయదు.
ప్రేమతో స్త్రీ శృంగారాన్ని అందిస్తే పురుషుడు ఆ స్త్రీ చుట్టూ తిరుగుతాడు.
తండ్రి భర్త కన్న ధనవంతుడయితే ఆ స్త్రీకి భర్త మీద ఒకింత పెత్తనం వుంటుంది
గృహం అంటే భార్యతో కూడుకున్నదికాని గోడలూ, భోజనశాల, శయనమందిరం కాదు.
భార్య తో ఏకాంత సమయములో ఏ వాగ్దానం చేసినా అది ఆపై చెయ్యకపోవటం దోషం కాదు.
స్త్రీకి పురుషుడే జీవితం. పురుషునికి జీవితంలో స్త్రీ ఓ భాగం మాత్రమే.
తల్లి గొప్పదా, భార్యగొప్పదా, అంటే ఇద్దరూ గొప్పవారే. కాకపోతే భార్యే ఒకింత గొప్పది.
స్త్రీ శృంగారానికి పనికిరాకపోతే ఒక్క స్త్రీ కూడా ఈ భూమ్మిద బ్రతికుండదు
స్త్రీ ఇంట్లో కొట్టినా భరిస్తుంది. నలుగురిలో తిడితే ఆడపులిలా విరుచుకుపడుతుంది.
భర్త భార్యని భద్రంగా, రక్షణగా మాత్రమే చూసుకుంటాడు. కాని భార్య భర్త గౌరవాన్నీ,సంతానాన్నీ, ధనాన్నీ, కాపాడుతుంది. సేవకురాలిగా, తల్లిగా, స్నేహితురాలిగా, మంత్రిగా, వీటన్నిటినిమించి ప్రేమగా, భక్తిగా చూసుకొటుంది.
ఈ పుస్తకంలోనివి పాతవే అవ్వచ్చునుకాని , ప్రస్తుత కాలమాన పరిస్తితులలో అన్ని కాకపోయినా కొన్ని నిజమేకదా!
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి