RSS

నా అల్లికల ప్రస్థానం
    బాల్కనీ లో నిలబడి, చక చకా చేతులు ముందుకూ, వెనక్కూ తిప్పుతూ స్వెట్టర్లు అల్లుతున్న ఉత్తర భారతీయ స్నేహితుల్ని చూసి, చీపురు పుల్లలతో,పురుకొస తో, అల్లిక విధానం పుస్తకాలతో మొదలయిన నా ' అల్లిక ప్రస్థానం' నిరాటంకంగా 15 సంవత్సరాలు బాగా నడిచింది.


    చిన్న చిన్న స్కార్ఫ్( చెవులకి కట్టుకునేవి) తో మొదలయి ఎన్నెన్నో స్వెట్టర్లూ, ఫ్రాకులూ, షర్టులూ, బ్లౌజులూ అన్నీ పూర్తి అయి ఓ పెద్ద షాల్ తో ఇంచుమించు ముగిసింది.
రోజూ, 'ఈవేళ మేడం, ఏ రంగుది, ఏ డిజైన్ లో వేసేరా' అని పరీక్షగా చూసేవారుట ! నా డిజైన్లకి అంత ప్రాచుర్యం వస్తోందంటే వినడానికి బాగానే ఉండేది కానీ, మరీ ఆడ పిల్లలు ఈయనని చూసేరంటే వినడానికి బాగుండేది కాదు! ఆఫీసులో ఆడ పిల్లలు చూస్తారని కాబోలు, ఈయన ప్రతీ రోజూ మర్చిపోకుండా నేను అల్లిన కొత్త స్వెట్టరు వేసుకుని వెళ్ళేవారు!

    అప్పుడు రోజుకు రెండు రకాల స్వెట్టర్లూ--ఒకటి ఏ పుట్టిన రోజుకో సర్ప్రైజ్ గా ఇచ్చేది ఒకటీ,( ఆయన ఆఫీసు కి వెళ్ళిన సమయంలో అల్లేది), ఇంకోటి పిల్లల ఎదురుగానూ, ఆయన ఎదురుగానూ అల్లేది. అన్నేసి స్వెట్టర్లు ఎలా అల్లేనో ఇప్పుడు ఆలోచిస్తే అర్ధం అవదు. అంత పిచ్చిగా అల్లేసే దాన్ని.అదొక 'అబ్సెషన్' లా ఉండేది.
వరంగాం లో ఉన్నప్పుడు వారానికి రెండు సార్లు మార్కెట్ ఉండేది. ఎవడైనా కొత్త డిజైన్ వేసికుని మార్కెట్ కి వచ్చేడంటే చాలు, నేనూ, నా స్నేహితురాలూ, ఆ స్వెట్టర్ చుట్టూరా, అతనికి తెలియకుండా తిరగడం ( ప్రదక్షిణం లాగ!). ఆ డిజైన్ చూసి, ఇంటికి వెళ్ళి తయారు చేసికోవడం !!

    ఇవే కాకుండా, పాపం మా శ్రీవారి గురించి కూడా చెప్పుకోవాలి- ఇంగ్లీషు లో వచ్చే ' చిక్ ' మాస పత్రిక తెప్పించేవారు, నా ఆసక్తి చూసి. అలాగే హిందీ పత్రికలు కూడాను. ఎప్పుడైనా కొల్తలు కావాలంటే ,మా శ్రీవారినీ, పిల్లల్నీ నుంచోపెట్టి కొలుచుకునే దానిని! వాళ్ళందరికీ అసలు 'ఈస్తటిక్ సెన్స్' ఉండేది కాదు. ఏదో కొత్త డిజైన్ వేసి, ఎలా ఉందీ అని అడిగితే, ఏదో సమాధానం చెప్పొచ్చు కదా, ' ఏం అర్ధం అవడం లేదూ' అనేవారు. స్వెట్టరు తయారయిన తరువాత మాత్రం, ప్రతీ రోజూ మార్చడానికి మాత్రం రెడీ !!

   ఈ రోజుల్లో స్వెట్టర్లు ఎవరు వేసికొంటున్నారూ, అందరూ జెర్కిన్లూ, జాకెట్లూనూ. ఊలుతో అల్లిన స్వెట్టర్లు ' అవుట్ ఆఫ్ ఫేషన్' అయిపోయాయి.ప్రస్తుతం నేను అల్లిన స్వెట్టర్లు అన్నీ' కలరా ఉండలు' వేసి సూట్ కేసుల్లో క్షేమంగా విశ్రాంతి తీసికుంటున్నాయి. అయినా సరే శీతా కాలం వచ్చిందంటే, వాటన్నింటినీ ఒకసారి బయటకు తీసి పలకరిస్తూంటాను !మళ్ళీ నానమ్మయ్యానోచ్!

  హాయ్ హాయ్ నేను మళ్ళి నాన్నమ్మ ని అయ్యానోచ్చి! ఈసారి మనుమడుకి, మాబంగారుతల్లి నవ్య అక్క అయింది. మనుమరాలు ( మూడున్నర సంవత్సరాలు) అచ్చంగా ఇల్లేరమ్మేను,అందరికి స్కూల్లోను బస్ లోను ఆటోవాళ్ళకి , షాపులొ వాళ్ళకి ఇరుగుపొరుగు తెలిసినవాళ్ళందరికి మా యింట్లొ బేబి వస్తోంది జననరిలో అక్కని అయిపోతానని చెప్పి టాం టాం.తమ్ముడుని చూసి ఓ మురిసిపోతోంది.ఎంత సంబరమొను, నిజానికి నాకు అలాగే వుంది. అందుకే మీ అందరితో నా సంతోషాన్ని పంచుకుంటున్నాను. మాల గారు రాసినట్లుగా నాకు నవరత్న మాల వఛ్ఛెసిందండి.అమ్మాయి, అల్లుడు వాళ్ళపిల్లలు , చి. తాన్య. (అమ్మాయి) చి. ఆదిత్య(అబ్బాయి) అబ్బాయి, కోడలు వాళ్ళ పిల్లలు నవ్య(అమ్మాయి) తమ్ముడు. (నిన్నే పుట్టిన బాబు), మా శ్రీవారు. ఇంత చక్కని అనందాన్నిచ్చిన తల్లి లలితా దేవికి నమొ నమహ!

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes