బ్లాగ్ మిత్రులకు నేను కూడా మీతో కలవాలని వచ్చెస్తున్నానండోయ్. అసలు ఏమయిందంటే సొమవారము సప్తగిరి లొ ఈ-తెలుగు చూసినతరువాత నాకు ఏదొ రాయాలని ,బాగా అనిపించేస్తోంది మరి. ఎందుకంటె ఇంతమంచి వేదిక వుండగా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు దూరముగా వున్నవారు ఒక్క తండ్రితో తప్పితే తెలుగు మాత్రమే వచ్చిన తల్లితొ కమ్యూనికేషను పెట్టుకొవడము లేదు ఎందుకంటారు? ఎందుకంటే నా స్నేహితులుపిల్లలు విదేశాలలొవున్నారు.వాళ్లు తండ్రితొ చాట్ చేస్తారు మెయుల్ పంపుతారు. తల్లిని అడుగుతారు,ఈ తల్లి ఎదో చెపుతుంది రాయమని ఆ తండ్రి ఇంగ్లీష్ లొ రాస్తాడు. అందవలసిన విషయము అందుతుంది కాని ఆవిడకు అనుమానమేను. ఈయన సరిగ్గా రాసారొ లేదో లేక పిల్లలు రాసినది ఈయన చెప్పారొ లేదో అని.
మళ్ళి ఇందులొ కూడా ఒక తంటా వుందండి.ఆంధ్రాలొ చదివినవారికి కొంత తెలుగు వస్తుంది కాని పరాయి రాష్ట్రములొ వున్నపిల్లలకు తెలుగు రాదండి,మాట్లాడుతారు,కాని చదవడము రాయడము రాదు.వారికి ఇది బాగా ఉపయొగిస్తుందికదండి . ఇంటిలొ కంప్యూటరు వుండి దాన్ని శుబ్రము మాత్రమే చేసే తల్లి కూడాఈ -తెలుగు వేదిక ద్వారా తన పిల్లలతొ చక్కగా మనసారా సంబాషించుకొవచ్చుకదండీ, ఇలాగే నా మనస్సులొ ఏవో ఆలొచనలు మీతొ పంచుకోవాలని నా ఆశ. ఏమంటారు?
14 కామెంట్లు:
స్వాగతం లక్ష్మిగారు,,
లక్ష్మి గారు మీ కబుర్లు వినడానికి నేను రెడీగా ఉన్నాను ఇక్కడ మరి..మొదలు పెట్టండి :)
మీ కొత్త బ్లాగు సందర్భంగా శుభాకాంక్షలు :)
susvaagatam
స్వాగతం లక్ష్మిగారు,
మీ కొత్త బ్లాగు సందర్భంగా శుభాకాంక్షలు.
lakshmigaaru welcome to e-telugu, mee aalochanalu naaku maataram chaala nachchindandi. nenu mee blog chadavataaniki veyyi kanula to eduruchustunnaanandi.
talli, tandrula to dooranga undi, blogu dvaara
manasulu daggaravutundi ani aashistuu.
ganesh
లక్ష్మి గారు స్వాగతం మీకు ఇక్కడ మీ ఆలోచనలను మీ ఆబిరుచులను అందరితో పంచుకోవచ్చు మరెన్నో కొత్త విషయాలను విజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు మీ కొత్త బ్లాగు సందర్భంగా శుభాకాంక్షలు....శ్రీ
ముందుగా బ్లాగు ప్రారంభించినందుకు అభినందనలు.
రెండోది, మీరు చెప్పింది నిజం. పాతకాలంలో స్త్రీలు అక్షరాస్యులవాలి, విద్యావంతులవాలి అని ఉద్యమించినట్టు ఇప్పుడు కంప్యూటర్ వాడాకం తెలుసుకోవాలని ఉద్యమించాలి. మాట్లాడ్న ప్రతిసారీ మా అత్తగారితో మొత్తుకుంటూ ఉంటా!
మూడోది .. పతి పరమేశ్వరుడైతే ఇల్లు వైకుంఠ మెలాగవుద్దండీ .. ఏదో తేడాగా ఉంది :)
"పరాయి రాష్ట్రములొ వున్నపిల్లలకు తెలుగు రాదండి,మాట్లాడుతారు,కాని చదవడము రాయడము రాదు." - ఈ సమస్య పరిష్కారానికి నిఖిలె వాడండి. మీరు రాసిన తెలుగును ఆంగ్ల అక్షరాలలోకి నిఖిలె ద్వారా మార్చవచ్చు. http://lekhini.org/nikhile.html
జ్యొతి,నేస్తం,గొపాల్ కొడూరి,దుర్గేశ్వర్,అమ్మఒడి లకు ధన్యవాదములు.
నా ఊహలు గారికి
మీరు చెప్పింది నిజమె. అలాగే అవాలని ఆసిద్దాము.
శ్రీ గారికి ధన్యవాదాలు.
కొత్తపాళి గారికి
అదే నా ప్రయత్నమండి. ఏక్ దమ్ సీదా సాదా మనిషండి.భేషజాలు లేవు. ఇంక ఇల్లు అంటారా అడగకుండానే అవసరమయినవి అన్నిపెడుతుంటె వైకుంఠమే కదండీ.
cbrao గారికి అవునండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి