ఇల్లు చూస్తే వైకుంఠమే అన్ని అమర్చిపెట్టాడు."బాబా.ఇప్పుడు ఇంటికి లక్ష్మి ని తెచ్చాడు. ఏం పేరు అమ్మా? అని అడిగినావిడ వైపు చూస్తూవుండిపోయాను. ఏమీ అర్దమ్ కాక, ఆవిడ అడిగినది మరాఠి భాషలొ. ఇంతలొ ఈయన వచ్చి నీ పేరు చెప్పు. అని ఈవిడ ,పాలు తెస్తారు. పేరు గంగమ్మ. అంటే పాలు కూడా అలాగేవుంటాయి. నవ్వుతూ ఇంత పెద్ద బొట్టు తొ తొమ్మిది గజాల చీరతొ కలకలాడుతూ వున్నారావిడ. నా పేరు లక్ష్మి అని. ఆవిడ పేరు విని ఇల్లు వైకుంఠము ,పేరు లక్ష్మి. అచ్ఛా హై" అంటూ వెళ్లిపొయింది.ఆ తరువాత తెలిసింది ఆవిడ ఒక చిన్న భూస్వామిని బాగా చెరకు తోటలు అవి వున్నాయనీను,పాలు మాత్రం నీళ్ళలా పొస్తుందనీను కాని చాలా అప్యాయంగా పొద్దునే వచ్చి నిద్ర లేపి బాబా అని పాలు పోసి వెడుతుందనీను ఆవిడకు గంగమ్మపేరు ఈయన పెట్టారనీను. పూనాలొ మేము వున్నచొట ఓ పది తెలుగు కుటుంబాలు వుండేవి. మా పెళ్లి నాటికి ఆరు సంవత్సరాలు ముందరే అన్ని అధునాతన వస్తువులు కొనిపెట్టేసారట. గ్యాసు సిలిండరు డిపాజిట్టు 70 రూ" హకిన్సు కుక్కరు75రూ" రికో మిక్సి 100రూ" లోపులొనట.అవి అప్పుడే మార్కెట్ లో కి వచ్చాయట. ఇవే కాక రికార్డు ప్లేయరు,యు ఫొమ్ పరుపు , టేబుల్ ఫాను,రెండు గదుల యిల్లు తన పేరు మీదే అద్దెకి. ఇల్లు దొరకడమంటే చాలా కష్టమట.అప్పట్లొ. ఏవొ పగిడిలు అవి వుండేవట. అంతే కాకుండ విడిగా ఇంట్లొ నీళ్ల పంపు.తెలుగు పుస్తకాలు, కారమ్స్ బోర్డు, ఇన్స్టంటు కాఫీ పౌడరు ( నెస్కాఫే) ఇవి అన్ని వుంటే ఆ యిల్లు స్వర్గమా వైకుంఠమా చెప్పండి మరి.
(అప్పటి జీతము ఎంతనుకున్నారు? కేవలమ్ 400రూ" కొత్త ఐటమ్స్ కొనాలన్న కోరిక, అభిరుచి అంతే)
మిగిలిన తెలుగు వారు అప్పటికే పెళ్ళి అయి ఓ పిల్ల పాపలతొ వున్నవారేను, కాని ఇంకా వాళ్ల యిళ్లలొ యివి ప్రవేశించలేదు. భార్యలు పురిటికి వెళ్లిన బర్తలకు ,ఇంటికి ఎవరయిన చుట్టాలు వచ్చినా ఈయనగారి ఇల్లు ఓ రిక్రియేషను హాలు. కారమ్స్ ఆడుకొందుకు,పసి పిల్లలు ఇంట్లొ వుంటె యడపిల్లలకి అడుకునే గ్రౌండు,సాహితి ప్రియులకు పుస్తకాలు,సంగీత ప్రియులకు బోలెడన్ని రికార్డులు,అవీ మాములువా చక్కటి కర్నాటక సంగీతము ( ఎమ్.ఎస్ సుబ్బలక్ష్మి, చిట్టిబాబు, లాల్గుడి జయరామన్ ఇంకా యిలాంటి మహనీయుల వారివి) చక్కని కాఫీ కి గంగమ్మగారి పాలు.ఒక్క మనిషి కి లీటరున్నరపాలు రోజూను. ఇంక ఎవరి ఇంట్లొ ఏ సరుకు నిండుకున్నాసరే ఈయన గారి ఇంట్లొంచి నడచి వెళ్లిపోయేవట. ఇలా అందరికి అన్ని యిచ్చెవారు. కాని వెనక్కి మాత్రం వచ్చెవి కావట.అలా అందరికి మంచి మిత్రుడి గా వుండేవారట. ఇదీ అందరికి తెలిసిన సత్యం.నేను పెళ్లయి వచ్చిన తరువాత ఓ పది పదిహేను రోజులయినా సామాను తెచ్చియివ్వలేదు. నేను వచ్చేముందు మా అమ్మమ్మగారు(మా అత్తగారు)ఒక లిస్టు రాసి యిచ్చి ఓ పది రోజులు చూసి అడిగి తెచ్చుకో, వాడితొ పెట్తుకోకు, పిల్లాడు తింటాడుకదా అని ఊరగాయలు ,పొడిలు, పచ్చళ్ళు యిస్తే అన్ని ఊళ్ళోవాళ్లకి సారె పంచేస్తాడు అని ఛెప్పనే చెప్పారు. నేను వెళ్లి అడిగినందుకు కొన్ని యిచ్చారు,కొన్ని యివ్వలేదు కొన్ని ఎక్కడ వున్నాయొ కూడా తెలియలేదు. ఎప్పుడయిన సినిమా కి వెడితె నువ్వు తెచ్చేవయ్బా టిక్కెట్లు అనెవారు. కాని ఎప్పుడు డబ్బులు యివ్వగా చూడలేదు.నా కనిపించేది ఈయన మంచితనాన్ని చేతకానితనంగా చూస్తున్నారా? నా సందేహాన్ని అయనకు చెబితే అలాంటిది ఏమీ కాదు అంతా నీ భ్రమ. కొన్ని రోజుల తరువాత మెల్లిగా శక్తికి మించి ఏ సహాయము చేయకూడదు. అపాత్రదానము చేయకూడదు అంతే కాదు మీరంటే నేనె, నేనంటె మీరేకదా ఏమి లేకపోతే ఎందుకు చెబుతాను అసలు మనం ఎలా వుండాలి ,మీకు దెబ్బ తగిలితే నీళ్ళు నా కంట రావాలి.నాకు ముల్లు గుచ్చుకుంటే నొప్పి మీకు కలగాలి. ఆ తరువాత కొన్ని రోజులకు నిజంగా మా వారు పరమేశ్వర్ అయిపోయారు. ఇదండి సంగతి. ఇంత కధ వుంది పతే పరమేశ్వర్ ఇల్లె వైకుంఠంలొ.
5 కామెంట్లు:
ఎలక్షన్లరోజే పూణేనుంచి వచ్చాము.మళ్ళీ మీ టపాతో పూణేని గుర్తుకుతెచ్చారు.
http://www.google.com/transliterate/indic/Telugu
ఇందులో తెలుగు టైపింగ్ లేఖిని కంటే చాలా సులభం ! ప్రయత్నించండి !
chaalaachakkagaa malachukunnaarammaa patini .peddavaaru mee anubhavam kottataraaniki maargadarshanam avutumdi marinni vishayaaliu vraayamdi
విజయ మోహను గారికి ,శ్రీ గారికి ధన్యవాదలండి.
దుర్గేశ్వర గారికి , అవునండి. అప్పుడే తెలుసుకున్నాను. ఏ సమస్య కయినా సమాధానము వుంటుంది. కాని సమస్య సాంధ్రతను బట్టి కొంచం సమయము తీసుకోవచ్చనీను---
కామెంట్‌ను పోస్ట్ చేయండి