"ఆకాశమంతా" సినిమా చూసివచ్చామండి. పిల్లా పాపలతొ కలసి చూడచ్చు. ఎప్పుడొ గీతాంజలి చూసాను ఆ తరువాత ఇదే (ఆంధ్రా లో)
' నాతొ కాకుండా నీతొ చెప్పిందా ' అని ప్రకాష్ రాజ్ అడిగితే కొన్ని విషయాలు తల్లి తోనె చెబుతారు. అని భార్య జవాబు. నా కనిపించింది. ఇది లోక సహజము. మా ఇంట్లో మాత్రం ఉల్టా. మా పిల్లలిద్దరూ కూడా ముందు వాళ్ల డాడీ కే చెప్పారు. ఆ తరువాతే నాకు. అలాగే వాళ్లు కోరుకున్నట్లు గానే చేసాము. మన పెద్దవాళ్లకు మన పిల్లల మీద నమ్మకము వుండాలి. చిన్నతనంనించి వాళ్లకి మనమీద ఓ నమ్మకము , చనువు ,దగ్గరతనము,చక్కని స్నేహ బంధము ఏర్పరచుకుంటే , వాళ్ళకున్న చిన్న చిన్న అనుమాలనుండి పెద్ద పెద్ద వ్యవహారాలు కూడా మనతొ మాట్లాడి చర్చించి పరిష్కారాలు చూసుకుంటారు. కానీ ఈ మమతల వారధి ఒక్క రోజు లొ తయారవదు. పుట్టినప్పటి నుండి ఉగ్గుపాలతొ ప్రేమ మమకారం, ఆత్మనిబ్బరం ,ఆత్మస్థయిర్యం స్నేహం, వీటితొ ఆ వారధి నిర్మించుకొవాలి. అలాటి వారధికి నాలాటి లేడి హిట్లర్ పిల్లరు గా వుండాలి. ఆయన చాలా మంచి డాడి. ఆమ్మే కొంచం---(ఇద్దరి లొ ఒకరు స్ట్రిక్టు గా వుండాలి. క్రమశిక్షణ,పట్టుదల నేర్పాలి తప్పదు)
భగవంతుని దయవలన పిల్లలిద్దరూ ట్యూషన్సు,లేకుండా ఇంజనీరింగు డిస్టింక్షన్ లో వచ్చారు. వాళ్ళ గమ్యం వాళ్ళు ముందరే నిర్ణయించుకొని మంచి ఉద్యోగాల్లో చేరి,జీవిత భాగస్వాములని వాళ్ళు కొరుకున్నట్లుగా , మా ఇరుపక్షాల వారి ఆమోదంతొ వివాహము చేసుకున్నారు. మాకు మనవడు, మనవరాలు(అమ్మాయి పిల్లలు) అల్లుడంటే మా పిల్లలకంటే ఎక్కువ మాకు. మా అబ్బాయి కి ఓ పాప. ( రెండు సం'లు) అందరూ తెలుగు లోనే నొరార తాతయ్యా అమ్మమ్మా అని , మా చిన్న మనవరాలు నాన్నమ్మా అని పిలుస్త్తారు. ఇంతకీ ఈ సోది ఎందుకంటే ఒకళ్ళు ముద్దు చేసినా రెండొ వాళ్ళు నాలా హిట్లర్ లా వుండాలి మరి. ఇదండి సంగతి.
9 కామెంట్లు:
బ్లాగులోకానికి స్వాగతం. మీరు చెప్తున్న సంగతులు చాలా బాగున్నాయి.
మీ ఆలుమగలిద్దరి బ్లాగులూ క్రమం తప్పకుండా చదువుతున్నానండి.. చాలా బాగా రాస్తున్నారు.. మీరు చెప్పింది నిజమే.. ఒక హిట్లర్ ఉండాలి.
మొన్నటి నుండి, మీ బ్లాగ్ కోసం వెతుకుతున్నాను.. చివరికి ఈ వేళ కనబడింది..
ముందుగా బ్లాగ్లోకానికి స్వాగతం.. సో అయితే ఈ వారం స్వాతి లో మీ అభిప్రాయం రాబోతోందా..?! :)
జీడిపప్పు,మురళి గార్లకు
Thanks.
మేధ గారికి
Thanks.ఆ " కోతి కొమ్మచ్చి" వేషాలు ఆయనకే వదిలేశాను !!
హరేఫల లో మీ బ్లాగ్ గురించి వెతుకుతున్నాను...
ఇప్పుడే యూజర్ కామెంట్స్ లో దొరికింది...
అప్పుడప్పుడు మీ శ్రీవారికి కూడా కంప్యూటర్ ఇవ్వండి :-)
ఫణి బాబు గారు,సూర్యలక్ష్మి గారు...మీ ఇద్దరి పనీ భలే సరదాగా ఉంది!
పానిపూరి గారూ,
నేను కంప్యూటర్ ఇస్తున్నాను కాబట్టే ఆయన ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారు !!
సుజాత గారూ,
ఇదో కాలక్షేపం కదండీ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి