RSS

Friday, April 24, 2009

ఆంధ్ర దేశంలో నా మొదటి ఓటింగ్

            ఆబ్బా' ఇన్ని రోజులకు మొదటిసారిగా మన ఆంధ్రా లొ ఓటు వేసానండి అసలు ముందర వెయ్యకూడదు అని అనుకున్నాను. తప్పుల తడికల ఓటరు కార్డు చూసి, కాని అందరివి  ఇంచుమించుగా ఏదో తప్పులతోనే వున్నాయని తెలిసి , నా అస్థిత్వము నిలబెట్టుకుందుకు వెళ్లెందుకు తయారయ్యాను. ఇంక అప్పుడు మొదలయింది అసలు  ఎవరికి వెయ్యాలి?అని. ఇదివరకు పూనాలో  వేసినప్పుడు రెండు సార్లు నేను వేసిన అభ్యర్ధి గెలిచారు. రెండు సార్లు ఓడిపోయారు. సో ఇప్పుడు?

           అభయహస్తముందంట, అభయమూర్తి నీవంటా లేక ముత్యమంతా పసుపూ----ఎందుకంటే  నా ఉద్దేశ్యంలొ పదవిలో కి వచ్చిన తరువాత అందరూ ఒకటే.

ధరవరలంటారా పచ్చిమిరప కాయకు, పట్టు చీరకు ఏం ఖరీదో తెలియదు. సరే వెళ్లామండి, లిస్టులొ పేర్లు లేవన్నారు. ఇంతలొ ఫ్రెండు ఒకరు కనిపించి వెళ్ళిపోతున్నారేమిటి అని ,తెలిసికొని మీ పేర్లు వున్నాయని చెప్పి తీసుకువెళ్లారు. సరే అయనకు థాంక్సు చెప్పి  క్యూ లొ నిలబడ్డానండి. జీవితంలొ మొదటిసారిగా యిలాంటి సంభాషణ విన్నానండి.నా ముందు నిలబడిన ఇద్దరిది.

       మొదటి ఆమె : రాత్రి 2గంటలకు వచ్చి మనిషి కి మూడు వందలు యిచ్చారుట. అందుకని రాత్రి తలుపులు తీసిపెట్టి పడుకున్నాము.

        రెండొ ఆమె :అవునా, నయ్యం కాదు, దొంగలు వచ్చివుంటే , అయినా మా ఇంటి దగ్గర రెండు వందలే యిచ్చారు. మీ కిచ్చింది ఎవరు?

         మొదటి ఆమె: పలానా----

          రెండొ ఆమె : అవునా, -------తక్కువ యిచ్చారు,  నాకు ఏక్ దమ్ షాక్.  ఇంతవరకు చదవడము వినడమే కాని నా ఛెవులతొ వినడం మొదటిసారి,

       ఇంతలొఈంకో ఆవిడ డబ్బులు తొ వేస్త్తారా, వీళ్ల  పిచ్చి కాని సుభ్రంగా తీసికొని వాళ్లకు కావలసిన వాళ్లకే వేస్తారు. తెలివిగా, ఎవరికి ఓటు వెయ్యాలొ చక్కగాతెలుసు యిప్పటి జనాలకు. అయ్యబాబోయ్ ,ఏం తెలివి తేటలండి, నా సమస్య తీరిపొయింది. నేను నా ఓటు -----వేసి వచ్చాను. 

           నేను ఎవరికి వేసానంటారా? అమ్మో నాకు తెలివి వచ్చెసిందండి. ఏ పార్టీ నెగ్గితే ఆదే నా పార్టి.

             ఇదండి సంగతి.  

7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

meku kasthamukakunada ...pakkavallani ibaandi pettakunda manchi party ni enchukunnaru

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

saahityakokilaa గారికి అవునండి.

Chittoor Murugesan చెప్పారు...

very good keep it up

Audisesha Reddy చెప్పారు...

మీ '' ఇదీ సంగతి '' చూశాను.very Good.

rākeśvara చెప్పారు...

బాగున్నారా సూర్య లక్ష్మి గారు,
మీరు కూడా బ్లాగు మొదలు పెట్టినందుకు సంతోషం. ఇక అయ్యగారికి మీకు కంప్యూటరు దగ్గర గొడవలొస్తాయేమో చూసుకోండి మఱి. ఏ పూట ఎవరు వాడుకుంటారో ముందే వ్రాసి పెట్టుకోండి :)

మీ ఎలక్షన్ల అనుభవం, భలే గమ్మత్తుగా వుందండోయ్

- రాకేశ్వర

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మురుగేషన్ ,ఆదిశేషారెడ్డి గార్లకు
చాలా చాలా
thanks.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

రాకేష్
ఊరికే అందరికీ " ఢీ " లో ప్రవేశం ఇప్పిస్తానని చెప్పేస్తున్నారేమిటీ ?

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes