RSS

వృశ్చికం, ఫణి , నేను

                                              మేము నరసాపురములొ వున్నది కొద్దిరోజులయినా, నాది చిన్నవయస్సేఅయినా కొన్ని కొన్ని జ్ఞాపకాలు యిప్పటికి తాజాగానే వున్నాయి. ఎందుకంటె  నాజీవితంతొ ముడిపడి వున్నాయికనుక.

                                              నా చిన్నప్పుడు మా అమ్మగారు 9గంటలకల్లా అన్నం వండి చక్కగా కలిపి వేడి వేడిగా పప్పు, నెయ్యి వేసి తినిపించారట. మరి చిన్నపిల్లని కదా ఆడుకొమ్మని బొమ్మలు అవీ యిచ్చి కూర్చోపెట్టారట. ఆ తరువాత మా తాత గారికి వడ్దిస్తూ  కూర,పప్పువేసి అన్నం ఓ గరిట పెట్టి రెండొ గరిట  తీస్తూంటే ఎర్రగా వుందిట, ఏమిటా అని అన్నం పైకి కిందకి తీసి చూస్తే ఇంత పెద్ద తేలు అన్నంలొ వుడికి కనిపించిందట. ఇంకెముంది తాతగార్కి అన్నంపెట్టడంమాట దేముడెరుగు, ఆడుకొంటున్న నన్ను చంకన వేసుకొని ఏడుపులు, రాగాలుపెడుతూ ,ఈపక్కవాళ్లని, ఆపక్కవాళ్లని పిలిచి తేలుతో వుడికిన అన్నంపెడితే  ఏమన్నా అవుతుందా, అయ్యొ ఎంతపనిచేసాను ,-- ఇంతలొ నాన్నగారు వచ్చారట. ఇరుగు పొరుగు ,ఇక్కడ ఏడ్చి లాభం ఏమిటి? తొందరగా డాక్టరు దగ్గరకి  తీసుకెళ్ళండనారట. పొలొమని గబగబా హస్పిటల్ తీసుకెళ్లి డాక్టరు గారికి చెబితె ఇంతకి పిల్ల ఎక్కడ అన్నారట?  ఇంతింత కళ్ళతొ ఈ తతంగం అంతా వింతగా చూస్తున్న నన్ను చూపించారట.  నన్ను చూసిన ఆయన నవ్వుతూ  ఓ సారి స్టెతస్కోపు తొ పరిక్ష చేస్తూ ఇంతకి ఎన్నింటి కి పెట్టారంటె మాములుగానె 9గంటలకు పెట్టానండి, ఏడుపునాపుకొంటూ,

                                     ఏం పరవాలేదమ్మా,ఏమీ కాదు,పాప చక్కగా ఆడుకొంటొందికదా,తిన్నదంతా ఎప్పుడొ జీర్ణ మయిపోయింది,పీడకలలా మరచిపోండి, అన్నా వినకుండా అల్లాకాదు సరిగ్గా చూడండి, రాగాలట. ఇంక అయన మీరు ఆ రాగాలు ఏడుపు మానకపోతే మిమ్మల్ని హాస్పిటల్ లొ జాయి న్ చేయవలిసి వస్తుందని చెప్పి పంపిచేసారట. ఆ తరువాత ఓ రెండు రోజులు నిద్ర మానుకొని గమనిస్తూ గడిపారట.ఇప్పటికి చెబుతూవుంటారు. అందుకనొ ఏమో తెలీదు కాని నన్ను ఎప్పుడు తేలు కుట్టలేదు, మా ఇంట్లొను, మాకు తెలిసినవారు చాలా మంది తేలు కాటు తొ బాధపడ్దవాళ్లున్నారు. 

                                    మా అమ్మగారు టీచరు కదండీ, అప్పట్లొ డే కేర్ సెంటర్లు, క్రెష్ లు వుండేవికాదుకదా. నన్ను చూసేందుకు ఓ నెల మాపిన్ని, ఓనెల మామయ్యలది  డ్యూటి.  మా అమ్మక్కయ్య స్నేహితిరాలు భర్త  తణుకు-నరసాపురమ్ బస్సు  డ్రయివర్. ఆయన వీళ్లని అటు ఇటు తిప్పుతూవుండెవారు. పరిక్షల సమయంలొ ఎవరు వుండెవారుకాదు. అప్పుడు నన్ను స్కూలుకి తీసుకెళ్లి పెద్ద క్లాసు పిల్లలకు అప్పగించేవారు. నన్ను ఆడించడం డ్యూటి వాళ్లది. ఓ రోజు ఆకలి వేస్తోంది ఇంటికి వెళ్లిపోదామని మారాం చేస్తూ అమ్మకాళ్లమీద తలపెట్టి చీరకుచ్చెళ్ళతొ ఆడుకొటుంటె  ఇదుగొనమ్మా, గంట కొట్టగానే వెళ్ళిపోదాం బంగారుతల్లిలా అక్కడ కూర్చోమరి అనగానే , అంతే ,తలతీసి యిలా తిరిగానొ లేదొ ,దబ్ మంటూ పైనుంచి చుట్ట చుట్టుకొనిఓ పెద్ద పాము  అమ్మవడిలొ పడటం  కెవ్వుమని అరుస్తూ నన్ను దూరంగా తోసెయ్యడమ్ ,వడిలొంచి నేలమీదపడి అ పాము పారిపోవడమ్,అన్ని ఓ క్షణంలొ జరిగిపొయాయి. ఆ స్కూలు పై కప్పు తాటాకులది. ఆ తరువాత పాముని కొట్టారనుకొండి. ఇప్పటికి ఆ శబ్దం నాచెవిలొ అల్లాగే వినిపిస్తుంది. సినిమాల్లొకాని టి.వి.లొకాని  పాముల్ని చూడ్డం యిస్టం  వుండదు. జూలొ కూడా చూడను. పుస్తకాలలొ బొమ్మల్ని కూడా ఎవాయిడ్ చేస్తాను. మా అబ్బాయి యిప్పటికి ఏనిమల్ ప్లానెట్ చానెల్ చూస్తూ లొపల పనిలొ వున్న నన్ను సడన్ గా పిలిచి చూడు చూడంటూ  ఆట పట్టిస్తాడు.

                                      ఎలాగొ  శ్రీదేవి నటించిన నాగిన్ చూసాను   అల్లాగే లల్లాదేవి గారి శ్వేతనాగు, యండమూరిగారి దుప్పట్లొమిన్నాగు చదివాను. నాగులచవితికి ఉపవాసం వుంటాను. సుబ్రమణ్యేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్లినా భక్తికంటే భయమే ఎక్కువ.

                                     కొసమెరుపు: మావారిది వృశ్చికరాసి, పేరు మీ అందరికి తెలిసినదే---!

7 కామెంట్‌లు:

పానీపూరి123 చెప్పారు...

> మా అమ్మక్కయ్య స్నేహితిరాలు భర్త తణుకు-నరసాపురమ్ బస్సు డ్రయివర్. ఆయన వీళ్లని అటు ఇటు తిప్పుతూవుండెవారు
అమ్మక్కయ్య = ??

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అమ్మక్కయ్య అంటే అమ్మకి అక్కయ్య. కొంతమంది పెద్దమ్మ అంటారు.

నిషిగంధ చెప్పారు...

మీ కబుర్లు బావున్నాయండీ :-)

నాక్కూడా పాములంటే చాలా భయం.. అఫ్కోర్స్ చాలా మందికి భయమేననుకోండి.. కానీ నాకు కనీసం తల్చుకోవడానికి కూడా భయం.. మీలానే టివిలో కూడా చూసేదాన్ని కాదు.. ఒకసారి మావారు పట్టు పట్టి 'అనకండా' సినిమా ఒక 5 నిమిషాలు చూపించారు.. ఆ తర్వాత ఆయనకి వారం రోజులు నిద్ర దూరం చేశాను నా కలవరింతలతో :-)

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

నిషిగంధగారు,

ముందుగా సారి అండి. మీ వ్యాఖ్య నేను చూడలేదు.చాలా ఆలస్యంగా జవాబు యిస్తూన్నాను.

ఆకారణంగానే నేను ఆ పిక్చరు చూడలేదు.

నాగస్రీనివాస పేరి చెప్పారు...

గూగుల్ లొ ఎదొ సెర్చ్ చెస్తుంటే మీ బ్లాగ్ తగిలిందండి... బాగున్నాయి కబుర్లు...
అన్నట్టు మాదికూడా నరసాపురమేనండి

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...


నాగ శ్రీనివాస గారు,

మీకు నచ్చినందుకు సంతోషమండి.పాత టపా చూసి చదివి కామెంటు పెట్టారే ధన్యవాదాలండి.


నాగస్రీనివాస పేరి చెప్పారు...

మీ కబుర్లు చదువుతుంటే నరసాపురంలో మా ఇంటిపక్కన శారదత్తయ్యగారు గుర్తొచ్చారు..... కొంచెం సేపు మాములుగానే చదివాను.. నరసాపురం అని చదవగానే ఉత్సాహం వచ్చి మొత్తం చదివేసాను...

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes