నాగులచవితికి నా దగ్గరవున్న పాట ఒకటి పోస్టు చేద్దామనుకుంటూ మరచిపొయాను.ఆ పాట ఎవరు రాసారో ఎవరు పాడేరో కూడా తెలీదు.అంతా రామమయం పాట రాసానుకదా. అదే కాగితం లో ఇదికూడా వుంది. ఇది చాలా పాత పాట.
నీ పుట్ట దరికి నా పాపలోచ్చేరు-- పాప పుణ్యముల వాసనే లేని --
బ్రహ్మస్వరూపులో పసికూనలోయీ--కోపించి బుస్సలు కొట్టబోకోయీ--
నాగుల్లచవితికి నాగేంద్రనీకూ --పొట్టనిండా పాలు పోసేము తండ్రీ--
చీకటిలోన నీ శిరము త్రోక్కెమూ--కసిదీరా మమ్మల్ని కాటెయ్యబోకూ
కోవా పుట్టలోని కోడెనాగన్న--పగలు సాధించి మా ప్రాణాలు తీకూ--
నాగుల్లచవితికి నాగేంద్రనీకూ-- పొట్టనిండా పాలు పోసేము తండ్రీ--
అర్ధరాత్రి వేళ అపరాత్రి వేళా--పాపమెరుగనీ పసులు తిరిగేనీ--
ధరణి జీవనాధరములుసుమా--వాటీ నీ రోషానా కాటేయ్యబోకూ--
నాగుల్లచవితికి నాగేంద్రనీకూ--పొట్టనిండా పాలు పోసేము తండ్రీ--
అటుకొండ యిటుకొండ ఆరెంటి నడుమా--నాగుల్ల కొండలొ నాట్యమాడేటి--
దివ్యసుందరనాగా దేహియన్నాము --కనిపెట్టి మమ్మెపుడూ కాపాడవోయీ--
నాగుల్లచవితికి నాగేంద్రనీకూ -- పొట్టనిండా పాలు పోసేము తండ్రీ--
పగలనక రేయనక పనిపాటలందూ--మునిగి తేలేటి నా మోహాలబరిణె--
కంచెలు కంపలూ నడిచేటి వేళా--కంప చాటునుండి కొంప తీయకోయీ
నాగుల్లచవితికి నాగేంద్ర నీకూ -- పొట్ట నిండా పాలు పోసేము తండ్రీ--
నాకు పాటలు పాడటం రాకపోయినా పాట పాడే వారికి నా దగ్గరవున్న పాటలు యిస్తే నాకు చాలా సంతోషం.