RSS

నాగులచవితి పాట

    నాగులచవితికి నా దగ్గరవున్న పాట ఒకటి పోస్టు చేద్దామనుకుంటూ మరచిపొయాను.ఆ పాట ఎవరు రాసారో ఎవరు పాడేరో కూడా తెలీదు.అంతా రామమయం పాట రాసానుకదా. అదే కాగితం లో ఇదికూడా వుంది. ఇది చాలా పాత పాట.

    నీ పుట్ట దరికి నా పాపలోచ్చేరు-- పాప పుణ్యముల వాసనే లేని --
బ్రహ్మస్వరూపులో పసికూనలోయీ--కోపించి బుస్సలు కొట్టబోకోయీ--
నాగుల్లచవితికి నాగేంద్రనీకూ --పొట్టనిండా పాలు పోసేము తండ్రీ--

    చీకటిలోన నీ శిరము త్రోక్కెమూ--కసిదీరా మమ్మల్ని కాటెయ్యబోకూ
కోవా పుట్టలోని కోడెనాగన్న--పగలు సాధించి మా ప్రాణాలు తీకూ--
నాగుల్లచవితికి నాగేంద్రనీకూ-- పొట్టనిండా పాలు పోసేము తండ్రీ--

    అర్ధరాత్రి వేళ అపరాత్రి వేళా--పాపమెరుగనీ పసులు తిరిగేనీ--
ధరణి జీవనాధరములుసుమా--వాటీ నీ రోషానా కాటేయ్యబోకూ--
నాగుల్లచవితికి నాగేంద్రనీకూ--పొట్టనిండా పాలు పోసేము తండ్రీ--

    అటుకొండ యిటుకొండ ఆరెంటి నడుమా--నాగుల్ల కొండలొ నాట్యమాడేటి--
దివ్యసుందరనాగా దేహియన్నాము --కనిపెట్టి మమ్మెపుడూ కాపాడవోయీ--
నాగుల్లచవితికి నాగేంద్రనీకూ -- పొట్టనిండా పాలు పోసేము తండ్రీ--

    పగలనక రేయనక పనిపాటలందూ--మునిగి తేలేటి నా మోహాలబరిణె--
కంచెలు కంపలూ నడిచేటి వేళా--కంప చాటునుండి కొంప తీయకోయీ
నాగుల్లచవితికి నాగేంద్ర నీకూ -- పొట్ట నిండా పాలు పోసేము తండ్రీ--

    నాకు పాటలు పాడటం రాకపోయినా పాట పాడే వారికి నా దగ్గరవున్న పాటలు యిస్తే నాకు చాలా సంతోషం.

7 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

ఈ పాటంటే నాక్కూడా చాలా ఇష్టం.మొన్న నాగుల చవితినాడు దీనిని పోస్టుచేద్దామని అనుకున్నాను కాని చేయలేదు. మీరు పోస్టు చేసినందుకు చాలా ఆనందమయ్యింది.ఈ పాట బసవరాజు అప్పారావు గారి దనుకుంటా. ఓ సారి సరిచూడాలి. ధన్యవాదాలండీ పాటను పోస్టుచేసినందుకు.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

నరసింహ(వేదుల బాలకృష్ణ)గారికి
నా బ్లాగ్ కి వచ్చినందుకు ధన్యవాదాలండి. నిజంగా చక్కని పాట యిది.

Unknown చెప్పారు...

మీరు వ్రాసిన పాటలో కొన్ని చిన్న చిన్న అచ్చుతప్పు లున్నాయండి. నా దగ్గఱనున్న పుస్తకంలోనుంచి కాపీ చేసి పెడుతున్నానిక్కడ. ఏం అనుకోరుగా.
నాగుల చవితి
నీ పుట్ట దరికి నా పాప లొచ్చేరు
పాప పుణ్యమ్ముల వాసనే లేని
బ్రహ్మ స్వరూపులౌ పసికూనలోయి !
కోపించి బుస్సలు కొట్ట బోకోయి !

నాగుల చవితికి నాగేంద్ర ! నీకు
పొట్టనిండా పాలు పోసేము తండ్రి !

చీకటిలోన నీశిరసు తొక్కేము
కసిదీర మమ్మల్ని కాటేయ బోకు
కోవ పుట్టలోని కోడె నాగన్న
పగలు సాధించి మా ప్రాణాలు దీకు

నాగుల చవితికి నాగేంద్ర ! నీకు
పొట్టనిండా పాలు పోసేము తండ్రి !

అర్ధ రాత్రీ వేళ అపరాత్రి వేళ
పాపమే యెఱుగని పసులు తిరిగేని
ధరణికి జీవనాధార మైనట్టి
వాటిని రోషాన కాటేయ బోకు

నాగుల చవితికి నాగేంద్ర ! నీకు
పొట్టనిండా పాలు పోసేము తండ్రి !

అటు కొండ యిటు కొండ ఆరెంటి నడుమ
నాగుల కొండలో నాట్యమాడేటి
దివ్య సుందర నాగ ! దేహి యన్నాము
కనిపెట్టి మమ్మెపుడు కాపాడ వోయి !

నాగుల చవితికి నాగేంద్ర ! నీకు
పొట్టనిండా పాలు పోసేము తండ్రి !

పగలనక రేయనక పని పాటలందు
మునిగి తేలేటి నా మోహాల బరిణె
కంచెలూ కంపలూ గడచేటి వేళ
కంప చాటున వుండి కొంప దీకోయి !

ఈ చివరి చరణం లోని ఆ అందమైన ఆఱక్షరాల పదబంధం అంటే నాకెంతో ఇష్టం. ఈ పాటకి అది ప్రాణం లాంటిది నా ఉద్దేశ్యంలో. అదేంటో గ్రహించారా ? అదేనండీ
" మోహాల బరిణె " . మొగుణ్ణి " మోహాల బరిణె " గా వర్ణించటం బసవరాజు గారికే చెల్లింది. దురదృష్టవశాత్తు నేను ఈ పాటను చాలాకాలంగా చదువుకోవటమే కాని పాట గా వినే అదృష్టం దక్కలేదు.
అవునింతకీ మీ " మోహాల బరిణె " గారేంచేస్తున్నారు ? అడిగానని చెప్పండి. మా యింటికి రాకుండానే పూనా వెళ్ళి పోయారిద్దరూను.

మాలా కుమార్ చెప్పారు...

బాగుందండి పాట.
"మోహాల భరిణె " బాగుంది .

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

నరసింహ గారికి
నా దగ్గగవున్న కాగితము జీర్ణావస్థ లోకి వచ్చేసింది. చిన్న తప్పులు సరిచేసి రాసినందుకు ధన్యవాదాలు. మా మోహాల బరిణె పూణె లో కూడా అక్కడి సంగతులే గుర్తు చేసుకొంటున్నారు. ఈ సారి ఆంధ్రా వచ్చినపుడు తప్పకుండా మీ
ఇంటికి వస్తాము.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మాలా కుమార్ గారికి
ధన్యవాదాలండి.

మరువం ఉష చెప్పారు...

ఈ పాట కన్యాశుల్కం లోదండి.

http://www.youtube.com/watch?v=WY-LMTDmbyA

అలా నాగులచవితి పాటలు చూస్తూ మీ బ్లాగుకి వచ్చాను

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes