RSS

మా వారికి పథ్యం భోజనం !!



   ట్రింగు ట్రింగ్ ట్రింగ్...
హలో, ఫోన్ తీసేసరికి సుమతి , హాయ్ ఎలా వున్నావు? అంటూ కబుర్లు చివరికి వచ్చేసరికి వంటల దగ్గరికి సంభాషణ. మీ ఇద్దరికేగా, ఎంతసేపులే నీ వంట...
అలా అనకు, ఇద్దరికయినా అన్ని చేయాలికదా అన్నాను.
సుమతి: ఇంతకీ ఏం చేసావు?
నేను : కొబ్బరి అన్నం , మొలకెత్తినపెసల కూర, ఖడీ, నిన్నటి షీరా వుంది,చపాతీలునూ,...
సుమతి: ఎలా చేసావు?...
నేను: అనుకుంటూనేవున్నాను, నువ్వు అడుగుతావని,
సుమతి: అసలే ఫొను లో కూడాను తొందరగా చెప్పేయ్..
నేను: కొలతలు అవీ ఆడగకు , చిన్న అల్లంముక్క,కొబ్బరి,వెల్లుల్లి రేకలు ఓరెండు, ఓ పచ్చిమిరపకాయ గ్రైండు చేసి తీసి ఓ టమాటా కూడా గ్రైండు చేసిపెట్టుకొని, చ్లిన్న కుక్కరు లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీరా వేసి వేయింఛి సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు వేయించి,కరివేపాకు, గ్రైండు చేసిన మసాలా వేసి, గ్రైండు చేసిన టమాటా వేసి,ఓ చిటికెడు ధనియాపొడి, ఓచిటికెడు జీరాపొడి,గరంమసాలాపొడి, కొద్దిగా పసుపు వేసి,మొలకెత్తిన పెసలు వేసి ఓకప్పు నీళ్ళు పోసి,'శక్తి'చారుపొడికొద్దిగా , సాంబారుపొడి,కొద్దిగా కారం , ఉప్పు వేసి కుక్కరు 3 కూతలు వచ్చిన తరువాత కట్టేసి చల్లారిన తరువాత, కొత్తిమీర సన్నగాతరిగివేసాను.అంతేనూ, అయినా ఇలాంటివి ఫొన్లో మాట్లాడొచ్చా, మనం కలిసినప్పుడు చెప్పుకుందాం సరేనా---
సుమతి: నాకు కావలసింది తెలిసిపోయిందిలే--
నేను : ఏమిటబ్బా--
సుమతి: నీ సీక్రెట్, చారుపొడి, సాంబారుపొడి కలపడమన్నదీ--
నేను : సరేలే, ప్రతివాళ్ళకూ వాళ్ళ వాళ్ళ సిక్రెట్లు వుంటాయిమరీ---ఫొన్ పెట్టేస్తున్నాను, బై ---అన్నట్టు ఓ చిటికెడు పంచదార కూడా కలపాలి, మళ్ళి చెప్పలేదు అంటావు, నిజంగా బై --
మళ్ళీ ఓ పది నిమిషాల్లో అమ్మాయిఫొను, డాడి కాలినొప్పి ఎలావుందీ అంటూ ?
తగ్గిందమ్మా, అయినా ఇంకా రెస్టు తీసుకోవాలి అని చెప్పాను, ఇంతకు ముందే మా కోడలి ఫోను, ఎలావుందంటూ, ఎలాగయినా వీళ్లందరికి ఈయన అంటే చాలా చాలా అభిమానం , ప్రేమాను,నాకు నిత్యం కాలునొప్పి,నడుంనొప్పి వస్తూనేవుంటాయి అబ్బే ఎవరూ పట్టీంఛుకోరూ-- నేనే చెప్పుకోవాలి,నాకూ ఫలానా అని అప్పుడు అయ్యో! పాపం ఎలా వుందమ్మా అని అడుగుతారు.నీకు నొప్పి రాని రోజున చెప్పమ్మ, బయటకెక్కడకయినా వెడదాం అని నవ్వేస్తారు.( మా సుమతికి తెలీదులెండి. మావారి కాలినొప్పి గురించి,అందుకే వంటల గురించి అడిగింది)కాలినొప్పి అంటే గుర్తుకి వచ్చింది మా అత్తగారికి కాలినొప్పి వుండేది,ఆవిడ 70 సంవత్సరాల వయసులో ఓ సారి నాతో 'పలహారానికి ఇదుగో ఇవేళ ఇన్ని సగ్గుబియ్యం గింజలు (చేతితో చూపిస్తూ)ఇన్ని పాలచుక్కల్తొ వుడకపెట్టి,జీడిపప్పుపొడివేసి, రెండుకిస్మిస్ పళ్లువేసి పెట్టమ్మా, అన్నట్లు ఓ రెండు ఏలకులు చితక్కొట్టి వెయ్యామ్మా', అనేవారు---అంతావిని ఇదంతా ఎందుకూ సగ్గుబియ్యం పరవాన్నం చేయమని చెప్పొచ్చుకదా అనేదాన్ని. అంతేవెంటనే 'చాల్లే ! ఓఘాయిత్యం నాకు ఈ వయసులో పరవాణ్నాలు కావాలా' అనేవారు.మా యిద్దరిదీ అత్తాకోడళ్ళసరాగాలకంటే అమ్మమ్మ మనవరాళ్ళ సరదాలే వుండేవి ఎక్కువగానూ--మా అమ్మమ్మగారి మాటల్లొ చెప్పాలంటే నిత్యం చచ్చేవాళ్ళకు ఏడ్చేవాళ్ళేవరు? నా నొప్పి నాకుండుగాక, నొప్పి కాలికేగాని కడుపుకికాదుకదా,ఎందుకయినా మంచిది ఓ ఫొటొ తీసి పెడెతే పోతుంది,మళ్ళి పిల్లలు ఫొను చేయొచ్చు వాళ్ళ డాడి కి సరిగ్గా చేసిపెట్టానో లేదో అని.నాకు ఫొటొ ఎందుకూ అని శ్రీవారు ఆంటూంటే , ఎందుకయినా మంచిది ఓ ప్రూఫ్ వుండాలి, లేకుంటే మీరు మాత్రం తక్కువా, తుమ్మితే మీ బ్లాగులో తేలుతున్నాను.
ఖర్మ కాలి ఎప్పుడైనా కొంచెం పన్ను పోటెడుతోందండీ అంటే 'పీకించేద్దామా పోనీ' అంటారు మా శ్రీవారు.ఎవరైకైనా పన్ను పీకించుకొమని ఉచిత సలహా ఇవ్వడం ఎంత సంబడమో ఆయనకి. కారణం తెలుసుగా !

8 కామెంట్‌లు:

మానస చెప్పారు...

నోరూరుతోంది ఫోటో చూడగానే..ఇంతకీ షీర అని మరాఠీ వాళ్ళ దగ్గర వినడమే గానీ తెలీదు.అది కూడా పరిచయం చెయ్యండి ఈ సారి.

ఎంత ఓపిక ఓపిక అండీ మీకు ఇన్ని రకాలు చెయ్యడానికి.

అజ్ఞాత చెప్పారు...

హ..హ..బావుందండీ.
ఊరకే అన్నారా సాగితే రోగమంత భోగం లేదని, చాలా రోజులతర్వాత బ్లాగులోకొచ్చాను . వస్తూనే మొదటగా చదివింది మీ టపానే . దిల్ ఖుష్ అయిపోయిందంటే నమ్మండి

ఆ.సౌమ్య చెప్పారు...

హ హ హ భలే రాసారండీ...మీ అమ్మమ్మగారి మాటలు బావున్నాయి. సగ్గుబియ్యం, పాలు, జీడిపప్పు కలిపితే పరవాణ్ణం కాక ఇంకేమవుతుందిట !

అన్నట్టు మీ రెసిపీ నాకు బాగ నచ్చింది. అన్ని రకాల పదార్థాలు కలిపితే బాగుండక ఏమిచేస్తుంది..అర్జెంటుగా నేనూ ఇదేదో చేసేస్తా :)

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మానసా,

మన రవ్వకేసరి లాటిదే.అయినా ఒకసారి దానిగురించి వ్రాస్తాను.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

లలితా,

దిల్ ఖుష్ కాబట్టి షుక్రియా !

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

సౌమ్యా,

చేసేయండి.ఆలశ్యం ఎందుకూ?

Unknown చెప్పారు...

వహ్ వాహ్! విందు భొజనం లా ఉంది పిన్ని! బ్లాగ్లు అలా రాస్తారేకాని నిజంగానే బాబుగారు మీకు ప్రత్యక్ష దైవం...లేకుంటే ఇలా ఇంత అభిమానంతొ ఇన్ని చేసిపెడతారా?

మనుసులంటే గుర్తొచ్చింది...మా ఇంటాయన(బాబుగారి ఇష్టైల్) నా రెండవ "ట్రైమెస్టర్" లో నా మనుసులు తీర్చాల్సింది పోయి, కాకరకాయలు పట్టుకొచ్చి "నువ్వు చేస్తావేం, అలా కాయపడంగా కరేలా వొండు" అని అడిగేరు...అలాంటి వాటిని చూసే మనం అర్ధం చేస్కోవాలి వారికి మనం చేసిపెట్టేవి ఇష్తం అని...తమంతట తాము చెప్పరు...

ఏమైనా మీ ఓపికకి వారికి చూపించే శ్రద్ధకీ జోహార్లు!

May you always stay happy together...my love and respect ...LLAP!!!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

ఏరియన్,

థాంక్స్

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes