RSS

మా శ్రీవారూ-దీక్షావస్త్రాలూ



    మాశ్రీవారి దీక్షావస్త్రాలనిగురించి ఓ టపా రాయాలనుకున్నా. పెళ్ళైన కొత్తలో, ఓ పైజమాలాటి పాంటేసికుని కూర్చునేవారు ఇంటా బయటా కూడా. ఎవరైనా మాఇంటికి వచ్చేరంటే,'ఎక్కడికైనా బయల్దేరుతున్నారా'అనేవారు.కొంతకాలానికి
ఆ పైజమా పాంటుల్లోంచి, బెల్ బాటం లోకి దిగారు.ఇంట్లో మాత్రం ఏవో పాత పాంట్లే వేసికుని కూర్చునేవారు. మొత్తానికి ఎలాగోలాగ లుంగీలు కొనిపించాను.మాపాగుతుంది కదా అని ఓ రెండుమూడు గళ్ళ లుంగీలు (శంఖు మార్కువి) తెచ్చేసికున్నారు. ఇంక అదే రంధి. మా మామగారు పోయినప్పుడు, అమలాపురం వెళ్ళినప్పుడు, మా పెదమామగారు, ఈయన్ని ఆ గళ్ళలుంగీల్లో చూసి చివాట్లేశారు.'అదేమిట్రా,బ్రెడ్డులూ,బన్నులూ అమ్మే కొట్టువాడిలాగ' అని.పుట్టి పెరిగింది
కోనసీమలో, పంచ కట్టుకోడమేనా సరీగ్గా రాదు.పీటలమీద కూర్చుని ఏ ప్రదక్షిణమో చెయ్యడానికి నుంచుంటే ఎప్పుడూడుపోతుందో అని భయమే ! లుంగీలా చుట్టపెట్టుకుంటే ఎవరైనా తిడతారెమో అని భయం. ఓసారి ఎక్కడో చూశారు,పంచ షేప్పులో కుట్టించిన పంచలు.దానికో బొందూ. కలకత్తాలో దొరుకుతాయిట. వాళ్ళఫ్రెండెవరినో కాళ్ళావేళ్ళా పడి, ఓ రెండు తెప్పించుకున్నారు!

   శుభ్రంగా ఆంధ్రదేశం లో పుట్టి ఈ బొందుపంచలేమిటీ అంటూ, మానాన్నగారు ఈయనకి పంచ కట్టుకోవడం నేర్పారు మొత్తానికి.మొత్తానికి అలాగ, పూజలు చేసికునేటప్పుడు పంచ కట్టుకోడం నేర్చేసికున్నారు!ఇంక ఆఫిసుకెళ్ళేటప్పుడు, ఓ రంగు ప్యాంటేసికునేవారు, నా బాధ భరించలేక. తెల్లదో, లేతరంగుదో వేసికుంటే, సాయంత్రానికి మాసిపోయేది,తెల్లారి లేచి మళ్ళీ అదే వేసికుంటానంటే ఎలాగండి బాబూ.ఆరోజుల్లో ఏమైనా వాషింగు మెషీన్లా ఏమిటీ,బాత్ రూం లో బకెట్టులో నానపెట్టి
చచ్చేట్లా ఉతుక్కోవడమే కదా
! ఈ సాధింపులు వదిలించుకోడానికి ముదురు రంగు పాంటుల్లోకి మార్చేశారు. పైగా వాటిమీద, రోజు విడిచి రోజు ఓ షర్టు మార్చుకున్నా ఆయన రోజెళ్ళిపోతుంది.అస్సలు డ్రెస్స్ సెన్స్ లేదండి బాబూ. ఓ రంగు నచ్చిందంటే
ఇంక కొట్టుకి వెళ్ళిన ప్రతీసారీ, అదే రంగు. నాకు పెళ్ళైన కొత్తలో ఆరెంజి రంగు చీరలే కొనేవారు. మా అత్తగారు, నేను స్నానం చేసి చీర మార్చుకోలేదనుకునేవారు.' ఏమే నీళ్ళోసుకుని చీర మార్చుకోలెదా' అనేవారు.'కాదూ మీ అబ్బాయి నాకన్నీ ఈ రంగువే కొన్నారూ' అని పెట్టె తీసి చూపించవలసివచ్చింది.ఆవిడ చివరకి ముద్దుల కొడుకుతో ' ఇవేం చీరల్రా మఠం లో వాళ్ళలాగ' అని చివాట్ళేసేవరకూ,నాకు ఆ కాషాయ రంగు చీరలే! మళ్ళీ ఈమధ్యన పాత జ్ఞాపకాల్లొకి వెళ్ళి
'ఆ రంగుల్లోవి దొరికితే మళ్ళీ మొదలెడదామా' అంటూంటారు.ఇప్పుడు మా అత్తగారుకూడా లేరు!

    ఆయన్ని కుర్తా పైజమ్మాల్లో(North Indian style) చూడాలని నాకు మనసూ.రిటైరుమెంటు ముందర దక్షిణ భారత దర్శనానికి వెళ్లినప్పుడు, అలాటిదోటి కొనిపించాను.అది చూసి మా పిల్లలు, ఇంకో నాలుగు జతలు ప్రెజెంట్ చేశారు! ఈయనకెంత చిరాకో,చూడిదార్ లాటిదేసుకోవడానికి, పోనీ కట్ చెయించేసికోనా అంటూంటారు. కాదండీ, అలా ముడతలు పడడమే స్టైలూ అంటే వినరే.స్వతహాగా తెలియదూ, చెప్తే అర్ధం చేసికోరూ.మా అబ్బాయికి కొంచెం టైట్ అయినప్పుడు, వాడి షర్టులు ( బ్రాండెడ్ వి) పోనీ వేసికుందామా అనుకుంటే, మా మనవరాలు ' తాతయ్యా, డాడీ షర్టేసేసికున్నావా' అని వీధిలో పెట్టేస్తూంటుంది.

    ఇంటిలోకి కోడలొస్తూందీ, ఇప్పుడైనా ఆ లుంగీలేసికుని కుర్చోకండీ అని పోరగా పోరగా మొత్తానికి ఓ నాలుగు పైజమాలు తెచ్చుకుని, ఇంక రోజంతా, బనీనూ, ఆ బొందు పైజమా.ఎప్పుడైనా మా అగస్థ్యని ఎత్తుకున్నప్పుడు తడిపితే, మార్చుకోండీ అంటే కోపం. ఫర్వాలేదూ, పసిపిల్లాడే కదా అంటారు. పైన పెట్టిన ఫొటోలో,ఆయన RKLaxman common man లా లేరూ గళ్ళకోటోటే తక్కువ!

18 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

హ హ హ...అదరగొట్టారు బేగంసాహిబా! చదువుతున్నంత సేపూ నవ్వీ నవ్వీ అంకెళ్ళు నెప్పెట్టాయి... అమలాపురంలో బాబు గార్ని ఊహించుకున్నా కూడా...

చాలా బావుంది...

నాకు కూడా బాబు గారికి ఆ కుర్తా పైజామా చాలా నప్పుతాయనిపిస్తొంది...ఏమన్నా సరే అవి వెయ్యించండి ఆయనచేత సుభకార్యాలకి...కేక!

rishi చెప్పారు...

హాయిగా ఉంది మీ టపా చదువుతోంటే,బొందు,శంఖు మార్కు లుంగీలు..ఈ మాటలు వింటొంటే నా చిన్నతనం గుర్తొచ్చిందండీ.

>> ఇవేం చీరల్రా మఠం లో వాళ్ళలాగ'
హహహా
>>స్వతహాగా తెలియదూ, చెప్తే అర్ధం చేసికోరూ.

ఈ మాట చదవగానే మా అమ్మ సామెత "చాదస్తపు మొగుడు చెపితే వినడు,కొడితే ఏడుస్తాడు" గుర్తొచ్చింది.
చెప్పినప్పుడు వినకపోతే మా అమ్మ ఈ మాట వాడేది(వాడుతుంది).

>>RK laxman common man లా లేరూ గళ్ళకోటోటే తక్కువ!

Yes :))

manasa చెప్పారు...

వర్డ్ వెరిఫికేషన్ తీసేసినందుకు ధన్యవాదాలు.దాని వల్ల కామెంటాలంటే బద్ధకం వస్తుంది.

ఎప్పటిలాగే హాయిగా ఉందండీ మీ టపా."బొందు" అన్న పదమే వినపడట్లేదు ఈ మధ్య.

ఇంట్లో ఉన్నప్పుడు నైటీలో ఉండేదానిని చదువుకునే రోజుల్లో.పగలూ రాత్రీ చూసీ
చూసీ మా అమ్మకి విసిగొచ్చేది.మడిబట్ట విప్పుతావా లేదా అనేది కోపంగా :)

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

ఋషీ,

ధన్యవాదాలు.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మానసా,

"మా అమ్మకి విసిగొచ్చేది.మడిబట్ట విప్పుతావా లేదా అనేది"- హ హ హా... అవే దీక్షావస్త్రాలు మరి!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Sirisha చెప్పారు...

uncle blog kanna naku mee blog nachindi...andukey mimmalni follow auvta

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

నాకు వచ్చే వ్యాఖ్యల్లో ఏదో గందరగోళం అయిపోతూంది. కొన్నిటిని,వెరిఫికేషన్ తీసేసినవి, రెండు అక్కడ వచ్చాయి(మానస,ఋషి).తరువాత ఎరియన్78, మురళి వ్రాసినవి మెయిల్ కి వచ్చాయి.వాటిని ' అనుమతించు' అన్నా కానీ,
వ్యాఖ్యల్లో రావడం లేదు. పైగా అదేదో ఎర్రర్ అని వస్తోంది. ఎవరైనా సహాయం చేస్తారా ప్లీజ్..

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

ఈవేళ ప్రొద్దుటినుంచీ బ్లాగర్ లో జరుగుతున్న గందరగోళం, మొత్తానికి రాత్రికి సెటిల్ అయింది.ఈ లోపులో చేసిన కెలుకుళ్ళ ధర్మమా అని, ఒక్కొక్క వ్యాఖ్యా రెండేసి, మూడేసి సార్లు ప్రచురింపబడింది. వాటన్నిటినీ (అంటే extra వచ్చినవన్నీ) తీయాల్సొచ్చింది. ఏదో ఒకటి మొత్తానికి నా పోస్ట్ మీద వ్యాఖ్య పెట్టిన వారందరికీ( ఏరియన్,మురళి,ఋషి, మానస) ధన్యవాదాలు.

Unknown చెప్పారు...

ఇప్పుడు బాగానే ఒస్తున్నయి పిన్ని! ఏదైనా బ్లాగ్స్పాత్ సర్వర్ లొ లోపమై ఉంటుంది...

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

murali,

Thanks.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes