RSS

మా పుణె బాలాజి







   ఆకాశంలో నల్లనిమబ్బులు మధ్య మధ్యలోమినుకుమినుకుమనే బాలభాస్కరుని కిరణాలు,వచ్చిరాని ఎండ,అంతలోనే చిన్న చిన్న చిరుజల్లుల మద్య ఎత్తైన సొగసైన సయ్యాద్రి కొండలు,వాటి మీద పచ్చని తివాసి పరఛినట్లుగా చెట్లు, కొద్దిగా కిందకి చూస్తే వంపులు తిరుగుతూ కవ్వించే లోయ, అందులో చెరవులు, మరోపక్క జొన్నతోటలు,మొలలోతు నీళ్ళలో వరినార నాటుతూ వయ్యారిభామలు,, అబ్బ! ఎంత చక్కని దృశ్యమండీ! నిజంగా రెండుకళ్ళు చాలలేదు చూసేందుకు, ఆహ్లాద వాతవరణంలో ఆనందమయుడైన శ్రీనివాసుని మందిరమండీ బాబూ, ఎంత కమనీయంగా వుందనుకున్నారు?,కాసేపు తిరుమలలో వున్నామా ,అనిపించింది. మా పుణె దగ్గర బెంగుళూరు వెళ్ళె జాతీయరహదారికి పక్కనే కేట్కవాలే అని చిన్న గ్రామంలో కట్టిన బాలాజి మందిరం నిజంగా తిరుమల గుడిలాగే కట్టారు..

   మొక్కు ఏమీ లేదు, కానీ దగ్గరలోనే ఉన్న శ్రీవెంకటేశ్వరుని సన్నిధిలో ,మా అగస్థ్య కి పుట్టువెంట్రుకలు తీయిద్దామని, మేమందరం కలిసి వెళ్ళాము. తీరా వెళ్ళినతరువాత, అంత చిన్నబాబుకి, తీయడం కష్టం అని, ఓ నాలుగైదు కత్తెరలవేసి వదిలేశారు.ఆతరువాత దేముడి దర్శనానికి వెళ్ళాము.అబ్బ వర్ణించలేము ఆ శ్రీనివాసుని అందాలు!
ఇక్కడ అన్నీ ఉచితమే.లోపల ప్రసాదం( లడ్డు),ఆ తరువాత మనిషికి ఒకటిచొప్పున మీల్స్ కూపన్ ఇచ్చారు. కేశఖండనం, చెప్పులుపెట్టేచోటా కూడా ఉచితమే. మేం ఏదో ప్రొద్దుటే వెళ్ళాము కాబట్టి అప్పటికి రష్ ఎక్కువగా లేదు.దర్శనం చాలా బాగా జరిగింది.
ఈ దేవాలయం శ్రీ వెంకటేశ్వరా హాచిరీస్ వారు కట్టించారు.50 ఎకరాల విస్తీర్ణంలో కట్టించారు. అచ్చంగా తిరుమలలో ఉన్నట్లే ఉంటుంది ఇక్కడంతా. అక్కడనుండి దగ్గరలో ఉన్న దత్తమందిరం కూడా దర్శించుకుని వెనక్కి వచ్చాము.

3 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

చాలా బాగుంది...గుళ్ళు ఎప్పుడూ అలా ప్రసాంత వాతావరణంలో ఉంటే నాకిష్టం. కాని ఇప్పుడు ప్రతి గుదిలో భక్తులెక్కువ, దేవుని దర్శనం తక్కువ. గుడి చుట్టుపక్కల కొట్లు, కొట్లవాళ్ళ గోల.
మీ వర్ణన చాలా బాగుంది...

Ramachandrudu చెప్పారు...

ఏమి వర్ణనమండీ. అద్భ్హుతంగా చిత్రీకరించేరు.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

ఏరియన్, రామం గారూ,

ధన్యవాదాలు.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes