RSS

'లక్ష్మీ పురాణం'- రెండవ భాగం






    సరే! ఆ తరువాత పెద్దపూజారిగారింటికెళ్ళాము.ఆయన భార్య ఓ పెద్దావిడ. కనీసం ఓ 75 సంవత్సరాలుండవచ్చు.నాతో ఎలా పూజ చేస్తావు? మీకు అక్కడ సత్ సంగ్ లాంటివి వున్నాయా అని అడిగారు. మాములుగా రోజూ దీపంపెట్టి అష్టలక్ష్మీ స్తోత్రం,మండపాక ఎల్లారమ్మ దండకం చదుతాను. శుక్రవారం మాత్రం పాయసం లేకపోతే షీరా చేసి నైవేద్యం పెట్టి లలితా సహస్రనామం చదువుతాను.ఇంతలో ఆవిడ లోపలకెళ్ళి పసుపు కుంకుమ లతో విప్పేసిన చీర ఉండ చుట్టినట్ట్లుగా తెచ్చి, నా ఒడి పట్టమని చెప్పి దానిలో వేశారు.
ఇలాంటివి ఎక్కడ చూసానబ్బా , అనుకుంటుంటే గుర్తుకి వచ్చింది.పొద్దున్న గుడిలో మేము యిచ్చిన చీర అలంకరించినపుడు తీసేసిన చీర యిలాగే చుట్టలా చుట్టి ఒక గంపలోపడేశారు.అంబా తాయి శేషవస్త్రం అని చెప్పియిచ్చారు. నా నోటంట మాటే రాలేదు. కళ్ళు ఆనందభాష్పాలతో నిండిపోయి ఆ తల్లి తప్పితే మరేమి కనిపించలేదు.ఇంతలో ఆ పక్కవాళ్ళకి ఈ పక్కవాళ్ళకి వాళ్ళ కోడలు చెప్పినట్టున్నారు. వాళ్ళు వచ్చి " తుమ్ చి నసీబ్ కూప్ చాన్ హై" అని నా దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళారు. నిజానికి వాళ్ళు నా కంటె వయసు లో పెద్దవారేను.

   ఆ తరువాత భోజనాలు అవీ అయి హోటలుకి వెళ్ళి కవరు తీసి చూసిన మాకు ఎంతో ఆశ్చర్యమనిపించింది.రంగు ,అంచు , అదే పట్టు చీర కాదంటె తేడా తెలియాలికదా అన్నట్లుగా ఆకుపచ్చ రంగు అంచు. నేనిచ్చినది బాటిల్ గ్రీన్.ఆ రోజు అక్కడే నిద్ర చేసి ఆ మరునాడు రూమ్ ఖాళీ చేసేసి కింద లాబీ లో " దేశ్ పాండే" కోసం ఎదురు చూస్తూండ గానే అతను వచ్చి ఎలాగు ఇంత దూరం వచ్చారు కదా " గోవా" చూసివెడతారా? అంటే, లేదు,లేదు వెళ్ళిపోతాము. అనగానే సరే ఒక పని చేద్దాము.రత్నగిరి దగ్గర "పావస్" అని వుంది. అదేదో యోగి పేరు చెప్పారండి. గుర్తు రావటం లేదు. అక్కడికి వెళ్ళివద్దామన్నాడు.అంత ఇంట్రస్టు లేకపోయినా అతను ఆయనకి భక్తుడట. సరే బాగుండదని హారతి అయి నైవేధ్యం పెట్టెవరకూ కాకుండా దర్శనం చేసుకువచ్చేద్దామన్నాము.సరే అంటూ సామాను డిక్కిలో పెట్టి బయలుదేరాము.ఆ ప్రసాదం తీసుకొని వెళ్ళాలి ఆ మహనైవేద్యం కోసం జనాలూ యిక్కడకు వస్తారు, అది తీసుకునేందుకు పెట్టి పుట్టాలి. కావలన్నావారికి దొరకదు.ఆయన దయ ఉంటేనే మనకి ప్రాప్తం వుండేది అంటూ చెప్పాడు. ఇంతలో ఓ చిన్న సందులో యిటికల ట్రక్కు అడ్డంగా అటక్ అయిపోయింది దాన్ని తీసేందుకు క్రేన్ వచ్చి మాకు దారి దొరికి అక్కడకి వెళ్ళేసరికి సరిగా హారతి సమయానికి వెళ్ళాము.అతని ధర్మామా అని హారతీ, ప్రసాదం దక్కాయి.మాకు రాసి పెట్టి వుందనుకుంటాను. అందుకే దారిలో అవాంతరం.

    తిరిగి మమ్మల్ని బస్ స్టాండు తీసుకెడుతుండగా రోడ్డు మీదే పూనె బస్ దొరికింది. మళ్ళి డ్రెవర్ సీట్ వెనక ముగ్గురు కూర్చునే సీట్ లో ఇద్దరం కూర్చుని వచ్చాం.ఎక్కే జనాలందరూ మూడొ మనిషి ఉన్నట్లే భావించి వెనక్కి వెళ్లి కూర్చున్నారు.మొత్తానికి హాయిగా సంతృప్తిగా , ఆనందంగా స్వార్ గేట్ లో దిగామండి.ఇక్కడ ఎవరు వస్తారూ? మాకోసం కారు తీసుకొని, పైగా రాత్రి పదకొండు గంటలయింది. ఆటోవాడు ఎంత ఎక్కువ అడుగుతాడో అనుకొంటూ ఆటో కోసం చూస్తుంటే మా దగ్గరకి మామా ( పోలిసు) వచ్చి ఎక్కడకి వెళ్ళాలీ? రేంజిల్సు అనడం తోటే ఓ రిక్షాతన్ని పిలిచి యిందులో వెళ్ళండన్నాడు. సరే ! దొరకడమే ఓ పెద్ద అదృష్ట మనుకొని ఎక్కి జాగర్తగా ఇంటికి వచ్చేసాము.మీటరు మీద కంటె ఒక్క పైస ఎక్కువ తీసుకోలేదు.మిరాకిల్ కదా! మొత్తం ప్రయాణం అంతా మిరాకిల్ కదా !

   ఇదండీ, మా కొల్హాపురీ యాత్ర విశేషాలు,మార్గశిరమాసంలో లక్ష్మీ పురాణం లాగా మా స్నేహితులు మళ్లీ మళ్ళీ చెప్పించుకుంటారు,ఇంకోటేమిటంటే ఆ ఫోను నెంబరు పలకటం లెదు. మేమెలా వెళ్ళామొ మాకు తెలీదు. అంకుల్ గారిల్లు అదీను, ప్రయత్నిస్తే దొరకొచ్చు కాని రాసి పెట్ట్టి వుంటే జీవితంలో మళ్ళి కలుస్తాం లేకుంటే ఆ లక్ష్మీ మహిమే అనుకుంటాము ..మేము మరీ ఎక్కువగా యాత్రలు చేయలేదనుకోండి. చేసినవి మాత్రం బాగా గుర్తుండిపోయాయి. అందులో కొన్ని దేవుని మహిమ లేక యాదృచ్చికమా! అని అనిపిస్తుంది. మార్గశిరమాసంకదా మా స్నేహితులు కొంతమంది మా కొల్హాపురి యాత్రానుభవం చెప్పమని అడుగుతూవుంటారు.ఇప్పటికి ఎన్నో సార్లు చెప్పాను. అయినా అడుగుతారు, నేను చెబుతూవుంటాను.చెప్పినపుడల్లా ఓ రకమైన అనుభూతి, ఆనందం, భక్తి పారవశ్యం --- కార్తీకపురాణం లా నేను చెప్పే లక్ష్మీ పురాణం విని ఆనందిస్తారు.(మా కొల్హాపురీ ప్రయాణ విశేషాలు) మాకు దేవుని వద్దకు వెళ్ళినపుడు కొన్ని కొన్ని మరపురాని సంగతులు జరుగుతూ వుంటాయి.వాటిలో యిదొకటి.

    పైన చూపించిన మొదటి ఫొటో( నీలం రంగు) అమ్మవారి శేష వస్త్రం. రెండోది మేము అమ్మవారికి సమర్పించుకున్నలాటి చీర.

4 కామెంట్‌లు:

శ్రీలలిత చెప్పారు...

అంతేనండీ..మనకి రాసిపెట్టున్నది మనం ఎక్కడున్నా మన చేతిలోకొచ్చి పడుతుంది. మనం చూడాలనుకున్నది మన ప్రయత్నం లేకుండానే అలా హాయిగా జరిగిపోతుంది. అన్నింటికీ రీజనింగ్ వుండదు. మొత్తానికి మీరు సంతృప్తిగా ఆ మహాలక్ష్మిని దర్శించుకున్నారు. అదే కావలసింది.
అభినందనలతో,
శ్రీఅలిత..

durgeswara చెప్పారు...

అమ్మ అనుగ్రహం అంతేనమ్మా ! మనప్రమేయం లేకుండానే అన్నీ అమరుస్తుంది .ఎంతైనా అమ్మకదా !

Unknown చెప్పారు...

Albert Einstein said "Coincidence is God's way of remaining anonymous" - అలాగ, ఇది నిజంగా ఒక అద్భుతమే పిన్ని! ఈ విషయాలు మాతొ పంచుకున్నందుకు ధన్యవాదాలు! ఇలాంటివి ఎంత విన్నా తనివితీరదు.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

శ్రీలలిత,దుర్గేశ్వరగారు,ఏరియన్
నిజమండీ, ఇప్పటికి యిది నిజమేనా అనుకొని ఆ చీరలు చూసి నిజమే ననుకుంటాను. అంతా మాయలా అనిపిస్తుంది.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes