RSS

మావారు బంగారు కొండండి బాబూ....

   "ఎప్పుడు మా స్వంత ఇంటికి, పిల్లల్ని చూద్దామని, వెళ్ళి ఓ మూడునాలుగు రోజులుందామా అనుకున్నా, మా శ్రీవారెప్పుడూ, ఛాన్స్ దొరికితే, ఒక్కరూ మేముండే ఫ్లాట్ కి పారిపోతూంటారు! ఇక్కడ నాకు తోచదూ అంటూ. ఇన్నాళ్ళూ నిజమే కాబోసూ, పోనీలే ఈ వయస్సులో ఆయనమీద ఆంక్షలు పెట్టడం ఎందుకూ అని వదిలేసేదాన్ని. ఆయన మొన్నెప్పుడో వ్రాసిన టపా చూసిన తరువాతే తెలిసింది.వామ్మోయ్ అందుకనన్నమాట, ఎప్పుడు చూసినా నెట్ ముందరే కూర్చుంటారూ,ఇక్కడుంటే అక్కడకీ, అక్కడుంటే ఇక్కడికీ ఛాన్స్ దొరికితే పారిపోవడమే!

   పిల్లలతో క్రిందటేడాది చెన్నై ఫ్లైట్ లో వెళ్దామూ అంటే, వద్దూ, నేను ట్రైనులోనే వెళ్తానూ అన్నారు, ఇదన్న మాట అసలుకారణం! ఎప్పుడు పిల్లలతో కలిసి, ఏ వీకెండుకో, తిరగడానికి కారులో వెళ్ళినా సరే, నాకు ఓపిక లేదూ, మీరందరూ వెళ్ళండీ అనే! ఓపికుండమంటే ఎక్కడుంటుందీ? ఎన్నెన్ని "వ్యాపకాలు" మరి? ఆరోజుకూడా, రాత్రెప్పుడో ఫోను రావడం వలన తెలిసింది కానీ, ఎన్నాళ్ళనుండి జరుగుతోందో అసలీ భాగవతం? పైగా ఆ టపాకి "రామాయణం...." అని పేరోటీ!

   అప్పుడెప్పుడో మార్కెట్ లో జారిపడ్డప్పటినుండీ, ఏదో రిటైరయి ఆరేళ్ళవుతోందీ, కాళ్ళల్లో నొప్పీ,మళ్ళీ నడుస్తున్నప్పుడేమైనా స్లిప్ అవుతారేమో అని, ఈవెనింగ్ వాక్ కి వెళ్ళినప్పుడు,పోనీ చేయి పట్టుకుందామా అంటే, గయ్యిమంటారు. నా చెయ్యెందుకు పట్టుకుంటావూ, నాకేమైనా రోగమనుకున్నావా రొచ్చనుకున్నావా అని. అయినా నా చెయ్యి పట్టుకుంటే ఏమొస్తుందీ, "పట్టుకునేవాళ్ళు" పట్టుకుంటే బావుంటుంది కానీ! అమ్మో అమ్మో, ఇంతకాలం నాగ్గూడా తెలియకుండా, ఎలా మానేజ్ చేశారో?

   ఉద్యోగం లో ఉన్నంతకాలం, అదీ వరంగాం లో ఉన్నప్పుడు, మాట్లాడితే, డెప్యుటేషన్లమీద వెళ్ళేవారు. పైగా అస్తమానూ అలా ప్రయాణాలెందుకండీ అంటే, పిల్లలకి పుస్తకాలు ఇక్కడ దొరకవు కదా, అదే ఢిల్లీ లోనూ, కలకత్తాలోనూ, బొంబైలోనూ అయితే దొరుకుతాయీ, అని నన్నూరుకోబెట్టేవారు. నిజమే కాబోసనుకునేదాన్ని, ఏదైనా పెద్ద చదువులు చదువుకున్నానా ఏమిటీ? పైగా వెళ్ళడం వెళ్ళడం, ఓ వారంరోజులదాకా రాకపోవడం.ఎక్కడికెళ్ళేవారో, ఏం గ్రంధం నడిపించేవారో ?"

---

అని అంటాననుకున్నారు కదూ. అబ్బే, మాశ్రీవారు ఓ బంగారు కొండండి బాబూ ! నోట్లో వేలెడితే కొరకలేరు ( అసలే పళ్ళు కూడా లేవూ). అయినా అంత ధైర్యం ఎక్కడిదండి బాబూ ఆయనకి? ప్రతీ రోజూ నాతోనే వేగలేకపోతున్నారే, మళ్ళీ ఇంకోళ్ళా. ఛస్తే నమ్మను....

12 కామెంట్‌లు:

రహ్మానుద్దీన్ షేక్ చెప్పారు...

:)

SJ చెప్పారు...

good::))

రహ్మానుద్దీన్ షేక్ చెప్పారు...

ఇక మీరు మరో టపా రాసి, ఫణిబాబు గారికి ఈ టపా రాసినందుకు అపరాధ క్షమాపణగా నా తరఫున ఆయనకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టండి

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

చివరి పేరా కి మిగతావాటికి చేతి వ్రాతలో తేడా కనిపిస్తోంది. మీరేం భయపడకండి. మేమున్నాం. లై డిటెక్టరు పరీక్షలు అవి చేయించి మీరు ఆ చివరి పేరా ఎవరి బలవంతం మీద వ్రాసారో తేలుస్తాము. మా మద్దత్తు మీకు ప్రకటిస్తున్నాం.

ఆయన బ్లాగులో అలా సమర్ధించుకోవడాన్ని నిర్ద్వందము గా,నిజాయితీగా ఖండిస్తున్నాను. అంతే.

కృష్ణప్రియ చెప్పారు...

sooper couple!

@ సుబ్రహ్మణ్యం గారు,

మీరు ఇంకా సూపర్! మీకసలు ఇలాగ అనాలని ఎలా తోచిందో.. :))

కొత్త పాళీ చెప్పారు...

brilliant :)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

@కృష్ణప్రియ గారూ,

మేము లక్ష్మి గారి పార్టీ లో చేరిపోయాము.
అయినా మీరు ఒక్క సలహా కూడా ఇవ్వకుండా వెళ్లిపోవడం, బాగాలేదు అని మనవి చేస్తున్నాం.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

@రెహమాన్,

ప్రతీ రోజూ చేస్తున్నా కదా బాబూ! మళ్ళీ ప్రత్యేకంగా ఒకటా?

@సాయి,

ధన్యవాదాలు.

@సుబ్రహ్మణ్యం గారూ,

ఏదో మనవాళ్ళందరూ ఉన్నారనే ధైర్యమే లేకపోతే ఏమయ్యేదో? అది నా " చేతివ్రాతే" నండి! ఆ ఫోను వచ్చినప్పుడు నేనూ ఉన్నాను కదా!

@కృష్ణప్రియా,

థాంక్స్ !!

@కొత్తపాళీ గారూ,

ధన్యవాదాలు.

Mauli చెప్పారు...

అదీ అలా అడగాలి మరి :)) అస్సలు తగ్గొద్దు

(మనలో మన మాట, అనాల్సినవన్ని అనేసి భలే ముగి౦చారులే చప్పట్లు!! )

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మౌళి గారూ,

ధన్యవాదాలు.

మాలా కుమార్ చెప్పారు...

:))

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మాలా కుమార్ గారూ,

థాంక్స్.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes