RSS

గురు దర్శనము

    పండరీపురం యాత్రకి వెళ్ళినప్పుడు,గానుగాపూర్ లో శ్రీనరసింహస్వామి సరస్వతి, అక్కల్ కోట్ లో స్వామిసమర్థ దర్శనాలు చేసికునే అదృష్టం కలిగింది. గురుపూర్ణిమ సందర్భంగా, ఆ దర్శన విశేషాలు మీ అందరితోనూ పంచుకోవాలనే ఈ టపా.

    పండరిపురం నుండి 4 గంటలకు " అక్కల్ కోట్ " చేరుకున్నాము. అప్పటికి మహాప్రసాద వితరణ సమయం దాటిపోయింది. దేవస్థానం వారి భక్తినివాస్ లో ఓ గది తీసుకున్నాము. గదిలో మూడు మంచాలు పరుపులు, పక్కబట్టలు వున్నాయి.కావాలంటే ఇంకొక పరుపు యిస్తారట.ముఖ్యంగా బాత్ రూమ్ బాగానేవుంది. ఉదయమే 4 గంటలకి వేడినీళ్ళు దొరకుతాయి. ప్రతి ఫ్లోరులోనూ వేడినీళ్ళ పంపు వుంది.మనమే పట్టి తెచ్చుకోవాలి.అక్కడే కాస్త ఫ్రెష్ అయి దేవస్తానం వారి కేంటిన్ లో భోజనాలు చేసి ( వేడిగా అప్పటికఫ్ఫుడు చేసిన చపాతీలు, రెండు కూరలు , మజ్జిగ ) రూములో ఓ పావుగంట రెస్టు తీసుకొని ," శ్రీ స్వామి సమర్ధ" దర్శనానికి రాత్రి 10 గటలవరకూ వుంటూందని , ఆ తరువాత మందిరం మూసేస్తారని , మహాప్రసాద వితరణ రాత్రి 10 గంటలవరకూ, ఒక్కొక్కసారి భక్తుల తాకిడి ఎక్కువగావుంటే ఆ తరవాత కూడా వుంటుందని తెలుసుకొని , 4. 45 నిమిషాలకి " అక్కల్ కోట్" నుండి " గాణగాపూర్" బయలుదేరాము. బయలుదేరిన ఓ అరగంటకి వాతావరణం మారిపోయింది.పెద్దగాలి, మెరపులతో వాన మొదలయింది. రోడ్డు చిన్నది, గొతుకులు,ఎదర బండి వస్తే తప్పుకుందుకు లేదు. చీకటి. కరెంటు లెదు. కర్నాటక ప్రభుత్వం ,మహరాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోని రోడ్డనుకుంటాను. అస్సలు బాగుండలేదు. చాలా శ్రమ పడి ఓ గంటలో వేళ్ళేదానికి రెండు గంటలు పట్టింది. మా డ్రెవర్ చాలా ఓర్పుగా మంచిగా తీసుకువెళ్ళాడు.అక్కడ ఊళ్ళొను కరెంటు లేదు.పెద్ద వాన తగ్గినా ఇంకా చినుకులుపడుతున్నాయి. అలాగే చీకట్లోనే నది దగ్గరకి , వెళ్ళాము. అక్కడ భీమానది అమరజా నది కలుస్తాయట. ఆ తరువాత ఓడ్డున వున్న " ఔదుంబర్" వృక్షమునకు నమస్కరించి మందిరంలోని " నరసింహ సరస్వతి దత్తాత్రేయులను"

దర్శించి జాగర్తగా నిర్గుణ మందిరానికి వెళ్లాము.గుళ్ళలో జనరేట ర్ దీపాలు వున్నాయి కనుక సరిపోయింది.దారిలో శంకరమట్ వారిది, శ్రీజ్ఞానపీఠ సరస్వతి వారివి బోర్డులు చూశాము.దిగలేకపోయాము. అంతా చీకటిమయం. ఆ భగవంతుని దయ వల్ల ఎలాగో ఇక్కడి" శ్రీ నరసింహ సరస్వతి దత్తాత్రేయులను , ఇదివరకొసారి పిఠాపురం లో ని " శ్రీపాదవల్లభ దత్తాత్రేయులను దర్శించే భాగ్యం కలిగింది.

    దిగంబరా! దిగంబరా! శ్రీపాదవల్లభ దిగంబరా!

    ఔదుంబరా! ఔదుంబరా! శ్రీ నరసింహ సరస్వతి ఔదుంబరా!

అక్కడినుండి 8 గంటలకు బయలుదేరి 9 .45 కి "అక్కల్ కోట్" చేరుకున్నాము. రాత్రి 10 గంటలకు మందిరం మూసేస్తారని, ఊదయమే కాకడ హరతి వెడదామని మహాప్రసాదానికి వెళ్ళగా ఆదృష్టం బాగుండి మాకు మహాప్రసాదం దొరికింది. చాలా పద్దతిగా అంతమందికి వేడిగా కావలసిన అన్నం, కూర, ఆమ్టి( సాంబారు లాటింది) , చపాతీలు కూడా పెట్టారు. మా ముందు ఎన్ని బాచి లు అయ్యాయో తెలీదు. మహాప్రసాదం తప్పని సరిగా తీసుకోవాలిట.ఇంత అలస్యమైనా మాకు దొరకడం మహద్భాగ్యమేను.ఆ తరువాత గదికి వచ్చాము. మేమువున్న భక్తి నివాస్ కి 1 కి.మి దూరంలో మందిరంవుంది.నడిచి వెళ్ళవచ్చును లేకుంటే నేను వస్తానని మా డ్రెవరు చెప్పాడు. మంచివాడేనూ..

    ఉదయమే 4 గంటలకల్లా వేడినీళ్ళు వచ్చాయి. మా రూము కి ఎదురుగానే పంపు వుండటం వల్ల శ్రమ లేకుండా తెచ్చేసుకున్నాము. స్నానపానాలు ముగించుకొని 5 గంటల కల్లా మందిరంలోని వటవృక్షం కింద కూర్చుని " కాకడ హారతి అయిన తరువాత దర్శనం

చేసుకొని బయట వేడి గా "చాయ్" తీసికొని తిరిగి భక్తినివాస్ వచ్చాము. అక్కడ కేంటీన్ లో ఫలహరాలు పూర్తి చేసుకొని ( ఉప్మా, పోహా వున్నాయి) గది ఖాళి చేశాము.. భక్తినివాస్ లో గదులు బాగానే వున్నాయి.గదికి 450 రు.లు వసూలు చేసారు.

    జయ ! జయ!సమర్ధ ! స్వామి సమర్ధ అనుకుంటూ " సోలాపూర్ " బయలుదేరాము...

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes