ఈరోజు మరువలేని రోజు. మాబంగారు తల్లిని మాప్రాణంలొ ప్రాణాన్ని,మాకంటి పాపను, తను కోరినవానితొ ఇరుకుటుంబాల సమ్మతితొ పచ్చని మామిడితోరణాలమధ్యలొ పగలంతా మండుటెండగా వున్నా సాయంత్రానికిచల్లబడిన ఆహ్లాద వాతావరణంలొమరొ యింటికి దీపంగా పుత్రవధువుగా పంపినరొజు,ఏమిటి గోల అనుకొంటున్నారా, మా అమ్మాయి పెళ్ళిరోజండి బాబూ, ఆ సంతోషంలొ కాస్తంత భావుకత్వం ఎక్కువయిందిలెండి. పెళ్లి బట్టలు ,నగలు అన్ని రెండు నెలలముందరె తీసెసుకున్నాము. మేము వుండేది ఓ పల్లెటూరు. బంగారం జలగావ్ లొ మిగిలినవి అన్నిపూనెలొ, పెళ్లికూడా మాఫాక్టరి క్లబ్ లొ, ఢిల్లి నుండి వచ్చె మగపెళ్ళివారికి( ఢిల్లి-పూనె ఫ్లైట్) ఆంధ్రానుండి వచ్చె మా చుట్టాలకు ( కోనార్క్ ఎక్సుప్రెస్ )వీలుగావుంటుందని. మాఅమ్మ,నాన్నగార్లు వైజాగ్ నుండి ముందరె సూత్రాలు, యజ్ఞోపవీతం, సారె సామాను లాంటివి తీసుకొని వచ్చేసారు .మా అబ్బాయి మావారు పెళ్లివారి బట్టలు బంగారం వెండి విలువైన సామాను, తో ముందరే రైలులొ పూనా చేరుకున్నారు ఈ ఏర్పాటు ముందు జాగర్తన్నమాట. మిగిలిన సామాను అంటె పానకం బిందెలు కాళ్ళుకడుగుపళ్ళెం పెట్టుబడిబట్టలు,రిటర్న్ గిఫ్టులు.కేటరింగ్ భొజనం నచ్చనివారికి కొత్తావకాయ, కందిపొడి.వగైరా వగైరా తీసుకొని క్వాలిస్ లొ నేను మాఅమ్మ,నాన్నగారు ఫాక్టరిలొపనిచేసె ఓఇద్దరు అబ్బాయిలు బయలుదేరాము. నిజానికి మాతొ మాడాక్టరు స్నేహితులుకూడా రావలసినది కాని ఆఖరి నిమిషంలొ వారికి కుదరలేదు.వీరు మాతొ వుంటారనే ఈయన ధైర్యంగా ముందరగా వెళ్లినది. డాక్టరు ఫ్రెండ్స్ దగ్గరవుండి కొబ్బరికాయకొట్టించి పసుపు కుంకమలతొ పూజచేయించి పంపారు.ప్రయాణం బాగానె జరుగుతున్నా మనసులొ భయం. అమ్మవంటిమీద నాదగ్గర బంగారం , వీళ్ళకా భాష రాదు, ఆ అబ్బాయిలు చిన్నవాళ్లెను, ఆహమ్మదునగర ప్రాంతానికి వచ్చాము. అక్కడ చెక్ పొస్టు దగ్గర పొలిసులు గాడి ఆపారు,గాడిలొ పేకెట్లు పెట్టెలు సామాను చూసి ఏమిటని ప్రశ్నించారు. ఇంక డ్రయివరు,నేను, ఆ అబ్బాయిలు వారికిసమాధానం చెప్పేసరికి తాతలు దిగివచ్చారు, వాళ్ళు అనేది ఓ కార్డు,లేక పెళ్లిఎక్కడొ అడ్రస్ కాని మీ ఐడెంటిటీ కాని ఏదొ ఒకటి చూపించమంటారు,అబ్బె, మాదగ్గర ఏమీ లేవు. ఏదొ ఒకటి పెట్టుకొవాలికదా అసలు ఏమి తొచలేదు డాక్టర్స్ మాతొ రాకపొవడంతొ గడబిడ అయిపొయింది. వాళ్లు చెప్పిందివిని సారి చెప్పి బయలుదేరాము. పొలీసు గాడీ కూతతొ మావెనకేరావడం ఆపుచేయడం నిజంగా దడే వచ్చేసింది.మొదటిసారిగా పోలీసులతొ మాట్లాడ్డం. అయిన ఆలస్యం ఎలాగా అయిందికదా అని చెప్పి దగ్గరలొనె వున్న శనిసింగపూర్ వెళ్లి దర్శనం చేసుకొని పూనా వెళ్లాము.అప్పటికె బొంబాయిలొ పనిచేసె పెళ్లికొడుకు ,పెళ్లికూతురు కలసి పూనా వచ్చి ఎవరి పెరెంట్సు దగ్గరికి వాళ్లు చేరారు. అరొజు పెళ్లికూతుర్ని చేయడం,మెహందిప్రొగ్రాం, సాయంత్రం రిసిప్షను, ఆసమయానికి అందరూ వాళ్ళ కార్లలొను టాక్సిల్లొను వచ్చేసారు బందువులు,రైల్లొ వచ్చినవాళ్లు తక్కువేను, పెళ్ళికొడుకు అక్కగారింటి నుండి బారాత్ తీసుకొని మగపెళ్ళివారు వఛ్చెసారు. మా అత్తగారు బారాత్ ని చూసి చిత్రహార్లా వుందని అందరికి చెప్పెవారు. ఆ డాన్సులు అవీ కొత్తకదామరి. ఒకసారి బారాత్ వాళ్లు వచ్చినతరువాత ఎవరు మగపెళ్లివారు ఎవరుఆడపెళ్లివారొ తెలియనంతగా కలసిపోయారు. రిసిప్షను, రాత్రిపెళ్ళి, అయినవెంటనె వాళ్ళు దుల్హనుతొ బారాత్ తీసుకువెళ్లడం ఉదయం 5గంటలకు మేము మాఅమ్మ,నాన్నగారు మాబాబు, మాబావగారితో వచ్చిన మాఅత్తగారు మిగిలాము. ఆసాయంత్రానికిఆదే క్వాలిసులొ వరణ్ గావ్ బయలుదేరాము. భగవంతుని అనుగ్రహంతొ పెద్దల , బందుమిత్రులఆశీర్వచనాలతొ, చక్కగా జరిగి అమ్మాయి అల్లుడు పిల్లలతొ చల్లగావున్నారు. మాబంగారుతల్లి మమ్మల్ని అడిగినది ఒకే ఒక్కటి, అదే అతనితొ వివాహం. పసిపిల్లగా వున్నప్పుడు కాని పెద్దయినతరువాత కాని ఎప్పుడూ ఏమి అడగలేదు పెళ్ళిబట్టల సెలక్షను, నగలవి, అన్ని మాఇష్టమేను, నాక్కావలసినది నాకు ఇచ్చారు. మీరు ఏదీ చేసిన నాకుఇష్టమేను, నాగురించి నాకంటె కూడామీకే బాగాతెలుసు , అంటుంది. అప్పుడు ఇప్పుడు ఆంతే.
మరుపు రాని రోజు
అంతా రామ మయం
అరుణగారడిగిన శ్రీసూర్యనారాయణా కొసం వెతుకుతూంటె 1971సంవత్సంలొ రాసిన పాటల కాయితం బయట పడింది. అది అందరికి తెలుసునా అనేది తెలీదు. కాని చక్కని రామనామ బృందగానం. దీన్ని రాసినది శ్రీ వింజమూరి శివరామారావు గారని గుర్తు. అక్షర తప్పులున్నా క్షమించి సరిదిద్దుకొగలరని మనవి.
అంతా రామమయం
శ్రీరామ రాఘవేంద్రా! సీతా మనొ రాజ పూర్ణచంద్రా!
వైకుంఠ దివ్యధామా! సుశ్యామ లోకైకపూజనామా
నీరాహరాశిలొనా శేషాద్రి చారు తల్పమ్ముపైనా --
శయనించు దేవదేవా,మామీద దయయుంచుమాదిదేవా!
క్రూర కృత్యములు సాగె ,లొకానదారుణత్వములుమూగే --
పురుషార్ధము నేర్వగా,రావయ్యా,ధరణి భారము తీర్పగా !
దానవులుకష్టాత్ములై, ఓస్వామి,మానవులు దీనాత్ములై --
తపియించుచున్నారయా రావయ్యా, కృపనించుమన్నారయా!
ధశరధేశ్వరుల తపసు ,కౌసల్య,విశదవ్రతముల మహస్సు --
ఫలియించినవి కాంతిలొ, లోకాలు,జ్వలియించినవి శాంతిలొ!
మోని యాగము రక్షకై, దుష్టుకా,దానవావళి శిక్షకై--
శ్రీరాఘవుండరిగెను, అనుజుతొ, ఘోరాటవుల తిరిగెను !
దుష్టులను శిక్షించెను,మా తండ్రి శిష్టులను రక్షించెను--
మిధిలాపురము చేరగా,ఆ దాశరధియేగె నింపారగా!
విరెసె పూవులు,మల్లెలు,స్వామిపై కురిసెవెన్నెలజల్లులు--
జానకీ దరహాసమో,జనకభూజాని యాత్మ వికాసమో !
శ్రీజానకీయుతుడవై, వరమోని, రాజేంద్ర సన్నుతుడవై --
పరశురాముని శౌర్యము,శ్రీరామా,హరియించితివిసర్వమూ!
దశరధేశ్వరుల మాట, తలదాల్చి,విశదభొగముల వీడి--
నారచీరలే కట్టెను నాతండ్రి కారడవులే పట్టెను!
దానవత్వము మించగా,రావణుడు జానకిని హరియించగా--
కారడవిలొరేగెనే ,లంకపై కారుమబ్బులుమూగెనే !
ఎంతశోకించినాడో,శ్రీరాముడెంత కృశియించినాడొ --
జీవితమ్మెభారమై జానకీదేవి దృష్టికి దూరమై!
తరులతీవెలదరిసెను,మాతండ్రి గిరులకొనలనడిచెను--
ఏవాడకానరాదయా,మాతల్లి ఏజాడయను లేదయా!
శిష్టులను రక్షించెను దాశరధి ,దుష్టులను శిక్షించెను--
వాలికూలగ చేసెను,సుగ్రీవు వానరాధిపుచేసెను !
లంకాపురమో కాల్చెనో,దానవాహాంకారమేవేల్చనో--
హనమంతుడుద్రిక్తుడై , శ్రీరామ ఘనపాదసద్బక్తుడై !
వీరవానరకొటితొ సాహసొదార భాసుర కోటితొ--
జైత్రయాత్రకు వెడలిరి రాఘవులు శత్రు వీరులెఅడలిరి !
శరము సంధించినాడు వీరుడై శరధి బందించినాడు--
కోదండపాణియగుచూ దివ్యాస్త్ర వేదియై యోధుడగుచూ!
శ్రీసతీ చిత్తకామా , బల భీమ కొశలాధీశరామా--
పట్టాభిరామా ,అయోధ్య,పట్టణాధీశ రామా!
సీతా సమేత రామా, సన్మార్గ , పూత చరిత్ర రామా--
దుష్టైక శిక్షరామా, శ్రీరామా శిష్ట సంరక్షక రామా!
మరొసారి మనవి, ఈపాట ఏ కేసెట్ లొ వుందొ తెలియబరచగలరు.
వృశ్చికం, ఫణి , నేను
మేము నరసాపురములొ వున్నది కొద్దిరోజులయినా, నాది చిన్నవయస్సేఅయినా కొన్ని కొన్ని జ్ఞాపకాలు యిప్పటికి తాజాగానే వున్నాయి. ఎందుకంటె నాజీవితంతొ ముడిపడి వున్నాయికనుక.
నా చిన్నప్పుడు మా అమ్మగారు 9గంటలకల్లా అన్నం వండి చక్కగా కలిపి వేడి వేడిగా పప్పు, నెయ్యి వేసి తినిపించారట. మరి చిన్నపిల్లని కదా ఆడుకొమ్మని బొమ్మలు అవీ యిచ్చి కూర్చోపెట్టారట. ఆ తరువాత మా తాత గారికి వడ్దిస్తూ కూర,పప్పువేసి అన్నం ఓ గరిట పెట్టి రెండొ గరిట తీస్తూంటే ఎర్రగా వుందిట, ఏమిటా అని అన్నం పైకి కిందకి తీసి చూస్తే ఇంత పెద్ద తేలు అన్నంలొ వుడికి కనిపించిందట. ఇంకెముంది తాతగార్కి అన్నంపెట్టడంమాట దేముడెరుగు, ఆడుకొంటున్న నన్ను చంకన వేసుకొని ఏడుపులు, రాగాలుపెడుతూ ,ఈపక్కవాళ్లని, ఆపక్కవాళ్లని పిలిచి తేలుతో వుడికిన అన్నంపెడితే ఏమన్నా అవుతుందా, అయ్యొ ఎంతపనిచేసాను ,-- ఇంతలొ నాన్నగారు వచ్చారట. ఇరుగు పొరుగు ,ఇక్కడ ఏడ్చి లాభం ఏమిటి? తొందరగా డాక్టరు దగ్గరకి తీసుకెళ్ళండనారట. పొలొమని గబగబా హస్పిటల్ తీసుకెళ్లి డాక్టరు గారికి చెబితె ఇంతకి పిల్ల ఎక్కడ అన్నారట? ఇంతింత కళ్ళతొ ఈ తతంగం అంతా వింతగా చూస్తున్న నన్ను చూపించారట. నన్ను చూసిన ఆయన నవ్వుతూ ఓ సారి స్టెతస్కోపు తొ పరిక్ష చేస్తూ ఇంతకి ఎన్నింటి కి పెట్టారంటె మాములుగానె 9గంటలకు పెట్టానండి, ఏడుపునాపుకొంటూ,
ఏం పరవాలేదమ్మా,ఏమీ కాదు,పాప చక్కగా ఆడుకొంటొందికదా,తిన్నదంతా ఎప్పుడొ జీర్ణ మయిపోయింది,పీడకలలా మరచిపోండి, అన్నా వినకుండా అల్లాకాదు సరిగ్గా చూడండి, రాగాలట. ఇంక అయన మీరు ఆ రాగాలు ఏడుపు మానకపోతే మిమ్మల్ని హాస్పిటల్ లొ జాయి న్ చేయవలిసి వస్తుందని చెప్పి పంపిచేసారట. ఆ తరువాత ఓ రెండు రోజులు నిద్ర మానుకొని గమనిస్తూ గడిపారట.ఇప్పటికి చెబుతూవుంటారు. అందుకనొ ఏమో తెలీదు కాని నన్ను ఎప్పుడు తేలు కుట్టలేదు, మా ఇంట్లొను, మాకు తెలిసినవారు చాలా మంది తేలు కాటు తొ బాధపడ్దవాళ్లున్నారు.
మా అమ్మగారు టీచరు కదండీ, అప్పట్లొ డే కేర్ సెంటర్లు, క్రెష్ లు వుండేవికాదుకదా. నన్ను చూసేందుకు ఓ నెల మాపిన్ని, ఓనెల మామయ్యలది డ్యూటి. మా అమ్మక్కయ్య స్నేహితిరాలు భర్త తణుకు-నరసాపురమ్ బస్సు డ్రయివర్. ఆయన వీళ్లని అటు ఇటు తిప్పుతూవుండెవారు. పరిక్షల సమయంలొ ఎవరు వుండెవారుకాదు. అప్పుడు నన్ను స్కూలుకి తీసుకెళ్లి పెద్ద క్లాసు పిల్లలకు అప్పగించేవారు. నన్ను ఆడించడం డ్యూటి వాళ్లది. ఓ రోజు ఆకలి వేస్తోంది ఇంటికి వెళ్లిపోదామని మారాం చేస్తూ అమ్మకాళ్లమీద తలపెట్టి చీరకుచ్చెళ్ళతొ ఆడుకొటుంటె ఇదుగొనమ్మా, గంట కొట్టగానే వెళ్ళిపోదాం బంగారుతల్లిలా అక్కడ కూర్చోమరి అనగానే , అంతే ,తలతీసి యిలా తిరిగానొ లేదొ ,దబ్ మంటూ పైనుంచి చుట్ట చుట్టుకొనిఓ పెద్ద పాము అమ్మవడిలొ పడటం కెవ్వుమని అరుస్తూ నన్ను దూరంగా తోసెయ్యడమ్ ,వడిలొంచి నేలమీదపడి అ పాము పారిపోవడమ్,అన్ని ఓ క్షణంలొ జరిగిపొయాయి. ఆ స్కూలు పై కప్పు తాటాకులది. ఆ తరువాత పాముని కొట్టారనుకొండి. ఇప్పటికి ఆ శబ్దం నాచెవిలొ అల్లాగే వినిపిస్తుంది. సినిమాల్లొకాని టి.వి.లొకాని పాముల్ని చూడ్డం యిస్టం వుండదు. జూలొ కూడా చూడను. పుస్తకాలలొ బొమ్మల్ని కూడా ఎవాయిడ్ చేస్తాను. మా అబ్బాయి యిప్పటికి ఏనిమల్ ప్లానెట్ చానెల్ చూస్తూ లొపల పనిలొ వున్న నన్ను సడన్ గా పిలిచి చూడు చూడంటూ ఆట పట్టిస్తాడు.
ఎలాగొ శ్రీదేవి నటించిన నాగిన్ చూసాను అల్లాగే లల్లాదేవి గారి శ్వేతనాగు, యండమూరిగారి దుప్పట్లొమిన్నాగు చదివాను. నాగులచవితికి ఉపవాసం వుంటాను. సుబ్రమణ్యేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్లినా భక్తికంటే భయమే ఎక్కువ.
కొసమెరుపు: మావారిది వృశ్చికరాసి, పేరు మీ అందరికి తెలిసినదే---!










