RSS

33 సంవత్సరాల క్రితం స్మైల్ పింకీ

         "  మనం  మేలు  చేసినవాళ్లను గుర్తు పెట్టుకోవక్కరలేదు కాని మనకు మేలు  చేసినవారిని మాత్రం మరవకూడదు. "

  ఈ రోజు మా  చెల్లెలు కు ఫొను చేస్తే పన్ను నొప్పి పెడుతోంది డాక్టర్ దగ్గరకు వెళ్ళి వచ్చాను.పిప్పి పన్ను తీయకుండా టెబ్లెట్స్ యిచ్చారు. తీయించుకుందుకు నాకు భయమేను, అసలు తీయించుకొవచ్చొ లేదొ కూడా తెలీదు అని. అలా ......

              ఒక్కసారి నా మనసు గత జ్ఞాపకాల్లొకి వెళ్లింది. ఇంచు మించుగా  33 సంవత్సరాల క్రితం మాట . నేను యిచ్చిన టెలిగ్రామ్ కి బదులుగా నాన్నగారు  చెల్లిని తేసుకొని" పూనా " వచ్చారు.  టెలిగ్రామ్ చూసి వెంటనే బయలుదేరి వచ్చేశమమ్మా,  ఇది జరిగేపనేనంటావా, అని ఎంతో ఆశతొ ఆత్రుత తొ అడిగారు.చూద్దాం నాన్న,ప్రయత్నిద్దాం. మొన్న పాప పుట్టినరోజున వచ్చినపుడు మాటల్లొ అడిగాము సరే రమ్మనమండి అన్నారు.ఎక్కువ ఆశ పెట్టుకోకండి. మళ్ళి పని జరగకపోతే అదో భాద, ఇలా మేం మాట్లాడుకుంటుంటే మా మాటలు వింటూ పాపని (1సం) ఆడిస్తోంది.అప్పటి కే 10  వ తరగతి పాస్ అయి చదువు మానేసిన 16 సంవత్సరాల మా చెల్లెలు. తను పుట్టుకతోనే గ్రహణం మొర్రి(చీలిన పెదిమ---క్లెఫ్ట్ లిప్).  పాలు ఎలా పొయ్యాలొ తెలియక గ్లూకోజ్  నీళ్ళతొ నాలిక తడిపే హాస్పిటల్ సిబ్బంది ,పాలు ఎలా యివ్వాలొ తెలీని తల్లి,వీరిద్దరినుండి మా అమ్మమ్మ గారు తన చేతిలొకి తీసికొన్న తరువాత ఆశ వదులుకోండి అని చెప్పిన డాక్టర్ల మాట వమ్ము చేసి  ఎలా పెంచారో ఆవిడకే తెలియాలి. చిన్న చిన్న దూది వుండలు  పాలలొ ముంచి నోటిలొ చుక్కలు గా పొసేవారట. ఆ తరువాత తెలిసినది ఏమిటంటే పెదవే కాక లోపల అంగుట్లొ కూడా చీలిక వుందని, మా అమ్మగారు  స్కూల్ టీచర్. పసిబిడ్డని అమ్మమ్మగారి వద్ద వదలి  చాలా బాధ తొ  నన్ను తీసుకొని  నాన్న గారి దగ్గరకు వెళ్లిపోయారట.

            మా తాతగారు వేదపండితులు. దేవతార్చన, మడి ,ఆచారం చాలా చాలా ఎక్కువ.అందుకని అమ్మమ్మగారు అరటీ ఆకు మీద పడుక్కొపెట్టి దూది వుండలతోనే పాలు ,నీళ్ళు , పప్పు నీళ్ళు, కూరల నీళ్లు  ఇలాగే పోస్తూ, అమ్మక్కయ్య,పిన్ని, మామయ్య మొత్తం అందరూ కలసి పెంచారు. మద్ధ్య మద్ధ్యలొ వెళ్లి చూసెవాళ్ళం ఆ తరువాత ట్రాన్సుఫర్ చేయించుకొని అమ్మమ్మగారి ఊరు వెళ్ళేవరకూ తను అక్కడె పెరిగింది, ఇది మన యిల్లు. మనము కలసి వుండాలని చెప్పగా చెప్పగా ఎప్పటికొ మా యింట్లొ ఆలవాటు అయింది  అ తరువాత స్కూల్ లొ ఎన్నో ఫేస్ చేసి మరి ఎంతమందో ఎగతాళిల మద్య ఎలాగొ సిగ్గుతొ 10 వ తరగతి పాస్ అయ్యిందీ . పేరుతో పిలావలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపోయేది కొంతమందికి. ఏ అవకరముండేదో అలాగే పిలిచేవారు. అ తరువాత చదివేందుకు ఒప్పుకోలేదు. పిల్ల చిన్నగా వున్నపుడు దీనికి ఓ ఆపరేషన్ వుంటుందనీను, ఎలాగో ఎక్కడొ  తెలీక, తెలిసిన తరువాత ఎంతవుతుందో తెలీక మొత్తానికి,ఏమయితేనే తలరాత అని మన కర్మ. అని సర్దుకున్న సమయంలొ ఈయన మిత్రులు" మేజర్ బాలరంగయ్య"గారు  ఎ ఎఫ్ ఎమ్ సి లో ఈ ఆపరేషన్ అవ్వచ్చు ప్రయత్నిద్దాం  పిలిపించండి. అన్న కబురు మళ్లి ఆశలకు ప్రాణంపోసినట్లయింది. వెంటనె వఛ్చారు.

               ఆ తరువాత మేజర్ బాలరంగయ్యగారు తనకి సంబందించిన మనిషిగా  హాస్పిటల్ లో చేర్చి కల్నల్ సిన్హా గారి ద్వారా ఆపరేషను విజయవంతముగా చేయించారు.మొత్తం 5నెలలు పట్టింది. అడ్మిట్ అయిన తరువాత ఓ మూడు వారాలు బాగా బలమయిన మందులు ,ఇంజక్షనులు యిచ్చి పండ్లు, పాలతో ఓ  ఎనిమిది కిలోల బరువు పెరిగిన తరువాత మొదటి ఆపరేషన్ చేసారు.ఓ పది రోజుల తరువాత డిశ్చార్జి చేసి  ఇంటికి పంపారు.జాగర్తగా చూసుకొమ్మని ఇన్ఫెక్షన్ కాకుండా వుండాలని చెప్పి రెండో ఆపరేషనుకి  నెల తరువాత రమ్మని చెప్పారు. నాన్నగారు స్కూల్ టీచర్ కదా శలవులు వుండవుగా అందుకని ఇక్కడ దింపిన వారానికే  తిరిగి వెళ్ళిపోయారు.అమ్మకి వచ్చేందుకులేదు ఇంట్లొ ముగ్గురుచెళ్ళెళ్లు.  అదీ కాక తనకి శలవు లేదు. ఆప్పటికే మాఅమ్మమ్మగారు కార్తీక పున్నమి రోజున పసుపు కుంకమలతో మా తాతగారి వడిలోనే  మా అందరిని వదలి వెళ్ళిపోయారు.

                అప్పుడు చూసుకోండి మా తిప్పలు. ఏడాది దాటిన పాపతొ సరిగ్గా భాష రాని నేను కలాస్ అనే ఏరియా నుండి విశ్రాంతివాడి వరకు నడచివచ్చి ఆక్కడ బస్ ఎక్కి పూనా స్టేషన్ దగ్గర దిగి కొండువా బస్ ఎక్కి కమాండ్ హాస్పిటల్ దగ్గర దిగివెళ్లవలసివచ్చేది.తను రోజు విడచి రోజూ వెళ్లివచ్చేవారు. ఆ తరువాత రెండో ఆపరేషనికి జాయిన్ చేసినతరువాత వారానికి అయింది , ఈ సారి తినేందుకు ఏమీ లేదు. అన్ని ద్రవపధార్దేలేను. ఇంచుమించుగా నెలరోజులుఆంతేను. ఈలోపులొ స్పీచ్ తెరెపి. వారి యిద్దరి మంచిమనసులు తో చేసిన సహాయం చెల్లెలికి చక్కని జీవితం దీనికి అయిన ఖర్చు ఏమీలేదు.

              ఈ రోజుకి ఆమేజర్ గారికి కల్నల్ గారికి మంచి జరగాలని రోజూ పూజలు చేస్తుంది. జన్మనిచ్చింది అమ్మనాన్నగార్లయితే పునర్జన్మ నిచ్చింది అక్కబావగార్లని అంటుంది. ఆ రోజుల్లొ ఏ హంగు ఆర్బాటం లేని  స్మైల్ పింకి కధ.          

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

కదిలించారు. మరేమీ చెప్పలేను.

పరిమళం చెప్పారు...

సూర్య లక్ష్మిగారు , కళ్లు చెమర్చాయండీ ...ఒక ఆడపిల్లకు అటువంటి లోపం సమాజంలో ఎటువంటి అవహేళనలకు గురి చేస్తుందో అర్ధం చేసుకోగలను .అయినా 10 వ తరగతి వరకూ చదువుకున్న ఆమె మానసిక స్థైర్యానికి అభినందనలు .అదే ఆమెకి మంచి జీవితాన్నిచ్చింది . మీవారూ అభినందనీయులే ...భార్య తరుపు వాళ్ళని తనవారుగా అనుకునే వారు అరుదుగా ఉంటారు .

asha చెప్పారు...

సమస్య బాధపెట్టినా,తీరిపోయినందుకు సంతోషమనిపించింది.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అరుణ, పరిమళం, భవానీ ,

ధన్యవాదాలు. సమస్య ఎప్పటిదయినా స్పందించే మనసు ,మానవత్వం అందరిలొ వుండాలి.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes