RSS

మా యాత్రలు

      మా పిల్లలు పంచగని కేంపింగ్ వెళ్లి  వారాంతర శలవలు గడిపి వచ్చారట.  మనవరాళ్లు, మనవడు చాలా ఆనందంగా గడిపారట.  మాఅమ్మాయి చిన్నప్పుడు తన స్నేహితులు ఈ టూర్ కి వెళ్ళామ్ అక్కడకి వెళ్లాం ఆంటే  అన్నిచోట్ల వాళ్ల చుట్టాలుండి  వెళ్ళారనికొనేది. పాపం. ఎందుకంటె మావారు మమ్మల్ని అమ్మమ్మగరింటికి మామ్మగారింటికే తీసుకువెళ్లెవారు ఇంతలొ ఆయన శలవు అయిపోయేది.అదీ ల్.టి.సి మీద. 4 సంవత్సరాలకు తిరుపతి వెళ్లెవాళ్లం. ఆంతే. ఆదే తెలుసు వాళ్లకి. పతే పరమేశ్వర్ అంటానని తనచుట్టూ  తిరిగితే చాలనుకునేవారనుకుంటాను ఏమిటొ ఎక్కడకు వెళ్లడంలొ ఇష్టత వుండేదికాదు. పెళ్లి అయిన కొత్తలొ ఎక్కడకయిన వెడదామాంటే  ప్రేమ యాత్రలకు  బృందావనము ,కాశ్మీరాలు ఏలనొ ( గుండమ్మ కధ) పాట రికార్డు పెట్టేసేవారు,   ఆ తరువాత ఓ పత్రికలో  పరిమళా సోమేశ్వర్ గారి పిల్లలతో ప్రేమయాత్ర  అనే సీరియల్ వచ్చింది  అది చూపించి వెడదామంటే అ కధ ఇంకొ సారి చదువుకొమ్మనేవారు. పిల్లలు మాత్రం స్కూల్  ద్వారా నాగపూర్ , నాసిక్ , దేవఘడ్, పూణె  సి.సి.ఎ  ప్రోగ్రాములకు వెళ్ళి వచ్చారు. మేము అప్పుడు భుసావల్ దగ్గర వరణ్ గావ్ లొ వుండేవాళ్లం. కాలేజి చదువులు పూనాలొ చదివారు.  మా స్నేహితులు ఓ సారి సౌత్ టూరని మరో సారి నార్త్ టూరని అల్లాగే దగ్గరగా వున్న అజంతా ఎల్లోరా షిరిడి  అవీ చూసివచ్చేవారు, అందులో అజంతా ఒకటి కొంతమందితో వెళ్లివచ్చాం. ఆ తరువాత అమ్మాయి పెళ్లి. ఆ సందర్బంలొ ఢిల్లి వెళ్లాం. శనివారం పొద్దునే  ఢిల్లి లొ దిగాం సాయంత్రం వియ్యాలవారితొ మాటలు,రాత్రికి ( మాపెద్దత్తగారి అబ్బాయి ) బావ గారింట్లొ వుండి ఆదివాం సాయంత్రం తిరుగు ప్రయాణం.  ఆదివారం బావగారు  ప్రొద్దుటే  వాళ్ళ ఏరియా మయూర్ విహార్,రెడ్ ఫోర్ట్,  ప్రగతి మైదాన్, అవీ అలా కారులొనే చూపించి పంపించారు. అందులొ ఈయన ప్రమేయం లేదు కనుక  సరిపోయింది .తను అవి అన్నీఆఫీసు పనిమీద వెళ్లినపుడు ఛూసివచ్చారు.   రెడ్ ఫొర్ట్ చూసి చాలా గర్వపడ్దాను.  అమ్మాయి ఉద్దోగరీత్య బెంగుళూర్ ,ముంబాయి, అ తరువాత ఢిల్లి  అన్ని చూసాననుకోండి.  నాకు తిరగడం అన్ని ప్రదేశాలు చూడ్దం ఎంత యిష్టమో తనకి ఇంట్లో ఆంత ఆనందం. అందుకని మా పిల్లలు  అల్లుడు కాబోయె కోడలు తన షష్టిపూర్తి కి తిరుపతిలొ స్వామి వారి కళ్యాణం ఆ తరువాత తమిళనాడు టూరిజం వారి  పది రోజుల ట్రిప్ ఏర్పాటు చేసారు.  మేము ఓ రెండు రోజులు ముందర తిరుపతి వెళ్లి  ఎ.పి ఆర్.టి.సి వాళ్ల బస్ లొతిరుచానురు, శ్రీనివాసమంగాపురం,కాణిపాకం ,కపిలతీర్ధం చూసుకొని వచ్చేసరికి  పూనా నుండి  మా అల్లుడు, అమ్మాయి ,మనవరాలు, మనవడు , అబ్బాయి చెన్నాయి   ప్లేన్ లొవచ్చి  సిటిబ్యాంకులొ పని చేస్తూన్న కాబోయే కోడల్ని తీసికొని తిరుపతి వఛ్చేసారు. ఆందరం కలిసి పైకి వెళ్లి మరునాడు ఉదయం అభిషేక ఆనంతర అర్చన కళ్యాణం చేసుకొని కిందకి వచ్చేసాం   ఆ తరువాత అందరం చెన్నాయ్ వెళ్లామ్.పిల్లలు పూనా వెళ్లిపోయారు.  మేము ఆరోజుకి అక్కడే సిటిలొ పార్ధసారధి గుడి ,అష్టలక్ష్మిగుడి, కపాలేశ్వరమందిరమ్ చూసి హూటేల్ కివెళ్లేసరికి మాకొడలు ఆఫీసునుండి వచ్చి మాతోనే వుండి పొద్దునే మమ్మల్ని టి.టి. బస్ ఎక్కించి వెళ్లింది. ఇక మా యాత్ర మొదలు అయింది. నాకు చాలా ఆశ్చర్యం అన్పించింది. నేనా ఈయనతో యాత్రా, మేము నిజంగా వెడుతున్నామా, ఏ దేవుడి కరుణో ఇది,ఇంత భాగ్యామా నాకు.పరిసరాలు చూసుకుంటూచుట్టుపక్కల దృశ్యాలు  తిలకిస్తూ చాలా ఆనందంగా శ్రీపెరుంబుదూర్ నుండి కంచి, మహబలిపురమ్,పాండిచ్చేరి, చిదంబరం, వైదీశ్వరన్ మందిరమ్,నాగపట్టణం,మన్నార్, తంజావూర్,రామేశ్వరమ్, కన్య్యాకుమారి,శుచీంద్రం,మధుర,కొడైకెనాల్,తిరుచ్చి,చూసుకొని 25వ తేది డిశంబర్ సాయంత్రం చెన్నాయ్ చేరుకున్నాం. మాకోడలు బస్ దగ్గరకు వచ్చి మమ్మల్ని కలిసింది అందరం హుటల్ కి వెళ్లాం.మా యాత్రావిశేషాలు చెబుతూ  మేమిద్దరం ఇలా మొదటిసారి ఇలా వెళ్లడం,ఏం జరుగుతుందో, --- అంతే ఆరాత్రే వచ్చేసిందండి బాబూ   సునామి !! .

4 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

'పిల్లలతో ప్రేమయాత్ర' నేనూ చదివానండి ఈ సీరియల్.. బాగుంది మీ టపా.. ముఖ్యంగా ముగింపు...

cbrao చెప్పారు...

షష్టిపూర్తికి ప్రేమయాత్రలకు వెళ్తే సునామి రాకుండా ఎట్లా వుంటుంది? పతి పరమేశ్వరుడైతే, ఇల్లు వైకుంఠం ఎలా అవుతుంది? శివుడు వుండేది వైకుంఠమని ఎవరు చెప్పారు?

మీ యాత్రానుభవం బాగుంది.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మురళి గారూ,
Thanks.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

cbrao
మళ్ళీ ప్రపంచ శాంతి దృష్ట్యా మా వారు యాత్ర్లలు చేయడం మానుకున్నారు.. మీరు అన్నది కరెక్టే. కానీ మా ఇంట్లో ఉండేది పరమ శివుడే. ఎలా అన్వయించుకొన్నా మీ ఇష్టం.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes