RSS

ఓ పాప

                   గౌతమి నందనంలొ (పార్కు) గోదావరి అలల చిరు సవ్వడి లొ పగలంతా ఎండ వేడికి మాడిపోయిన మమ్మల్ని చల్లని గాలితో పలకరించిన గోదావరి ని చూస్తూ కాసేపటికి తేరుకున్నాం. వేణుగోపాలస్వామిని, అష్టలక్ష్మి ని దర్శించుకొని  ప్రసాదం తీసుకొని చిన్నపిల్లలాగ (సాతాళించిన శనగలు )  ఒక్కోటి తింటూంటే మనసు ఎక్కడికొ ----

                   ఓ గౌను, రెండు జడలు తో అమ్మా ,పార్కు వెడుతున్నా, గట్టిగా చెప్పి అమ్మ దగ్గర తీసుకున్న అర్ధణాని జాగర్తగాపట్టుకొని శారదా ధియేటర్ కేంటినులో  మెత్తని పకోడిలు తిని పార్కులో ఆడుకోవడం ఓ పని,

                   మెత్తని లానులో నడచి, జారుడుబల్ల మీద జారి, పాటలు వింటూ , మాలి జిమ్మిన  నీళ్ల తో తడిసిన మొక్కల్ని పలకరిస్తూ , ఫౌంటెన్లు చూస్తూ  ,రోజూవచ్చే పిల్లలని పలకరించం ఓ పని,

                  పార్కు మూసే టైము కి గబగబా మళ్ళి అంతా ఓ రౌండు తిరిగి మాలిని అడిగి ఓ రెండు గలాబి పూలు తీసుకొని  , మళ్ళి రేపు వస్తాను  పరుగే పరుగుతో ఆయాసపడుతూ పూలు అమ్మకివ్వడం ఓ పని,

                  ఇంత ఆలస్యంగానా రావడం, ఇలా అయితే రేపట్నుంచి వెళ్లద్దు అంతే తెలిసిందా మరి,అమ్మ కోప్పడ్డం, సరేనని చెప్పి కాళ్లు చేతులు కడుక్కోని బుద్దిగా అన్నం తినేసి చదువుకొని నిద్ర పోవడం ఓ పని,

                  మరునాడు సాయంత్రం ఇంటికి పక్కనే మునిసిపల్ ఆఫీసు  లొ చాలా పెద్దతోట వుండేది అందులొ ఓ ఫౌంటెను మద్యలొ శివుడు  ధ్యానం చేస్తూ,అమ్మతొ చెప్పి దణ్ణ్ మ్ పెట్టుకోవడమ్ ఓ పని, మరి అమ్మయిచ్చిన పైస ( రాగి ది) జాగర్తగా  పట్టుకొని శివుడి చేతిలో పడేటట్లుగా వెయ్యడం,చేతిలొ పడితే అమ్మ కోప్పడదు, ఆలస్యంగా వెళ్లచ్చు,లేకపోతే తొందరగా వెళ్లాలి. కాడమల్లెపూలు ఏరి దారం లేకుండా జడ అల్లినట్లుగా దండచేసి  శివుడు మెడలో వెయ్యడం,  దీపాలు వెలిగిన తరువాత అయ్యబాబొయ్ చీకటి పడిపోయింది,గబగబా యింటికి పరుగు,

                 రోజూ యింత ఆలస్యం అయి తే ఎలాగమ్మా, నాన్నగారు ఊళ్ళొ లేరుకదా మరి   నేను ఒక్కతిని వుండాలి నాకు భయం వేస్తూంది కదా చెప్పు, అమ్మ నచ్చచెప్పడం ,నిజమేగా మరి ,పాపం ఒక్కత్తి వుండాలంటే భయమేను,

                 మరునాడుసాయంత్రం దొడ్లొ వున్న బొగడి చెట్టు కింద  పూలు ఏరి అరటి తడపతో దండలు కట్టి అనీ దేముడి ఫొటొలకు వేసి అరుగు మేదే కూర్చుంటే అమ్మవచ్చి రేపు పార్కుకి వెడతావా? వెళ్ళు కాని తొందరగా వచ్చేయ్ తెలిసిందా----

                    50 సంవత్సరాల కిందటి సంగతి, ఆ పాపని నేనే.

8 కామెంట్‌లు:

జీడిపప్పు చెప్పారు...

చాలా చక్కగా చెప్పారు. చదువుతూ కళ్ళముందు సాక్షాత్కరింపచేసుకుంటుంటే Life is beautiful అనిపిస్తోంది!

మురళి చెప్పారు...

అబ్బ! ఎంత బాగా రాశారండీ..

అజ్ఞాత చెప్పారు...

శారదా టాకీసు, పక్కన పార్కు..

ఏ ఊరండి మీది?

నేస్తం చెప్పారు...

చాలా హాయిగా అనిపించింది చదువుతూ ఉంటే

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

జీడిపప్పు ,మురళి,నేస్తం గార్లకు

thanks.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

బొనగిరి గారు,

నరసాపురం, (ప.గొ.జి)

అజ్ఞాత చెప్పారు...

లక్ష్మి గారూ, అయితే మా వూరేనన్నమాట. అనుకున్నాను.
ప్లీజ్.. మీ బాల్యం, అప్పటి నరసాపురం గురించి మరి కొన్ని టపాలు వ్రాయరూ.
మీ బ్లాగ్ ఎడ్రస్ నా ఫేవరిట్స్ లో పెట్టేసుకున్నా..

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

బోనగిరి గారూ
Thanks.ఇప్పడికీ ఉన్నాయా అవి?

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes