తాళి కట్టినవాడు కాటికెళ్ళాడు
కడుపున పుట్టినవాడు కఠినుడయ్యాడు
ఆలి మాట జవదాటక అరుగయినా దిగాడు కాదు
గడువు టైము కాకుండా మా గుమ్మమెట్లుక్కుతావు?
గండు పిల్లిలా గాండ్రిచె చిన్నకోడలూ---
నేనేమి చేతునంటూ చేతులెత్తిన చిన్నోడు--
మధ్యాహ్న మార్తాండ మహిమ చూపేవేళ
అస్తవ్యస్తంగా చిన్న బట్టల మూట తో
ఆవేదనతో ఆక్రోశిస్తోంది---ఆ అవ్వ
ఆపు ఆపంటూ ఆటో వాడిని ఆపి
ఆయాసపడుతూ ఆత్రుతగా-- ఆ అవ్వని
అమ్మా! అంటూ అక్కున జేర్చుకుంది ---ఓ అతివ
కూతురి కౌగిట్లొ గువ్వలా వదిగిపోతూ
అల్లుడికి తెలిసే వచ్చావా? అని
అడుగుతున్న అవ్వలో అమ్మ తనం
అర విరిసింది.
మా వారు పోస్టాఫీస్ నుంచి వస్తూ చూసిన సంఘటన చెప్పగా దానికి నా అక్షరరూపం.
2 కామెంట్‌లు:
చాలా బావుందండి..
అమ్మ కదండీ !
కామెంట్‌ను పోస్ట్ చేయండి