చాలా రొజుల తరువాత అత్మీయులని చూస్తే ఎంత ఆనందంగా వుంటుందొ మన యిల్లు చూసినా ఇంట్లొ వస్తువులను చూసినా అదే అనుభూతి కలుగుతుందనుకుంటాను.ఇంట్లొ ఏ మూల చూసినా ఏ వస్తువు చూసినా నన్ను పలకరిస్తున్నట్లేవుంది ముఖ్యంగా నా పుస్తకాలు అలమారా దగ్గరకు వెడితే ఇన్ని రొజులు మా ఆలన పాలన చూసినదే లేదు.చలనం లేకుండా ఇలాగే వున్నాము. నువ్వు వుంటె మమ్మల్ని హాల్లోకి, బాల్కనిలోకి, మంచం మీదకి తిప్పెదానివికదామరి,కనీసం మమ్మల్ని పలకరించెవాళ్లయినాలేరుకదా అని ఆరొపిస్తుంటె , సర్దిచెప్పి అన్నిటిని చేతితొ తాకి అల్ల అంటే ఎలాగమ్మా మిమ్మల్ని వదలి నేను మాత్రం వుండగలనా మెల్లిమెల్లిగా అందరిని తీసుకువెడతానుకదమ్మా,గోదావరి గాలి, గోదావరి గలగలలు వినిపిస్తాకదా అలా మారాం చేయొచ్చా తప్పుకదూ,అంటూ ఒక్కక్కరినే పలకరిస్తూ ఓ నాలుగు రోజులు గడిపిన తరువాత మిగిలినవి చూసాను.
ఇంక నా సామ్రాజ్యం వంటిల్లు చూస్తే నన్ను మరచి మా కొడలు చేతిలో వన్నె చెన్నెలు బాగానె నేర్చుకుంది.పాతవి కొన్ని కనుమరుగయి కొత్త కొత్త అందాలతో కనువిందు చేస్తూ బాగానే కులుకుతోంది. మా గ్యాస్ స్టవ్ కొత్తగిన్నెలతో కొత్త వంటలతొ ములిగితేలుతూ మురిపిస్తోంది.మా వంటావిడ లతగారి వంటలతొ ఉక్కిరిబిక్కిరయి చూసావా ఒక్క క్షణం తీరిక లేకుండా నీవారినందరిని,జాగర్తగా కనిపెట్టుకొని కడుపు నింపుతున్నాను సంతోషమెకదా అంటూ పలకరించేసింది. పనిలొపని పక్కనే వున్న మైక్రోఓవెన్ కూడా హాయ్ అంటూ విష్ చేసెసింది. హలో ఎలా వున్నావూ అని మా చిట్ పార్టిలో మొదటిసారి డబ్బులు వచ్చినపుడు10 సంవత్సరాలక్రితం మా యింటికి వచ్చింది. అప్పటినుండి కొత్త రుచులతొ మమ్మల్ని అలరిస్తోంది.కోలిన్ తో దాన్ని నిగనిగలాడించి పక్కకి చూస్తే నన్నోమరి అంటూ నాఎత్తునవున్న ఫ్రిజ్ పలకరించింది,దాన్ని కూడా అప్యాయంగా మిలమిల మెరిసిపోయెలాగా తళ తళ లాడించేసాను. ఇంతలొ మళ్ళి ఎవరా మాటలని హాల్లోకి వెడితె సొఫాలు దీవాను షోకెసులొ పుస్తకాలు, ఏమిటొ అన్ని నాతొ చక్కగా మాట్లాడతాయి.ఈరొజుదా, నిన్నటిదా మా అనుబందం.తీపి గుర్తులు చేదు జ్ఞాపకాలు అన్ని కలసి అనుభవించాము.
పాపం మొక్కలు మాత్రం ఈ ఎండలకి కొన్ని ఎండిపొయాయి.చాలా బాద నిపించింది. కాని నన్ను ఓదార్చినట్లుగా రెండు రోజులక్రితం కురిసిన వానకి చిన్నచిన్న అకులతొ ఈ రోజుప్రేమగా పలకరించి సంతొషాన్ని కలగచేసాయి.
మా స్నేహితులు నన్ను చూసి బాగా చిక్కారే అంటూ పలకరించేసరికి పరవాలేదు నాడైటింగ్ పనిచేసిందనుకున్నాను.అత్మీయుల పలకరింతలతొ పులకరించి పొతున్నాను.వీటిని జడ పదార్ధాలని ఎవరనగలరు--తలుపులూ, గోడలూ, ప్రతీ మూలా అన్నీ నాతో మాట్లాడుతాయి.
2 కామెంట్‌లు:
mee blog...look and feel marchara?
bagumdi :-)
ఓ స్నేహితురాలి సహకారంతో ఈ మార్పులు చేశాను. మీకు నచ్చినందుకు చాలా సంతోషం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి