పూణె దగ్గర అళంది అనె గ్రామంనుండి శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ గారి పాల్కి, పాదుకలు పల్లకిలొ పెట్టి కాలినడకన కావి రంగు జండాలు చేతబట్టి అతి భక్తిశ్రద్దలతొ ఆషాడ ఏకాదశి కి పండరిపూర్ తీసుకువళ్ళడమనేది మహారాష్ట్రీయుల భక్తి సాంప్రదాయనికి ప్రతీక. ఇలా వెళ్ళె భక్తులను "వార్కరీ" లని అంటారు.
శ్రీజ్ఞానేశ్వర్ విఠోబా,రుక్మిబాయిల పుత్రుడు. ఈయన సోదరులు నివృత్తినాధుడు, సొపాన దేవుడు, సొదరి ముక్తాబాయి. ఈ సొదరులను త్రిమూర్తిస్వరూపులుగాను, ముక్తాబాయిని ఆదిశక్తి రూపముగాను భావిస్తారు.
వైరాగ్యం చెందిన విథొబా భార్య నిద్రావస్తలొ వుండగా సన్యాసిగా మారేందుకు సమ్మతి తీసుకొని కాశీ వెళ్ళి సన్న్యాసదీక్ష తీసికొన్నారు. జరిగినది తెలుసుకున్న రుక్మా అశ్వత్ఠనారయణస్వామి అనుష్ఠానము ప్రారంభిచగా దీక్క్షనిచ్చిన శ్రీ పాదస్వామి సన్య్యాసము విడచి గృహస్తాశ్రమము స్వీకరించమని అదిశక్తి అంశగా కుమార్తె, త్రిమూర్తుల అంశగా ముగ్గురు కుమారులు కలిగెదరని ఆశేర్వదించగా అల్లగె కలిగిరి.
సన్యాసి సంతానమని ఊరివారందరు హేళనగా గేలిచేసెవారు. ఇది చూసి తల్లితండ్రులు బాధపడి ప్రాయశ్చిత్తాం చేసుకొందుకు ప్రయత్నించి విఫలమయి ప్రయాగలొ బిడ్డలను అనాధలుగాచేసి దేహత్యాగం చేసుకన్నారు. ఉపనయన సంస్కారములకై ప్రాయశ్చిత్తం కొరకు పిల్లలు ప్రయత్నించగా అక్కడి బ్రాహ్మణులు పైఠాన్ పురమ్ వెళ్ళి ధర్మాధికారుల వద్దనుండి అంగేకారపత్రం తెచ్చుకొమ్మనిచెప్పగా వారక్కడికి పోయి వారి నామములు తెలిపి వారిని ప్రార్ధింపగా వారు "సర్వభూతములు ఈశ్వర రూపమే"మీరు ఇలాగే బ్రహ్మచర్యం లొ వుండవచ్చునని పలికిరి. ముక్తాబాయి మనమనసులొమాటనే వారు చెప్పినది అని సొదరులతో అనగానే ఒకతను ఎగతాళిగా వారి నామార్ధములను తెలుసుకొని అటుగా పొతున్న ఓ దున్నపొతుని చూపి " ఆ దున్నపొతుకు జ్ఞానేస్వర్ పెరు పెట్టాననగానె" ఆత్మ సర్వభూతములందు వుండునని నాకు ఆదున్నపొతుకు తేడాలేదని చెప్పగా అతను తేడా లేదా, సరే అయితేదానితొ వేదాలు పలికించమనగా, జ్ఞానేశ్వర్ ఆదున్నపొతు తలమీద చెయ్యివేసి " ఓ మహిషేశ్వరా,వీరు నీ నోటినుండి వేదాలను వినాలని కొరుతున్నారు వినిపించమనగా "రాగయుక్తంగాచతుర్వేదాలు చదివెసరికి," అక్కడివారు వీరి అలౌకిక సామర్ధ్యానికి అచ్చెరువు పొంది ఇంతటి మహానుభావులకు ఆజ్ఞాపత్రాన్నియిచ్చెందుకు వారికి అర్హత లేదని యధేచ్చగా వుండమని ఆశీర్వదించి తమ తప్పు తెలుసుకొని భగవంతుని వేడుకున్నారు.
ఓసారి వారి యింట పితృకార్యమునకు బ్రాహ్మలు ఎవరు ముందుకురాకపొతే, మంత్రాక్షతలు జల్లి పితృదేవతలను ఆహ్వానించగా వారు స్వయంగా వచ్చి ఆతిధ్యంస్వీకరించి వెళ్ళారు.అంతటి శక్తిమంతుడు. సొదరుడు నివృత్తినాధుడు మరాటి భాషలొ భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాయమని ఆజ్ఞాపించగా జ్ఞానేశ్వరి గ్రంధమును రచించారు."అమృతానుభవ" మని స్వీయరచనను చేసారు.అరువది అయిదు ఓవిలతో నిగూఢ వేదాంతసారాన్ని సామాన్య భాషలొ వ్రాసారు. శ్రీజ్ఞానేశ్వర్ మహాజ్ఞాని,యోగి,కవి,సహృదయుడు,వేదాంతవ్యాఖ్యానాలలొ దిట్ట. హరినామసంకీర్తనలు చేస్తూ ఆషాడఏకాదశికి పండరినాధుని దర్శించుకునెవారు.
కార్తీకమాసములొ ఆలంది గ్రామంలొ ఏకాదశినాడు ధార్మికొపన్యాసముచేసి,ద్వాదశినాడు పారాయణచేసి, త్రయోదశినాడు సమాధి పొందారు.
అప్పటినుండి అతి భక్తిశ్రధ్దలతొ ఆయన పాల్కిని కాలినడకతొ ఆళందినుండి వార్కి అనే గ్రామంవరకూ వీరు వెళ్ళగా అక్కడినుండి స్వయంగా పండరినాధుడే వచ్చి వీరిని పండరిపూర్ తీసుకువెడతారు.
ఈ వార్కరిలకు దారి పొడవున అన్ని సదుపాయాలతొ గౌరవిస్తారు ప్రభుత్వసంస్థలు, ప్రవేటు సంస్థలు మంచినీరు ఆహార సదుపాయాలుకలిగించడం వారి పూర్వజన్మసుకృతమని భావిస్తారు.
(వార్కరి చిత్ర కళకూడా వుంది.పైఠాని చీరలకు ఈ పైఠానీపురమే ప్రసిద్ధి.
ఆషాఢీ ( ఆషాడ ఏకాదశి )
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 3, జులై 2009, శుక్రవారం
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి