5. కేరట్ హల్వా;
కేరట్లు అరకిలొ ( తురిమినది)
11/2 కప్పు(ఒకటిన్నర కప్పు) పాలు
1/2 కప్పు పంచదార పొడి
100 గ్రామ్స్ కోయా( తురిమినది)
1 టెబిల్ స్పూన్ నెయ్యి
కొద్దిగా బాదామ్ పలుకులు, కిస్మిస్.
ఇది కూడా మైక్రొవేవ్ లోనె చేస్తాను.ఒక లోతుగావున్న గ్లాస్ గిన్నెలో తురిమిన కేరట్లు పాలు కలిపి హై లో మూతలేకుండా 15 నిమిషాలు వుంచి మధ్యలో కలుపుతూ వుండాలి.
తరువాత పంచదార పొడి, కొయా కలిపి హై లొనె మూత లేకుండా మరొ పది నిమిషాలువుంచి నెయ్యికలిపి, మరొ పదినిమిషాలు వుంచిబాదాము, కిస్మిస్ కలపాలి.అవసరమయితే ఓ రెండు నిమిషాలు మైక్రోవెవ్ టైము అడ్జస్ట్ చేసికోవాలి.
6 మైసూరు పాక్;
పంచదార 2 కప్పులు
శనగపిండి 1 కప్పు
నెయ్యి 2 కప్పులు
నీరు 1/2 కప్పు
ఒక చంచా నెయ్యి వేసి కమ్మని వాసన వచ్చేవరకూ శనగపిండి వేయించాలి. కడాయిలొ పంచదార నీరు పోసి కరిగాక శనగపిండిని కొద్దికొద్దిగా పోస్తూ కలియబెట్టాలికొద్దికొద్దిగా నెయ్యి మొత్తంపోయ్యాలి.కలుపుతూనే వుండాలి దగ్గరపడ్డాక (పిండి దగ్గరపడి నెయ్యి తేలిన తరువాత) నెయ్యి రాసిన పళ్ళెంలొ వేసి ఓ నిమిషాగి డైమండు ఆకారంలో చాకు తొ కోసుకోవాలి.
7 బేసిన్ లడ్డు:
శనగపిండి 2 కప్పులు
పంచదార 1 1/2 కప్పుపొడి( ఒకటిన్నర కప్పు )
నెయ్యి 1 కప్పు
యాలకులపొడి
కడాయి లో నేతి లో శనగపిండి కమ్మని వాసన వచ్చేవరకూ వేయించి కొద్దిగా చల్లరిన తరువాత పంచదార పొడి యాలకులుపొడి వేసి కావలసిన సైజు లో ఉండలుగా చేసుకోవాలి.
8 రవ్వ లడ్దు:
గోధుమ రవ్వ 1 కప్పు
పంచదార 1/3 కప్పు( ముప్పావు కప్పు)
నెయ్యి 2 టేబిల్ స్పూన్స్
పాలు 1 కప్పు
కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా యాలకుల పొడి.
కడాయి లో నెయ్యి వేసి రవ్వ వేయించుకొవాలి. రవ్వ స్టౌవ్ మీద వుండాగానె పంచదార వేసి ఓ మూడు నిమిషాలు వేయించాలి( మాడాకుండా చూసుకోవాలి) రవ్వ పంచదార మిశ్రమం చల్లారిన తరువాత జీడిపప్పు , యాలకులపొడి కలిపి లడ్డూలాగా చేసుకొవాలి.
9 గులాబ్ జామున్;
గిట్సు వారి రడిమేడ్ పేకెట్ తెచ్చి చేసేస్తాను. దాని విధానం దాని మీదే వ్రాసి వుంటుంది.
ఇవండీ ,మా యింట్లొ వరలక్ష్మి పూజకి చేసె ప్రసాదాలు. ఈ బ్లాగు ముఖ్యంగా మా అమ్మాయి, మా కోడలు కోసమని వ్రాసాను.పూజా విధానం ఒకరికి పుస్తకం, ఒకరికి కేసెట్ ఇచ్చెవచ్చాను. వీలునిబట్టి కలిసి చేసుకొవచ్చును, లేక విడిగా చేసుకోవచ్చును.ఉద్యోగస్తులుకదండి, వాళ్ళ ఆఫీసు కాల్స్ ని , పిల్లల స్కూల్ టైమింగ్సు ని చూసుకొని చేసుకుంటారు.నేను ఇక్కడ. వచ్చే సంవత్సరం ముగ్గురం కలసి చేసుకుంటామని ఆశిస్తున్నాను.
మా ఇంట్లో-వరలక్ష్మి పూజ ప్రసాదాలు--రెండో టపా.
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 25, జులై 2009, శనివారం
6 కామెంట్లు:
అయ్యో వాటిల్లో ఎక్కడా పూస మిఠాయి/లడ్డు కనబడలేదు?
Bhamidipati suryalaxmi garu!
i really look forward to your this post!
not for'poruginti pullakoora' but, just curious to know how different your naivedyam is from my moms :)
trust me, its really different :)
i haven't heard of carrot halwa and gulabjamoon for sravana sukravaram naivedyam:)
chesina cheyyakapoyina konchem traditional naivedyalu rayavalasindi!
pulihora, pulagam, payasam,thopatu
boorlu, bajjilu, garelu lanti nijam varalaxmi prasadam raste bavundedi
i understand devudu omnipresent and he/she will have whatever we eat, but emo,.......... nakala anipinchindi...... adi inni rojula nunchi, meeru, uncle rastunna vishyala meeda base aina opinion kavachchu, anyadha bhavinchakandi :)
లక్ష్మిగారు,
మీ ప్రసాదాలు చాలా బావున్నాయి. అదే చేత్తో వాటి ఫోటోలు కూడా పెట్టేద్దురూ. :)
పానిపూరి123 గారికి
పూసమిఠాయి, బెల్లంమిఠాయి,బొబ్బట్లు, అరిసెలు, యిలాంటి వాటికి నేను చాలా దూరమండి.తినేందుకు, చేసేందుకు కూడా.
అస్మిత,
పెళ్ళయిన కొత్తలొ సాంప్రదాయకమయిన నైవేద్యాలే చేసేదాన్ని.ఆ తరువాత పిల్లల అభిరుచులు, స్కూల్ టైమింగ్స్ ని బట్టి వాళ్ళకి కావలసినవే చేసేదాన్ని.ఇవన్ని మనకేను. వరలక్ష్మి దేవికి మనం చూపవలసినది భక్తి భావం, శ్రద్ధ. ఏమంటారు?
జ్యోతి
సలహా గుర్తుంచుకుంటాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి