RSS

వర లక్ష్మి వ్రతం---మూడవ టపా

    ఇదివరకు ఓ ఆవిడ రోజు ఉదయమె లేచి పొయ్యి వెలిగించి నిప్పు రాజేసెదట. దాన్నించి పక్కావిడ, ఆ పక్కావిడా, అలా అలా ఊరంతా నిప్పు తీసుకొని పొయ్యిలు వెలిగించెవారట.( ఆప్పట్లొ పొయ్యి వెలిగించడం ఓ పెద్దపని.)ఓ రోజు నేనె ఎందుకు వెలిగించాలీ? అని మానేసిందట.ఏమవుతుంది, ఆవిడ కాకపొతే ఇంకొకరు,పని ఆగదుకదా? అలాగా నాకు ఎందుకు చెప్పండి?నేను మా పిల్లల దగ్గర లేను కదా,వాళ్లు ఎలాగొ పూజ చేసుకుంటారు, అయినా నాకు బెంగ, టెన్షన్.ఎలా చేసుకుంటారొ అని, అందుకని ఏదో ఒకటి చెప్పాలనిపిస్తుంది.చెప్పేసాననుకోండి, నాకు నిద్ర పడుతుంది.అందుకని-----

    మా పిల్లలకేకాకుండా అత్తలు, అమ్మలు, దగ్గరలేకుండా, ఉద్యోగరీత్యా దూరంగా వుండే అమ్మాయిలందరికీను----

పూజ విధానంతెలిసినవారయితే తెలియనివారికి చెప్పండి.నా కయితే ( 18 సంవత్సరాలవయసు) అప్పట్లొ ఎమి తెలియదు. మా అమ్మగారు, మా అమ్మమ్మగారు(అత్తగారు) చెరొ ఉత్తరం రాసేసి మంగళగౌరి , వరలక్ష్మి పూజా చేసేసుకొమ్మన్నారు.ఉత్తరాల్లొ రాసారనుకొండి,ఎలా చేసుకొవాలోను,ఇంక ఆఉత్తరాలు, దేవుడి పుస్తకాలతొ నా కుస్తీ.ఇప్పట్లొలాగా, కెసట్లు, సి.డిలు, ఎమీ లేవుకదా మరి. అయ్యొ రామా, ఏదో వ్రాయ బోయి ఏదో వ్రాస్తున్నాను. ట్రాక్ తప్పుతున్నాను. సారీ--

    మీరు ఏ ప్రసాదాలు చేయాలని అనుకున్నారొ ఆలోచించుకొని ముందు రోజే రాత్రి ఒక్కొక్క పళ్లెంలొ కొలతలతొ సైతంగా అన్ని తీసి పెట్టెసుకోండి.పులిహారకయితే బియ్యం , మిరపకాయలు, అల్లం ,కరివేపాకు ,పొపు సామాన్లు అన్ని, నిమ్మకాయలు మొదలయినవి అన్నమాట.(నీళ్ళు ఉదయమే మడి గా తీసుకొవాలి.)అలా తీసే

సుకుంటే బియ్యం డబ్బా తీయడం, ఫ్రిజ్ తీయడం ఇలాంటి శ్రమ వుండదు.అన్ని రడీ గా పెట్టుకుంటే ఒకదాని తరువాత ఒకటి అలా చేసేసుకోవచ్చును. మరి ముఖ్యమయినది ముందురోజే దేవుడిపీట కడుక్కొవాలి. ఆ తరువాత పూజ సామాగ్రి అంతా ఒకచోట పెట్టుకోవాలి.మర్చిపోకుండా, ఇంట్లొ ఎవరయినవుంటె పరవాలేదు లేకపోతే పూజకి కూర్చున్నతరువాత మద్య లొ లేవవలసివస్తుంది.అగ్గిపెట్టె దగ్గరనుండి కొబ్బరికాయ కొట్టే రాయివరకూ--

పూజకి కావలసినవి కూడా ఓ సారి గుర్తు చేసేస్తాను

    పసుపు,కుంకుమ, పూవులు, పండ్లు, తమలపాకులు, అగరవత్తులు,వక్కలు, కర్పూరం, అక్షింతలు,,కొబ్బరికాయలు,ఓ రెండు పళ్లెలు,

కలశచెంబు, రవికల గుడ్డ,(కొంతమంది కొబ్బరికాయకి కళ్ళు, ముక్కు అవీ పెట్టి అలంకరిస్తారు,ఆ ఆచారం వుందా లేదా ఆన్నది మీ పెద్దలని అడిగితెలుసుకొవాలి), పంచపాత్ర, ఉద్దరిణ,కొత్తబట్టలు (చీర, రవికలగుడ్డ) , ఏదయినా ఆభరణం, (లక్ష్మి దేవికి పెట్టి ఆ తరువాత మీరు ధరించవచ్చు)

బియ్యం, కుందులు, వత్తులు, తైలం లేక ఆవునెయ్యి,అగ్గిపెట్టె.

తోరాలకి దారం, తోరాలు మడిగా తొమ్మిది పొరలతో తొమ్మిది ముడులతొ కట్టుకొవాలి. ఒక్కొక్క ముడికి ఒక పువ్వొ, ఆకొ వేసి కట్టుకొవాలి.

పంచామృతానికి, పాలు, ఆవునెయ్యి,పెరుగు,తేనె,పంచదార సిద్దంచేసుకొవాలి.

కలశకి మామిడిఆకులు దొరకకపోతే తమలపాకులు వాడవచ్చునట.


ఇక్కడ నాకు తెలిసిన రెండు లింకులు ఇస్తున్నాను.ఒకటి ఆడియో, రెండోది చూసి చదువుకోవచ్చు. అందరూ భక్తి శ్రధ్ధలతో పూజ చేసుకొండి.

http://www.religiousinfo.org/Music/varalakshmivratham/index.php?autoplay=1



http://www.telugubhakti.com/TELUGUPAGES/Vratas/Varalakshmi/varalakshmi1.htm



మరి ఉంటాను.

10 కామెంట్‌లు:

పరిమళం చెప్పారు...

అచ్చంగా మా అమ్మగారు మీరు చెప్పినట్టే అన్నీ ముందురోజే అమర్చి పెట్టేవారు ...అదే అలవాటు నాకూ వచ్చింది . మీ పోస్ట్ అందరికీ ఉపయోగపడేలా ఉందండీ .

నేస్తం చెప్పారు...

చాలా మంచి విషయం చెప్పారండి

durgeswara చెప్పారు...

ఈసమాచారాన్ని ఇంత చక్కగా ఆసక్తి కరంగా చెబుతున్నారు ,బావుందమ్మా ఇలా సంస్కృతీ సంపదలను పదిమందికి గుర్తుచేసే పని మీరిలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను.

bhavani చెప్పారు...

అత్తయ్యగారు చాలా బాగ చెప్పారండి.
వాడపల్లి సత్య
mssjdbhavani2009.wordpress.com

bhavani చెప్పారు...

అత్తయ్యగారు చాలా బాగ చెప్పారండి.
వాడపల్లి సత్య
mssjdbhavani2009.wordpress.com

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

పరిమళం,

సంతొషమమ్మా!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

నేస్తం,

నచ్చినందుకు ధన్యవాదాలు.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

దుర్గేశ్వర గారూ,

తప్పకుండా ప్రయత్నిస్తాను.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

భవానీ,

నచ్చినందుకు సంతోషం.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మీ అందరి వ్యాఖ్యలకూ 15 నెలలు ఆలశ్యంగా స్పందించినందుకు క్షంతవ్యురాలిని.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes