RSS

మా ఇంట్లో వరలక్ష్మి పూజ--ప్రసాదాలు మొదటి టపా

    అందరు అతి భక్తి శ్రధ్దలతో చేసుకునె వరలక్ష్మి వ్రతమ్ వచ్చేస్తోంది.మరి పూజా విధానం పుస్తకంలొనో, కేసట్ లొనో వుంటుంది.చూసేసుకుని చేసేసుకుంటాము.కాని పూజా వస్తువులు, ప్రసాదాలకు కావలసినవి ,ఈ శనివారం లేక ఆదివారం తెచ్చెసుకోవాలి.ప్లాన్ చేసుకోవాలి. పంజాబి డ్రెస్సులకె పరిమితమయి, చీర కట్టుకోవాలంటెనె ముందుగా ప్లాన్ చేసుకునే రోజులివి.మరి ప్రసాదాలకై అలోచించాలికదా, కొంతమంది 5 రకాలు,మరికొంతమంది 9 రకాలప్రసాదాలతో చేస్తారు.మేము 9రకాలతొ చేస్తాము.ముఖ్యంగా ఉద్యోగాలు చేసె వారికోసమె నేను వ్రాస్తున్నది.ఇంటి మొక్క వైద్యానికి పనికిరాదనట్లుగా , ఇంట్లొవారికంటె బయటవారు చెప్పినది వినసొంపుగా వుంటుంది కొందరికి, అందరికి కాదు.నేను చేసె నైవెద్యాలు వ్రాస్తాను.వీటికి మా ( అమ్మమ్మ)అత్తగారి ఆమోదంకూడా వుంది. (రెండు సంవత్సరాలక్రితం 94సంవత్సరాలవయసులొ స్వర్గస్తులయినారు). అంతవరకూ కూడా 9రకాల ప్రసాదలతొ ఆవిడ చేసుకున్నారు, మా( తాతగారు) మామ గారువున్నంతవరకూ,ఆ తరువాత మా చేత చేయించెవారు, మరీ పాతవి కాకుండా ఈ రోజులనుబట్టి కొత్త మార్పులతొ....... ఈ టపా లో నాలుగు. మిగిలినవి తరువాత టపాలో.....



1. పులగం:

బియ్యం 1 కప్పు

మొలకలెత్తిన పెసలు 1 కప్పు

ఇంగువ 2చంచాలు

పసుపు కొద్దిగా

నెయ్యి 2 చంచాలు

ధనియాపొడి+

జీలగర్ర పొడి 2చంచాలు

పంచదార 2 చంచాలు

కారం 1 చంచా

తురిమిన కొబ్బరి 2 చంచాలు

తరిగిన కొత్తిమీర 2 చంచాలు

తగినంత ఉప్పు.

( చంచా అంటె టెబుల్ స్పూన్)

కడాయి లొ నెయ్యివేసి కొద్దిగా వేడి చేసి ఇంగువపొడి వేసి కడిగిన బియ్యం, పెసలు, పైన చెప్పినవన్ని వేసి రెండున్నర కప్పుల నీళ్ళు పోసి ఓ గిన్నెలొ పొసి కుక్కరు లొ పెట్టి 3 కూతలొచ్చిన తరువాత స్టవ్ కట్టేయండి.



2.పులిహార:

బియ్యం 4కప్పులు

నీళ్ళు 5కప్పులు

పసుపు1 టి స్పూన్

నూనె అరకప్పు

ఆవాలు 1టిస్పూన్

మినపప్పు 1 టేబుల్ స్పూన్

శనగపప్పు 1 టేబుల్ స్పూన్

గుప్పెడు కరివెపాకు

16 పచ్చిమిరపకాయలు( తక్కువయినా పరవాలేదు, కావలసిన కారాన్ని బట్టి)

ఉప్పు 4 టీ స్పూన్లు(కొద్దిగాపైన ఓ చిటికెడు కావాలనుకుంటె)

నిమ్మరసం 1/3+1 టేబుల్ స్పూన్.(కప్పు లో)

కుక్కరు లొ నీళ్లు పోసి మరిగిన తరువాత కడిగిన బియ్యం వేసి పసుపు వేసి సరిగ్గా మూడు కూతలతొ కుక్కరు కట్టి చల్లారనిచ్చి ఓ పళ్ళెంలోకి తీసి పొడి గా చేసుకోవాలి. కడాయి పెట్టి పోపు వేయించి మిరపకాయలు, కరివేపాకు వేసి ఓ రెండు నిమిషాలాగిపళ్ళెంలొని అన్నం మీద వేసి ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి.

(మామూలుగా చేసుకునే పులిహారకి దీనికి కొద్దిగా తేడావుంది కదా|)



3.పాయసం(పరమాన్నం)

బియ్యం1/2 కప్పు

పాలు 6 కప్పులు

1/2 టిన్ను మిల్కు మెయిడ్

10 లేక15 బాదం(నీళ్ళలొ నానబెట్టి తీసినవి)

కొద్దిగా ఏలకులపొడి, కావలంటె కొద్దిగా కేసర్.

మైక్రొవెవ్ హై లొ మూత పెట్టకుండా పాలు బియ్యం కలిపి పది నిమిషాలు పెట్టి మధ్యలొ కలపాలి. తరువాత మిల్క్ మెయిడ్ కేసర్ కలిపిమరొ పది నిమిషాలు మధ్యలొ కలుపుతూ వుండాలి. వుడకకపొతె మరొ 3నుంచి 5 నిమిషాలు పెట్టాలి. తరువాత బాదాం, కిస్మిస్ కలపాలి.

( మామూలుగా కూడా చేసుకొవచ్చు. నేను మైక్రొ లొ చేస్త్తాను, తొందరగా అవాలికదా, వున్నవన్నింటి తొ అస్టావధానం మే, మరి)

4. ఆవడలు:

మినపప్పు 1పావుకిలొ

పెరుగు 3 పావులు

నూనె వేయించెందుకు

పచ్చిమిరపకాయలు

చిన్న అల్లం ముక్క

పోపులొకి;

మినపప్పు

జీలగర్ర

ఆవాలు

కొద్దిగా ఇంగువ

మెంతి గింజలు

కరివెపాకు

కొద్దిగా ఉప్పు.

కమ్మని పెరుగులొ పైన చెప్పినవి కొద్ది నేతిలొ వేయించి చల్లారిన తరువాత కలపాలి. కొద్దిగా పసుపు కూడా వేయాలి( చిటికెడు)

నానబెట్టిన మినపప్పు నీళ్ళు తీసేసి పచ్చిమిరపకాయలు( ఓ పది చాలును. కారాన్ని బట్టి వేసికోవాలి) అల్లం వేసి మిక్సిలొ మెత్తగా చేసుకొవాలి నీరు తగినంత కొద్దిగా,పోసి చేసుకోవాలిపిండి పల్చనయితే వడ రాదు. మరీ గట్టిగా అయితె మిక్సి తిరగదు. జాగర్తగా చేసుకోవాలి.

కడాయి లొ నూనె కాగిన తరువాత కొద్దిగా ఉప్పు చేర్చి న పిండి వడలుగా వేసుకొని ముందు ఓ పాత్రలొ నీరు తీసుకొని అందులొ వడ వేసి రెండు చేతులతొ నొక్కితె నీరు వచ్చెస్తుంది. అప్పుడు వాటిని పెరుగులొ వెయ్యాలి.

2 కామెంట్‌లు:

పరిమళం చెప్పారు...

wowww.....thanks!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

పరిమళం,

ధన్యవాదాలు.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes