RSS

బ్లాగ్వనంలో వన భోజనాలు--జున్ను కాని జున్ను




    ఈ ఫొటొ చూసి ఐసుక్రీమ్ అనుకొంటున్నారా? కాదండీ, జున్ను అంటారా, ఉహూ! జున్ను కాని జున్ను.రుచి చూడండి, చెప్పండి, మరి, ఆలస్యమెందుకు? చలో,

పెరుగు : 1 కప్పు
పాలు : 1 కప్పు
కండెన్సుడు పాలు : 1 టిన్ను( 400 గ్రా)
బాదాం : 8(వేడి నీళ్ళలో ఓ 4నిమిషాలు నానబెట్టి తొక్కతీసి సన్నగా పొడవుగా ముక్కలుగా చేసుకోవాలి)
పిస్తా : 8 గింజలు
కిస్మిస్ :8
కావాలంటె జీడిపప్పు: 6

1. పెరుగు, పాలు, కండెన్సుడుపాలు, బాగా( బ్లెండరుతొ) కలిపి జీడిపప్పు, బాదాం ముక్కలు, పిస్తా, కిస్మిస్ వీసి కలపాలి.
2.ఒక లీటరు పాలు పట్టెగిన్నెలొ వేసి పైన మూత పెట్టాలి.
3. కుక్కరులో నీళ్ళుపోసి ఈ గిన్నె అందులో పెట్టాలి.
4. స్టౌ మీద పెట్టి 3కూతలు రానిచ్చి మంట తగ్గించి ఓ 4నిమిషాలు వుంచి స్టౌ కట్టేసి కుక్కరుని చల్లారనివ్వాలి.
5: వేడి చల్లారిన తరువాత ఫ్రిజ్ లో పెట్టుకొని ముక్కలుగా చేసుకోవాలి.
వనభోజనాల ఘనభోజనంలో తియ్యగా బావుంది కదూ!

33 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

రుచిచూశాను. చాలా బాగుంది :) జున్నుదాతా సుఖీభవ.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఇంకా ఎవరెవరు ఏమి వడ్డిస్తారో చూసి ఆరగించి చివర్లో తింటాను లెండి.

నేస్తం చెప్పారు...

అబ్బా ఎప్పటినుండో అనుకుంటున్నా ఈ వంట కోసం ..రేపే ట్రై చేస్తా

సుభద్ర చెప్పారు...

సుపర్ వ౦ట అ౦డి..నేను ఏన్ని ఏళ్ళు అయ్యి౦దో జున్ను తిని..తప్పక ట్రయి చేస్తాను. చూడముచ్చటగా ఉ౦ది.నాకు రె౦డు బౌల్స్ ప్లీజ్ ..అ౦టే నాక౦టే మా సాబ్ కి ఇక్కవ ఇష్ట౦ మరి ఏమి చేయను.

సుభద్ర చెప్పారు...

అన్నట్లు మరి షుగర్,బెల్ల౦ అవసర౦ లేదా???క౦డెన్స్డ్ మిల్క్ లొని తీపి సరిపోతు౦దా???

భావన చెప్పారు...

నాకు జున్నంటే చాలా ఇష్టం.. మేము ఇక్కడ తినలేము కదా థ్యాంక్స్ అండీ రేపే ట్రై చేస్తాను. అవును తీపి ఎలా బెల్లం వేసినట్లు వుంది మీ పిక్చర్ చూస్తే.

psm.lakshmi చెప్పారు...

కొత్త వంట చెప్పారు. ప్రయత్నించాలి.
psmlakshmi

amma odi చెప్పారు...

జున్ను మాకు బాగానే దొరుకుతుంది గానీ, ఈ కొత్తరుచి ప్రయత్నించి చూస్తాను. నాకు తెలియని మంచి వంటకం పరిచయం చేసారు.

మాలా కుమార్ చెప్పారు...

బాగుందండి మీ జున్ను .

జయ చెప్పారు...

జున్ను అంటే నాకు చాలా ఇష్టం. బగుందండి మీ జున్ను.

సిరిసిరిమువ్వ చెప్పారు...

వనభోజనాలలో స్వీటు లేని కొరత తీర్చారు, బాగుంది. దీన్లో నేను పంచదార వేస్తాను, మీరేమి వేసినట్లు లేరు, తీపి సరిపోతుందా?

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

భాస్కరరామిరెడ్డి
బావుందా బాబూ!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

చిలమకూరు విజయమోహన్
చివర తిన్నారా? మర్చిపోయారా?

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

నేస్తం
తప్పకుండా చేసి చెప్పండి.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

సుభద్ర
మీరు చేసిచూడండి. పంచదార, బెల్లం అవసరంలేదు. కండెన్సుడు పాలలోని తీపి సరిపోతుంది.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

లక్ష్మిగారు, అమ్మఒడి

ప్రయత్నించి చూడండి. చాలా సులువు.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మాలా కుమార్, జయ,

ధన్యవాదాలండి

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

భావన,
ప్రయత్నించి చూడండి. బెల్లం వేయలేదు.పంచదార అవసరం లేదు. కండెన్సుడు పాలలోని తీపి సరిపోతుంది.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

సిరిసిరి మువ్వ,
నేను తీపి ఏదీ వేయలేదండి.కండెన్సుడు పాలలోని తీపి సరిపోతుంది

జ్యోతి చెప్పారు...

మీ జున్ను చూడడానికి ఇదిగో ఇప్పుడు తీరిందండి. నాకు జున్ను అంటే చాలా ఇష్టం.పుష్కరాలకొక్కసారి అన్నట్టు జున్నుపాలు దొరికితే చేసుకుని నేనొక్కదాన్నే తింటాను. చాలా ఏళ్లయింది జున్ను తిని.మీరు చెప్పినట్టు చేసుకుని తినాల్సిందే..

శ్రీలలిత చెప్పారు...

ఇది నాకు చాలా నచ్చింది. ఈ సారి తప్పకుండా ట్రై చేస్తాను.

కార్తీక్ చెప్పారు...

అందరి బ్లాగిళ్ళలొ వంటలు బాగున్నయ్
మీరైతె కొంచంవెరైటీగా జున్ను చేసారన్న మాట
అదీ కొత్త పద్దతిలో బహు బాగు

www.tholiadugu.blogspot.com

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

కార్తిక్,

థాంక్స్.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

జ్యోతీ, శ్రీలలితా,

చేసి, చూసి, చెప్పండి !!

వేణూశ్రీకాంత్ చెప్పారు...

వావ్ పెరుగు కండెన్సడ్ పాల తో జున్ను బాగుందండీ నేను జున్ను తిని చాలా రోజులు అయింది ఆ కొరత తీర్చుకోవచ్చనమాట.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

వేణూ శ్రీకాంత్,
చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీ కోరిక తీర్చుకోండి.

Unknown చెప్పారు...

junnu palu lekunda junnu cheyyatamu chala baga chepparu

Unknown చెప్పారు...

junnu palu lekunda junnu elacheyyalo c hepparu chala bagundi

Unknown చెప్పారు...

junnupalu lekunda junnu ela cheyyalo chepparu chala bagundi

Unknown చెప్పారు...

junnupalu lekunda junnu ela cheyyalo chepparu chala bagundi

Unknown చెప్పారు...

junnupalu lekunda junnu ela cheyyalo chepparu chala bagundi

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

పద్మావతీ,

తయారుచేసికుని రుచి చూశారా లేదా ఇంకా?

Advaitha Aanandam చెప్పారు...

చాలా థాంక్స్ పిన్నిగారు......
నేను తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్తాను..... త్వరలో.....

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes