గీత అనగా "గీ" అంటే త్యాగం, "త" అంటే తత్వజ్ఞానము. ఈ రెంటిని బోధించేది గీత.ఉపనిషత్తుల సమస్త సారాంశము.. భగవద్గీతను అర్జునుడికి శ్రీకృష్ణుడు మార్గశిర శుద్జ ఏకాదశినాడు చెప్పాడు. "గ" అకారంలో కలిగిన వాటిలో గీతను చదవాలి. వినటం మధ్యమం. గీతను చదవటం, గంగా స్నానం, గాయత్రీ జపం, గోవింద నామస్మరణ..ఈ నాలుగింటిలో గీత గంగ కన్నా ఉత్తమమైనది. గాయత్రి మంత్రం కన్నా గొప్పది. అర్జున విషాద యోగ పారాయణ ద్వారా పాపాలు తొలగుతాయి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది క్షేత్ర క్షేత్రజ్ఞవిభాగయోగం ద్వారా సకల దోషాలు,చెడూ తొలగిపోతాయి. గుణత్రయ విభాగయోగం పారాయణద్వారా అనేక స్త్రీలతో పోయిన పాపములు, స్త్రీ దోషాలు పోతాయి.పురుషోత్తమ ప్రాప్తి యోగంద్వారా సర్వపాపాలు పోయి ఉత్తమ మోక్షాలు సంక్రమిస్తాయి.భోజనానికి ముందు చదివితే మరింత మంచిది.దైవాసుర సంద్విభాగయోగం ద్వారా అమితశక్తి వంతులవతారు. శ్రద్ధాత్రయ విభాగయోగంపారాయణం ద్వారా అనేక దీర్ఘరోగములు నశించిక్షీణిస్తాయి. మోక్షసన్యాసయోగం పారాయణ ద్వారా అనేక యజ్ఞములు చేసిన ఫలములు కలుగును.
సాంఖ్యయోగము ద్వారా ఆత్మ స్వరూపమును తెలుసు కొనగలుగుతారు.
కర్మయోగం ద్వారా మీచుట్టూ ఉన్న ప్రేతాత్మలు తొలగిపోతాయి.
జ్ఞానయోగ పారాయణం ద్వారా పశు, వృక్ష, పక్షుపాపాలు కాడా నశించి ఉత్తమమైన లోకాలను చేరుతాయి. తద్వారా పుణ్యప్రాప్తి.
ఆత్మ సంయమ యోగం ద్వారా అనేక దానములు చేసిన పుణ్య ఫలం లభిస్తుంది
విజ్ఞానయోగం ద్వారా జన్మరాహిత్యమూ, అక్షర పరబ్రహ్మయోగం ద్వారా సమస్త దుర్గుణాలు,నశిస్తాయి.
రాజ విద్యా రాజగుహ్య యోగంద్వారా పరుల సొత్తును అపహరించిన పాపములు పోతాయి.విభూతి యోగం ద్వారాసకల పాప విముక్తి కలుగుతుంది. భక్తి యోగంద్వారా ఇష్టదేవతా దీవెనలూ లభిస్తాయి.
(నా దగ్గరున్న తాళపత్రనిధి పుస్తకమునుండి సేకరించినది)..
గీత గురించి సేకరించింది.
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 9, డిసెంబర్ 2009, బుధవారం
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి