RSS

చుట్టరికాల revival

    గత 40 ఏళ్ళలోనూ బాగా దగ్గర వారి వివాహాలకు గానీ, ఇంట్లో శుభ కార్యాలకి గానీ ఏవేవో కారణాల వల్ల వెళ్ళలేకపోయాము.మా శ్రీవారు రిటైరు అయినప్పటినుండీ ఓ కొత్త వ్యవహారం మొదలెట్టారు.చుట్టాలందరితోనూ సంబంధాలు పునరుధ్ధరించడం. వాళ్ళు దగ్గరవారైనా సరే, దూరంవారైనా సరే,వారింట్లో శుభకార్యానికి వెళ్ళడం. ఆయనతో పాటే మరి నేను కూడా వెళ్ళాలిగా!
దానికి ఓ పేరుకూడా పెట్టుకున్నారు--' చుట్టరికోధ్ధరణ అభియాన్' అని!( Operation revival of relationships)

    ఈ సందర్భంలోనే మా అత్తగారి పెద్దక్కయ్య గారి పెద్దకూతురి, పెద్దకూతురు కొడుకు వివాహానికి మేము భాగ్యనగరానికి ఈ వేళ వెళ్తున్నాము! ఇక్కడితో అవలేదు, ఈ నెల మూడో వారంలో
మా వారి అత్తగారి పెద్దమేనమామగారి పెద్దకూతురి,కూతురు కొడుకు పెళ్ళికి మళ్ళీ రాజధానీ నగరానికి వెళ్తున్నాము. ఇంతే కాదండోయ్ రాజమండ్రీ లో ఉండగా, మా వారి చిన్నవదినగారి
పెదనాన్నగారి కూతురింటికి
వెళ్ళి వారిచ్చిన అతిథిసత్కారాలు స్వీకరించి,తరువాత మా చిన్నబావగారి అమ్మాయితో కలిసి,మా వారి చిన్నవదిన చిన్నపెదనాన్నగారి కొడుకింటికెళ్ళి అక్కడ కూడా
పసుపు కుంకాలూ, చీరా తీసికుని వచ్చాను!

    ' ఏమీ తోచనమ్మ తోటికోడలి పుట్టింటికి వెళ్ళింది' అని పూర్వకాలపు సామెత. కానీ ఇంకో రెండడుగులు ముందుకు వేసి, మా చినబావగారి కూతురితో కలిసి తన పినమావగారి ఇంటికి కూడా వెళ్ళొచ్చాము! ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఎప్పుడు ఎక్కడ పిలిచినా, మావారు ముందరే టిక్కెట్టు రిజర్వు చేసేస్తారు! ఎక్కడో చెప్తే చాలు, డేట్ అటూ ఇటూ అయినా ఫర్వాలేదు, మేము రెడీ, చుట్టాలూ బి రెడీ!

గమనిక : ఇది స్నేహితులకి కూడా వర్తిస్తుంది !
!

13 కామెంట్‌లు:

చదువరి చెప్పారు...

హహ్హహ్హా.. బావుందండి, నవ్వులు పూయించారు.

సుజాత వేల్పూరి చెప్పారు...

అబ్బ, అంతమంది చుట్టాలుండి ఎప్పుడూ పెళ్ళిళ్ళకీ వాటికీ వెళ్తూ ఉంటే ఎంత బావుంటుందో కదండీ!

ఫణిబాబు గారి చుట్టరికోద్ధరణ అభియాన్ నాకు బాగా నచ్చేసింది.అలాంటి వాళ్ళు ఇంటికొక్కరుండాలని నా కోరిక!

భాగ్య నగరం వస్తున్నామన్నారుగా, రండి రండి! మా ఇంటికి రండి! మేమూ మీ చుట్టాలమే అనుకోండి! బీరకాయ పీచు కలపమంటారా? అయితే కాసుకోండి..! మా అత్తగారిల్లు పశ్చిమ గోదావరే! ఇంకో చుట్టరికం చెప్పనా...మా పెదనాన్నగారి కూతురు ఆడపడుచు తోడికోడలి అత్తగారింటిపేరూ భమిడిపాటివారే మరి!

వచ్చేయండి పిన్ని గారూ!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

చదువరి,
థాంక్స్.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

సుజాత గారికి,

మీరు పిలవాలేకానీ, రావడానికి మేము రెడీ . ఎప్పుడో చెప్పండి !!!

నీహారిక చెప్పారు...

ఆలస్యంగానైనా మీ వారు కళ్ళు తెరిచారు. మా వారెపుడు కళ్ళు తెరుస్తారో?????

Unknown చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Unknown చెప్పారు...

బాబాయి గారు పెట్టిన పేరు అదిరింది! నిజంగానే రిటయిర్ అయిన తర్వాత ఇలా అందరినీ పలకరించి మీరు చెప్పినటువంటి పొడవాటి చుట్టరికాలు గుర్తుతెచ్చుకొవడం, వాళ్ళగురించి వివరాలు తెలుసుకుని వారింటికి వెళ్ళి పలకరించడం భలే బావుంటుంది కదండీ?
పెళ్ళిళ్ళల్లో నేను గమనించేది ఇదే.
"మన పిన్నీవాళ్ళ తొటికొడలి వదినగారి పెత్తంద్రి గారి మనవడు గుర్తున్నాడా?"
"ఔను చిన్నప్పుడు పసిమిరంగులొ బొద్దుగా ఉండేవాడు...ప్రణవ్ కదూ అతని పేరు?"
"ఆ అబ్బాయికి పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా..." అనుకుంటూ అప్డేట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు. సగంలో ఎవరైనా విన్నారా బుర్ర తిరిగిపోతుంది. అంత క్లిష్తంగా ఉంటాయి ఆ చుట్టరికాలు.
కాని ఈ విలువలు ఈ తరంవారికి లేవు. వారికి వారి "first cousins" గురించి తెలియడమే గొప్ప.
:) మంచి టపా రాసారు పిన్ని!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

నీహారికా,

నిరాశావాదం వంటికీ, ఇంటికీ మంచిదికాదు !!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

ఏరియన్,

'ఔనూ, ప్రణవ్ అంటే గుర్తుకొచ్చిందీ, మా అమ్మ మేనమామ గారి కూతురి మనవరాలి మనవడు ప్రణవున్నాడూ, వాడి మేనమామ పెళ్ళికి 20 తారీఖున హైదరాబాదు వెళ్తున్నాము !!'

Unknown చెప్పారు...

నిజ్జంగా???

:) నాకు నవ్వాగట్లేదు...

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

>>>మా అత్తగారి పెద్దక్కయ్య గారి పెద్దకూతురి, పెద్దకూతురు కొడుకు
పెద్దత్త గారి మనవడి ని అంత సాగదీయాలా? సరేలెండి మీరు మీ బ్లాగ్ లో ఫణి గారి మీద జోకులేస్తే ఆయన వారి బ్లాగ్ లో మీ మీద. బాగుందండీ మీరిద్దరూ కంకణం కట్టుకున్నారా మమ్మలని నవ్వించాలని.
@సుజాత గారు. మాది ప.గో.జి యే. మా వదిన గారి భర్త గారి తమ్ముడి స్నేహితుడి పేరు శ్రీ భమిడిపాటి ఫణి బాబు. మేము కూడా వచ్చేయమా.

A K Sastry చెప్పారు...

చుట్టరికాల్ని భలే వివరించారక్కయ్యా!

బావగారి 'ఉధ్ధరణ మార్గం' కూడా బాగుంది--ఈ విషయం లో మాకు ఆదర్శం మీరు!

చాలా బాగుంది టపా! సంతోషం!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

సుబ్రహ్మణ్యం గారూ,

మీ 'నవ్వితే నవ్వండి' ముందర మావి ఎంతండీ ?

కృష్ణశ్రీ గారూ, ధన్యవాదాలు.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes