మా అబ్బాయి , Seth Godin , ISB హైదరాబాదు లో ఏదో లెక్చరు ఇస్తున్నారంటే, అక్కడికి వెళ్ళాడు. కోడలూ,పిల్లలూ ఒక్కళ్ళూ ఉంటారని, మేము మా ఇంటికి వెళ్ళాము.మా మనవడు అగస్థ్య తొ బాగా కాలక్షేపం అయింది. నవ్య స్కూలుకి వెళ్ళిపోయింది. మా కోడలైతే ఇంటినుండే పనిచేసికుంది. ఆయన సంగతి తెలుసుగా, కాలు కొంచెం బాగుపడింది, ఇంక ఇంట్లో ఎక్కడుంటారూ? మళ్ళీ మిస్టరీ షాపింగు కోసం, షాపర్స్ స్టాప్ కి వెళ్ళి,అగస్థ్యకి ఓ చొక్కా తెచ్చారు.క్రిందటి నాలుగునెలలూ వాడికి, పుట్టినరోజు 7 వ తారీకున, ఏదొవిధంగా, మిస్టరీ షాపింగు అసైన్ మెంటు రావడం, వాడికి ఏదో చొక్కాయో. జుబ్బాయో తేవడం.జేబులోది పడకుండా ఇదీ బాగానే ఉందనిపించింది. ఈవేళ మా అబ్బాయి హైదరాబాదు నుండి తిరిగి వచ్చాడు. మధ్యాన్నం లంచ్ చేసేసి, తిరిగి మేముండే ఎపార్ట్ మెంటుకి వెళ్ళిపోదామూ, అనుకుని, రిలయన్స్ లోకి వెళ్ళి కూరలూ, ఏవో ఇంట్లోకి కావలిసిన సామాన్లూ తెచ్చి, మా అబ్బాయితో చెప్పి ఇంటికి బయలుదేరాము. ఆయనేం కొన్నారో తెలియదు.ఓ నాలుగు సంచీలు భుజాన్నేసికుని ఆటో లో వచ్చాము.మా అబ్బాయి కారులో దింపుతానూ అంటే ఈయనే వద్దన్నారు. కారణం అప్పుడు నాకేం తెలుసూ? సంగతేమంటే అప్పుడెప్పుడో ఓసారి ఆయనతో మాటల్లో అన్నాను- ఐస్ క్రీం డబ్బా ఒకటి ఇంట్లో పెట్టండీ అని. అదెప్పుడూ వేసంకాలంలో, ఆయనకి ఇప్పటికి గుర్తొచ్చి, రిలయెన్స్ లో Baskin Robins దొరుకుతోందని, పెళ్ళాంమీద ప్రేమ పుట్టుకొచ్చేసి, పాపం ఓ డబ్బా కొన్నారు. పోనీ దాన్ని ఫ్రీజర్ లో పెట్టొచ్చుగా, అబ్బే అలాటివేవీ గుర్తుండవు! వర్షాలు పడుతూంటే, ఐస్ క్రీంలేమిటీ అని, కొడుకేమన్నా అంటాడేమో అని,' ఊరికే నీకు శ్రమెందుకురా, మేము ఆటోలో వెళ్ళిపోతాములే' అన్నారుట,ఇదన్నమాట అసలు సంగతి. ఇంటికొచ్చి, నేను ఇల్లూ అదీ తుడుస్తూంటే, ఆయన సంచీలు ఖాళీ చేసి, కూరలూ అవీ సద్దుదామనుకున్నారు. పాపం అప్పుడప్పుడు నాకు హెల్ప్ చేస్తూంటారు లెండి! ఏమిటో ఒక్కొక్క పొట్లం, కూరా తీయడం, దాన్ని ఓ గుడ్డతో తుడవడం, వామ్మోయ్ ఇంత శ్రధ్ధెక్కడినుంచొచ్చిందిరా దేముడోయ్ అనుకుంటూంటే, అసలు సంగతి తెలిసింది- పాపం ఆయన ఎంతో ప్రేమతో తీసికున్న ఐస్ క్రీం కాస్తా Liquid Robin అయిపోయిందని.అదేమిటండీ నాతో చెప్పనైనా లేదూ
లేకపోతే ఫ్రీజర్ లో పెట్టమైనా కానీ చెప్పేదాన్ని,అన్నాను. అంతా అయోమయం అధ్వాన్నమూనూ ! నేను చచ్చేట్లా తుడిచిన ఫ్లోర్ అంతా ఏమిటో జిగురుగా ఉందేమిటీ అనుకుంటే, ఇదండి ఆయన చేసిన ఘనకార్యం! మళ్ళీ ఫ్రిజ్ లో పెట్టిన కూరలు తీసి, ఓమాటు కడుక్కుని పెట్టాల్సొచ్చింది!
పన్లు చెయ్యరు, ఏదో బుధ్ధి పుట్టి చేస్తే ఇదీ నిర్వాకం !!
అయోమయం, అధ్వాన్నం !!
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 8, జులై 2010, గురువారం
13 కామెంట్లు:
బావుంది, వైకుంఠంలో మీ పరమేశ్వరుడు మీ(నేల)పై ప్రేమ వొలకబోసిన విధానం.
ఆడవాళ్ళందరికీ common గా చికాకు అంటూ వచ్చే ఎకైక విషయం - గదులు తడిగుడ్డ పెట్టి తుడిచాక ఆ రోజే మరకలు పడడం...
రెక్కలు పడిపోయేలా తుడుచుకున్న రోజునే కాఫీ ఒలకపొయ్యడమో, అందాకా యెందుకు, నీళ్ళే ఒలకబోసి, యెక్కడ తెలిసిపోయి భార్య కసురుతుందో అని ఎక్కడినుంచో ఒక మురికి గుడ్డ తెచ్చి తుడిచేసి మరికాస్త నల్లటి మచ్చ చెయ్యడమో జరుగుతాయి...
ఏమిటో, ఏప్పుడూ జరిగేదే ఐనా మనకీ కొత్తగా కొపం వస్తుంది... ఏప్పటికి లైట్ తీస్కుని BP తెచ్చుకోకుండా ఉంటామో ఏంటో??!
title super undi andi...
అయ్యో పాపం మీకోసమే కొన్నారుగదా ఐస్ క్రీమ్. మళ్లీ ఆయన్ని విసుక్కుంటారెందుకండి?? ఎవరికి తెలీకుండా దాచిపెట్టి మీకిద్దామనుకున్నారు. అదేమో కరిగిపోయింది. కావాలని చేసారా ఏంటి?? సెమించేసేయండి ఈసారికి..
నాగేశర్రావూ,
ఇల్లంతా ఒలకపోయఖ్ఖర్లేదు!
ఏరియన్,
మనమూ, బీ.పీ అకాచెల్లెళ్ళమమ్మా!
మురళి,
థాంక్స్.
జ్యోతీ,
ఇలా నెత్తికెక్కించుకునే, అనుభవిస్తున్నాను!
namasteandi
enti na message chudaleda.nenu sagamlo apesanu.naku mee photo chupinchandi.tatagari photo chusanu bavunnaru,me manavaralu kuda bavundi.asalu e blogspot gurinchi naku chepparu.naku deeni gurinchi teleedu.naku evi ayina kotta vantakalu cheppara plzzz.naku mail cheyyandi.na mail address hyndavinanduri@gmail.com.plz meeto chat cheyyalani undi.plzzzz.na letter accept cheyyandi.untanu namaste
hyndavinanduri
namaste,
naku meeto chat cheyyalani undi.na mail id hyndavinanduri@gmail.com.naku evina kottavantalu cheppagalara.naku e blogspot gurinchi kuda cheppara nanu ma attagaru emina rastamu.plz accept my letter.
మేడం,
ఇది మరీ దారుణం. పాపం...పెద్ద మనిషి ఇంటావిడకి ఐస్ క్రీం తినిపిద్దామని అనుకోవడం తప్పైపోయింది. మరీ...అయోమయం అనేస్తారా. మా నిరసనలు.
రాము
apmediakaburlu.blogspot.com
హైందవీ,
నాకు నీ మెయిల్ ఏదీ రాలేదు. నేను వంటల్లో ఏదో ప్రవీణురాలినని అపోహలో ఉందకు. నెట్ లో వెదికితే కావలిసినన్ని వంటలు దొరుకుతాయి.apmediakaburlu.blogspot.com టపాలో రాముగారు, నాఫొటోకూడా పెట్టారు. బ్లాగ్గులగురించి, ఏదో మా శ్రీవారూ, పిల్లలూ చెప్తే వ్రాస్తున్నాను కానీ, అంత పెద్ద ఎక్స్ పర్ట్ ని కాను.
రామూ గారూ,
మీరూ,మా శ్రీవారూ స్నేహితులు కదా, నన్నెక్కడ సపోర్ట్ చేస్తారు?
కామెంట్‌ను పోస్ట్ చేయండి