RSS

వెరైటీ ఉసిరి పచ్చడి



    నేను మా మనవడి దగ్గరకు వేళ్లివచ్చెసరికి అందరూ వనభోజనాలతో భుక్తాయాసం తీర్చుకుంటున్నారన్నమాట. అబ్బో! అన్ని ఎంత బాగున్నాయండీ!అసలే ఉపవాసం, ఒక్కోక్కటి చదువుతుంటే నోట్లో నీళ్ళూరిపోతున్నాయి మరి,అందరివి చాలా చాలా బాగున్నాయి.
నేను కూడా ఒకటి రాస్తాను. చాలా చాలా సులభమైనది.ఆలస్యంగా అయినా చేసి చూసి చెప్పండి మరి---
-

వైరైటి ఉసిరి పచ్చడి.

ఉసిరికాయలు------ 12 లేక 14.
కారం ---------- 2 చంచాలు
ఉప్పు --------- 2 చంచాలు
మెంతిపొడి ------- 1/2 చంచా
నూనె ---------- 2 చంచాలు
బెల్లం పొడి ------- 2 చంచాలు
కొద్ద్దిగా పసుపు,
కొద్దిగా ఇంగువ.

ఉసిరికాయలు శుభ్రంగా తుడుచుకొని తురిమి పెట్టుకోవాలి.
మెంతులు నూనె లేకుండా వేయించి పొడి చేసుకోవాలి.
బెల్లం తరిగి పెట్టుకోవాలి.

పాన్ లో నూనె వేడి చేసి ఇంగువ వేసి తురిమిన ఉసిరి వేసి, కమ్మగా వేయించి,కొద్దిసేపు మూత పెడితె మెత్తగా వేగుతుంది. తరువాత మూత తీసి వేయించి, పసుపు వేసి , మెంతిపొడి వేసి , కారం వేసి, ఉప్పు వేసి,కలియబెట్టి బెల్లం వేసి కలిపి స్టవ్ కట్టేయండి. చాలా ఈజీ! బెల్లం హెచ్చుతగ్గులు మీరే చూసుకోండి, అంటే బ్రడ్ తో తినేమాటయితే కొంచెం తీపి ఎక్కువ వేసుకోవాలి.

పచ్చడి తయార్!

5 కామెంట్‌లు:

వేణూశ్రీకాంత్ చెప్పారు...

బాగందండి.

Unknown చెప్పారు...

నేనూ మొన్న ఇలాంటిదే ఒక పచ్చడి చెసాను, అయితే అది వెరైటీ అని అప్పటికి నాకు తెలీదు అనుకోండి :). బెల్లం వెయ్యలేదు.. వెల్లుల్లి వేసాను.. అంతే తేడా.. బావుంది మీ పచ్చడి.

Radha చెప్పారు...

mee usiripachadi photo undi kaani process ledandi... naa system problem ah? leka mee post problem ah... ?
choodataanikaithe baagundi pachadi konchem process chepparoooo

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

వేణూ శ్రీకాంత్,
థాంక్స్.

ప్రసీద గారూ,

పోన్లెండి, పచ్చడి నచ్చినందుకు సంతోషం.

రాధా,

మీ సర్వరులో ఏదో సమస్య ఉండిఉండొచ్చు. బొమ్మా, తయారుచేసే పధ్ధతీ బాగానే కనిపిస్తున్నాయి.

aavakaaya చెప్పారు...

నాకూ కనపడట్లేదండీ తయారీ విధానం. ఆరోజే చూసి నాకేనేమో ఈ ప్రాబ్లం అనుకున్నా. ఈరోజు రాధా గారి కామెంటు చూసి నేనూ చెప్తున్నా. మరలా ఒకసారి పెట్టండి తయారీ విధానం.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes