ఇది వరకు ఎప్పుడు ఇలా జరగలేదు ఆంటీ, అసలు ఈ ఫ్లోరు లోకే వచ్చేది కాదూ-- మీరు వచ్చిన తరువాతే జరుగుతోందీ, అయినా మీరు ఇలా వుంచకుండా యిదివరకులా వుంటే నే బాగుండేది, దీనికి సూకరాలు పెరిగిపోయాయి. అంటూ విసవిసలాడుతూ వెళ్ళిపోయింది మా కింద ఫ్లోరులో వుండే ఆమె. ఆమె పేరు కూడా నాకు తెలీదు.
ఇంతకీ జరిగినదేమంటే వాళ్ళకి ఓ పిల్లి , ఇంకో ఆవిడకి ఓ కుక్క వున్నాయి. ఉంచుకోవడం పెంచుకోవడం వాళ్ళ యిష్టం. కాని వాళ్ళేంచేస్తారంటే వాటిని రాత్రులు హాయిగా బయటకు స్వేచ్చగా వదిలేస్తారు. అవి కూడా చాలా స్వాతంత్రంగా స్వేచ్చగా ఎక్కడ కావలంటే అక్కడే కాలకృత్యాలు తీర్చేసు కుంటాయి. మేము వచ్చిన కొత్తలో ఒకామె ఓ అట్ట లేకపొతే ఓ చేటో తీసుకొని పైకి కిందకి వెళ్ళి చీపురుతో బాగు చేసి వచ్చేది.పెంచుకుంటే పెంచుకున్నారు దాంతో పాటు ఇవీ ముద్దు గానే చేస్తూన్నారని మురిసిపోయాను. ఇప్పుడు వాటికి మా ఫ్లోరు నచ్చిందనుకుంటాను. ఇంచుమించుగా దీపావళి నుండి మా గుమ్మంలో పావనం చేయడం మొదలు పెట్టింది. అక్కడకీ ఒక పని అయితే డెట్టాల్ నీళ్ళతో సబ్బు నీళ్ళతో బక్కేట్ తో పోసి శుభ్రం చేసుకుంటూనే వున్నాను. కానీ అదీ రెండో పని కూడా మొదలుపెట్టింది, కిందకి వెళ్ళి వాచ్ మెన్ కి చెప్పడం అతను వాళ్ళకి చెప్పి శుభ్రం చేయించండం, ఇలా జరుగుతోంది ఈ విషయం మీదే ఆవిడకి మిగిలిన ఫ్లోరులో వాళ్ళకి చిన్న చితుకు గోడవలు కూడా జరిగాయట.ఈరోజు కూడా యిదే జరిగింది. దాని పని అది చేసేసింది, నేను చూసి చిరాకు పడి మా శ్రీవారితో చెప్పడం తనెళ్ళి కింద వాచ్ మెన్ కి చెప్పడం, ఆవిడ వచ్చి శుభ్రంచేసి నాకో సలహా యిచ్చి వెళ్ళడం జరిగింది.మీరు వచ్చిన తరువాత రోజూ కడిగి ముగ్గు వేస్తూన్నారు కదా అందుకనే ఇక్కడకు వస్తోందీ, ఇదివరకూ ఎప్పుడూ ఇక్కడికి వచ్చేదేకాదంటూ పై డైలాగు కొట్టి వేళ్ళిపోయింది...
మనుష్యులకి శుభ్రత లేకపోయినా నోరులేని జంతువులకున్న పరిశుభ్రతకి అచ్చెరువు పొందాలా లేక నేను రోజు గుమ్మం కడిగి ముగ్గు పెట్టుకొని , చక్కగా గుమ్మానికి తోరణం కట్టుకొని వుంచుకున్నందుకు , రివార్డంటారా, చెప్పండీ.
అదేదో యాడ్ (సర్ఫ్) లోలాగ ఇంటిముందర చెత్త చెదారం ఉంచేసికుని ఉండుంటే ఆ పిల్లులూ,కుక్కలూ వచ్చి నా ప్రాణం తీయకుండా ఉండేవేమో? అందుకే అన్నారేమో 'మరక మంచిదీ..' అని ఆ యాడ్ లో!!
.
5 కామెంట్‌లు:
tell them to take the dog for a walk early in the morning ...
Vaatiki alavatu cheyyali ala lekapothe vatiki ela telusthundi...
:D
హిందీలొ ఒక సామెత ఉందే, "ఉల్టా చోర్ కొత్వాల్ కొ దాంటే!" అని అలా ఉంది ఆవిడ పద్ధతి. తమ పెంపుడు జంతువులని తామే అందరిమీదికి వదిలేసి అవి మీ ఇంటి ముంగిలిని పాడుచెస్తున్నాయని చెబితే, అది మీ శుభ్రం వల్లే అని మిమ్మల్నే విమర్సిస్తారా? కలికాలం!
మీరు మాత్రం ఎప్పుడు చెయ్యి జారి(నొరు జారి అని వాడలేం కదా) వారి కుక్క చెసిన నిర్వాకాన్ని శుభ్రం చెయ్యకండి. లెదంటే ఇంక ఆ పని కూడా మీకె వదిలెయ్యగలదు ఆ మహా తల్లి.
:) Sorry andi navvu vachesindi, kani miku baaga visugga undi untundi vaatitho. :)
హర్షభరత్,భవాని, ఏరిన్, జాబిలి గార్లకు
నా టపా చదివినందుకు ధన్యవాదాలండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి