ఒక మంచి కధ, ఓ మంచి విశ్లేషకుని విశ్లేషణ, ధనుర్మాస సందర్బంగా మేము త్రిమూర్తి స్వరూపులు ( బాపు, రమణ, ఆర్.కె. లక్ష్మణ్) గా భావించే శ్రీ బాపు రమణల " మేలుపలుకుల మేలుకొలుపులు" మా బ్లాగులో వ్రాసి మమ్ము మేము పునీతులవుదామనే ఆశ. పదిసార్లు చదివేదానికన్నా ఓ సారి రాస్తే బాగా అర్ధమవుతుంటారు. అలాగే శ్రీ బాపుగారు " మిధునం" కధని ఆయన తన దస్తూరిలో రాసిచ్చి ,"ఓసారి రాస్తే బాగా అర్ధమవుతుంది. అందుకనే రాశాను" అన్నారట. మేము ఓ పది సార్లు చదివేకంటె రాసి అర్ధం చేసుకునే ప్రయత్నం.
మధురమైన పాట, మనకే స్వంతం కాకుండా మరొకరితో పంచుకుంటే పెరిగే నిధి.
మాకు నచ్చినవి మీతో పంచుకోవాలనే చిరు ప్రయత్నమే .
నల్లాని సామినీ పెళ్ళాడ మనసైతే
తెల్లారుజామునే చలిమునక వెయ్యాలి
కన్నెమనసూ విప్పి కాత్యాయనికి చెప్పి
మార్గశిరనోమునూ మనసార తలపెట్టి
నందగోవుని పట్టి బృందావనపు జెట్టి
బాలసింగము నడిగి పూలు పాలు పళ్ళు
కొబ్బరీ బూరాలు తప్పెట్లు తాళాలు
తెచ్చుకోవాలమ్మా తెల్లారిపోకుండా
కన్నెపిల్లా మేలుకో కన్నయ్యనూ లేపగా
సిరినోము - హరిపూజ - గిరిపుత్రివరము
గోకులం కన్నెలకు కల్యాణకరము
లోకులం దరికిదే సౌభాగ్యప్రదము
పల్లెపిల్లా మేలుకో
రే-పల్లె పిల్లా మేలుకో
( మేలుకొలుపులు మొదటిది. " శ్రీ బాపు రమణ లకు నమస్కృల తో )
2 కామెంట్‌లు:
చెల్లాయ్! చాలా బాగుంది.
అన్నయ్యగారు
ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి