RSS

మీరేమంటారు ???

   మేము ఇదివరకు హైద్రాబాదు పెళ్లికి వెళ్లినపుడు నెక్లెసు, గాజులు పెట్టుకుంటుంటే ఓ గాజు మిస్సింగ్. పెట్టెలో మొత్తం వెదికాను , ఊ హూ! కనిపించలేదు. కింద నేల మీద పడిందేమొనని చూ శాను.. దొరకలేదు. అలాగే పెళ్ళికి వెళ్లి , అదేరోజు రాత్రి తిరుగు ప్రయాణానికి బయలుదేరే ముందు మళ్ళీ అన్ని వెదికి నిరాశతో, ఎలా ఈయనతో చెప్పాలీ? అని బాధ పడుతూ,మరొకసారి వెదుకుతూ, ( ఈయనతో వెంటనే చెప్పలేదులెండి, చెబితే ఆయన మూడ్ బాగుండక ,పెళ్లిలో చాలా రోజుల తరువాత కనిపించిన బంధువులను చూసిన ఆనందం, సంతోషం వుండవు కదా,అందుకని) దేవుడ్ని తలచుకుంటూ, రోజూ దేవుడికి దీపం పెట్టి పూజ చేస్తానే ప్రతి శుక్రవారం లలితా సహస్రనామం చదువుతానే తెలిసీ ఎవరికీ హాని చేయలేదే? అనుకుంటూ తిరిగి వచ్చేస్తూ తిరిగి చూసేసరికి మంచం మీద దీపం వెలుతురులో మెరుస్తూ కనిపించింది.ఎంతో సంతోషంతో అమ్మా! నీవు వున్నావు తల్లీ! అనవసరంగా శంకించాను, నన్ను మన్నించు తల్లీ! అనుకుంటూ , అప్పుడూ అందరికి గాజు కనిపించలేదని , ఇప్పుడు కనిపించిందని నేను రోజంతా పడ్డ టెన్షన్ గురించి చెప్పి ఆనందంతో ఏడ్చేసాను." అమ్మ" అనుగ్ర్హహం నా అదృష్టం బాగుందనుకున్నాను. అందరూ అదే అన్నారు.
" మాశ్రీవారు, మా పిల్లలు" మాత్రం " వస్తువు పోయిందన్న కంగారులో ,వెదికి వుంటావు, కనిపించలేదు,ఎనీవే, కనిపించిందికదా!గుడ్! అన్నారు.

   నాకు మాత్రం అది మొదటి " వార్నీంగ్ ," చేతావనీ" అని ఇప్పుడనిపిస్తోది. ఎందుకంటే----

   మళ్ళీ హైద్రాబాదు పెళ్ళికని బయలుదేరేముందు మనకున్నవేవో వేసుకోవాలి కదా,మరి!,మళ్లి గాజులు, నెక్లెసు తీద్దామని చూసేసరికి నెక్లెసు మాయం. ఇక్కడె ! మా ఇంట్లోనె! ఇప్పుడు ఇద్దరం కలిసి మొత్తం ఇల్లంతా వెదికాం," ఇంట్లోను, దాపోడి ఇంట్లోను" రెండుసార్లు, మూడుసార్లు,అబ్బే! ఎక్కాడా, కనిపించదే? దానితో పాటు పెట్టిన మిగిలినవి వున్నాయి, కాని అది మాత్రం కనిపించలేదు. తాళాలు వేసినవి వేసినట్లే వున్నాయి.ఏమయిందో , ఎల్లా మాయమయిందో తెలీదు." అమ్మ" అనుగ్ర్హహం అంతమయిపోయిందా? నా అదృష్టం బాగుండ లేదంటారా? అప్పనంగా వచ్చిన వస్తువు కాదే, ఒక్కొక్క గ్రాము కొని ,జీతం సొమ్మూ జాగర్త చేసి మరీ కొన్న వస్తువేనూ,ఎంత లేదన్నా ఇప్పుడు ఏభై వేల రూపాయలు విలువైన వస్తువు. బయట ఎక్కడొ పారేసుకోలేదూ? పెట్టుకొని బయటకు వెళ్ళినపుడు పోలేదూ?ఇంట్లో , జాగర్తగా పెట్టవలసిన చోటే పెట్టాను.మరి కనిపించ లేదంటే ఏమనుకోను.

   " మాశ్రీవారు, మాపిల్లలు" ఎక్కడొ పెట్టి ఎక్కడొ వెతుకుతున్నావు, సరిగ్గా చూడూ, ఇంట్లోపెట్టినది ఎక్కడికి పోతుందీ? అన్ని వుండి అదొక్కటే ఎలా మిస్సవుతుంది" అంటున్నారు. దొరకుతుందో, లేదో, కాలమే చెప్పాలి.

   నాకు మాత్రం పోయిన వస్తువు దొరికినపుడు ఎంత సంతోషమనిపించిందో , వస్తువు దొరకనపుడు కలిగిన దుఃఖం, రెండింటిని సమానంగా తీసుకోవాలనే' సందేశాన్ని' " అమ్మ " పంపినదా, అనిపిస్తోంది. మీరేమంటారు?
భవిష్యత్తు లో సంతోషం- విషాదం, సుఖం - దుఃఖం , రెండింటిని సమానంగా తీసుకొమ్మని " అమ్మ" ఆదేశమా? లేక సందేశమా ?

12 కామెంట్‌లు:

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఆదేశమో సందేశమో నాకు తెలియదు కానీ, ఒకటి మటుకు నిజం.
అప్పుడు మీ ఇంటికి నేను రాలేదండీ..... దహా

అజ్ఞాత చెప్పారు...

Ekkado vere chota petti vuntaaru .dorukutundandi.tappakundaa.maa ammagaariki kooda ilaa avutunnayi eemadhya.memu phone chesi em vetukkuntunnavu eeroju ani ekkirinchaamu kooda.kaani artham chesukogalnu.edanna vetukkuntunte dorike varaku tochadu alaa ani adi dorakakapote time waste ayipotoo vuntundi.kaartaveerarjunaaya namaha ankuni vetikite dorukutaayi ta.okosaari pani chestundi naaku.

విజయభారతి చెప్పారు...

intlone vere chota vundi vuntundi. eppudo kanipistundi. vundi ani telisina kanapadakapote chirakuga vuntundi. navi, bracelet okati diamond lacket okati ekkado padipoyayi..inta, bayata, carlo, officelo antha vetikanu ekkada dorakaledu..ekkado jaripoyayi anukuni vetakatam manesanu..avi dorakane ledu...

అజ్ఞాత చెప్పారు...

ఒకసారి గాజు పోయి దొరికింది కదా అని జాగ్రత్తగా ఎక్కడైనా పెట్టారేమో. మా అమ్మని అంటూ ఉంటాం ఏదైనా వస్తువు దాస్తే దొంగ కి కూడా దొరక్కుండా దాస్తావ్ అని. మీ నెక్లెస్ దొరకాలని మనస్పూర్తిగా భగవంతున్ని కోరుకుంటున్నాను.

Mauli చెప్పారు...

ఎక్కడికి పోతుంది లె౦డీ. ఇకమీ చివరి ప్రశ్నకు నా సమాధానం ఇదీ:

మీరు ఆ నగ అమ్మాలనుకోన్నపుడో, లేక కనిపించకపోతే ఇంకొకటి తప్పక కొనాల్సి వస్తేనో తప్ప దాని విలువ సున్నా :)

అది అర్ధం చేసికొంటే అసలు దుఃఖమే లేదు. :) మీరెంత కష్ట పడి కొన్నారన్నది కూడా అప్రస్తుతం.ఇప్పటికి వదిలెయ్యండి (నేను ఇదే పాటించాను )

Advaitha Aanandam చెప్పారు...

వస్తువు దొరికినప్పుడు ఉండే సంతోషం కంటే , పోయినప్పుడు (కనబడకుండా పోయినప్పుడు) ఉండే బాధే ఎక్కువండీ...

అయినా మీరేమీ దిగులు చెందవద్దు మీరు ఆ నెక్లెస్ ఏదైనా బట్టపర్సు లాంటిదాన్లో పెట్టి బీరువా అరల్లో పెట్టారేమో చూడండి....

దొరికితే మాత్రం 2 లైన్లన్నా బ్లాగులో రాయండి.... అందరం సంతోషిస్తాం...

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

బులుసు సుబ్రమణ్యం గారూ
సందేహమేనండీ, రాలేదంటారా! ఏమొ! ( సీరియస్ గా తీసుకోకండి)

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అజ్ఞాత గారు
అత్తగారు తిట్ట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకన్నారట. వస్తువు పోయినదానికంటె అలా ఏడిపిస్తారనే బెంగ. మీ మంత్రం ప్రయత్నించి చూస్తాను.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

విజయభారతి గారు
చిరాకు వచ్చెవరకూ వెతుకుతూవుంటాను. తప్పదుగా,

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అజ్ఞాత గారు
నా అతి జాగర్త మితి మీరిందనుకుంటాను.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మౌలీ గారు
మీరు చెప్పినట్లుగా విలువ అనవసరం అనుకోండి. దొరక్కపోతే పిల్లలకి ప్రాప్తం లేదనుకుంటాను.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మాధవి గారు
నా టపా కి స్పందించిన మీ అందరికి ధన్యవాదాలు. దొరికితే తప్పక తెలియబరుస్తాను.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes