అమృతమూర్తులయిన అమ్మ,నాన్నలకు " పెద్దమ్మాయి " గా,
పెద్దచెల్లి వాణమ్మకు " అక్క" గా,
బుల్లి చెల్లెళ్ళు రామం, అరుణలకు " పెద్దక్క " గా,
బంగారు తమ్ముడు ఫణి కి " పేద్ద.. పెద్దక్క " గా,
పౌరుషానికీ, పంతాలకీ ప్రతీక గా
" పరిమి " వారింటికి " ఆడబడుచు " గా,
"చిట్టి అమ్మన్న" గారికి " మనవరాలు కోడలి" గా,
భమిడిపాటి వారింటి " బుల్లి కోడలు" గా,
బంగారం లాటి శ్రీవారికి " అమ్మడు " గా,
బంగారు తల్లి రేణు కి " మమ్మీ " గా,
బంగారు తండ్రి హరికి "అమ్మ " గా,
జామాత విశాల్ కి " మమ్మీ " గా,
పుత్రవధు శిరీషకి " అత్తయ్య గారు " గా,
చిన్నారులు తాన్యా, ఆదిత్య లకు " అమ్మమ్మ " గా,
బుజ్జాయిలు నవ్య, అగస్థ్య లకు " నానమ్మ " గా,
( ఎక్కడో... సంతూర్ సబ్బు యాడ్ వస్తోందనుకుంటా......)
పాపా.. పాపా.. నీ పేరేంటమ్మా ?
దేవీ నవరాత్రుల్లో, సూర్యోదయ సమయంలో...
"
సప్తమి" ( సూర్య) లక్షింవారం ( లక్ష్మి)
ఇదమ్మా పేరు.....
పేరు ఒకటి, మనిషీ ఒకటే, రూపాలు ఎన్నెన్నో బంధాలు ఎన్నెన్నో......
ఇన్ని మమతానుబంధాలతో.. జీవితమే సఫలమూ....